మంత్రిమండలి
నేశనల్ కమిశన్ ఫర్ హోమియోపతి బిల్లు, 2019లో ఆధికారిక సవరణల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
29 JAN 2020 2:03PM by PIB Hyderabad
హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ (హెచ్‌సిసి) యాక్ట్, 1973ను సవరించడం కోసం నేశనల్ కమిశన్ ఫర్ హోమియోపతి బిల్లు, 2019 లో ఆధికారిక సవరణల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగి న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బిల్లు రాజ్య సభ లో అనిర్ణీత స్థితి లో ఉంది.
ఈ సవరణ లు..:
• హోమియో విద్య రంగం లో అవసరమైనటువంటి నియంత్రణ సంబంధిత సంస్కరణల కు మార్గాన్ని సుగమం చేస్తాయి.
• సాధారణ ప్రజానీకం యొక్క హితాన్ని పరిరక్షించడం కోసం జవాబుదారీ కి మరియు పారదర్శకత్వాని కి వీలు ను కల్పిస్తాయి. దేశం లోని అన్ని ప్రాంతాల లో ఆరోగ్య సంరక్షణ సేవ లు తక్కువ ఖర్చు లో లభ్యం కావడాన్ని కమిశన్ ప్రోత్సహించనుంది.
పూర్వరంగం:
సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ హోమియోపతి మరియు తత్సంబంధిత అంశాల నిర్వహణ కు, హోమియోపతి విద్య ను మరియు అభ్యాసాన్ని నియంత్రించేందుకు ఒక సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ని నెలకొల్పడం కోసం హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ (హెచ్‌సిసి) యాక్ట్, 1973కు చట్టరూపాన్ని ఇవ్వడం జరిగింది. ఈ చట్టాన్ని ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్, 1956 తరహా లో రూపొందించారు. బోర్డు విధులు, నిర్మాణం, నియంత్రణల ను రూపొందించే అధికారాలు.. ఇవి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో మాదిరిగానే ఉన్నాయి. ఈ చట్టం హోమియోపతి వైద్య విద్య యొక్క ఎదుగుదల కు మరియు అభ్యాసాని కి ఒక గట్టి పునాది ని అందిస్తోంది. అయితే, కౌన్సిల్ యొక్క పనితీరు లో వివిధ అవరోధాల ను ఎదుర్కోవడం జరిగింది. దీనితో వైద్య విద్య తో పాటు నాణ్యమైన హోమియోపతి ఆరోగ్య సంరక్షణ సేవల అందజేత పైన కూడా తీవ్ర హానికర ప్రభావాలు ప్రసరించాయి.
**
(Release ID: 1601060)
Visitor Counter : 142
Read this release in:
Manipuri
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada