మంత్రిమండలి

నేర సంబంధ‌మైన వ్య‌వ‌హారాల లో ప‌ర‌స్ప‌ర న్యాయ స‌హాయం అంశం పై బ్రెజిల్ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 22 JAN 2020 3:38PM by PIB Hyderabad

నేర సంబంధ‌మైన వ్య‌వ‌హారాల లో ప‌ర‌స్ప‌ర న్యాయ స‌హాయం అంశం పై ఫెడ‌రేటివ్ రిప‌బ్లిక్ ఆఫ్‌ బ్రెజిల్ కు మ‌రియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కు మ‌ధ్య ఒప్పందాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఈ ఒప్పందం పై సంత‌కాలు జరుగవలసివుంది.

నేర సంబంధ వ్య‌వ‌హారాల లో ప‌ర‌స్ప‌ర న్యాయ స‌హాయం మ‌రియు స‌హ‌కారాన్ని అందించుకోవ‌డం ద్వారా నేరం యొక్క దర్యాప్తు లోను, నేరం యొక్క విచార‌ణ లోను రెండు దేశాల లో ప్ర‌భావ‌శీల‌త ను పెంపొందింపచేయడమే ఈ ఒప్పందం యొక్క ధ్యేయం గా ఉంది.  దేశ సరిహద్దుల కు ఆవల జరిగినటువంటి నేరం మ‌రియు ఆ నేరం తో ఉగ్ర‌వాదానికి లంకెలు ఉన్న సందర్భాల లో, నేర దర్యాప్తు, నేర విచార‌ణ ల‌తో పాటు నేర ఉపకరణాల జాడ తీయడం లో, ఆ ఉపకరణాల ను స్వాధీనం చేసుకోవడం లో, ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ కు ఆర్థిక స‌హాయం చేయ‌డాని కి ల‌క్షించిన‌ నిధి ని జప్తు చేయడం లో ఫెడ‌రేటివ్ రిప‌బ్లిక్ ఆఫ్ బ్రెజిల్ తో ద్వైపాక్షిక స‌హ‌కారాని కి ఒక స్థూల‌మైన లీగ‌ల్ ఫ్రేమ్ వ‌ర్క్ ను ప్ర‌తిపాదిత ఒప్పందం ఏర్ప‌రుస్తుంది.

 

**


(Release ID: 1600281)