మంత్రిమండలి

విద్యుత్తు సరఫరా రంగం లో సహకారానికి జపాన్ కోల్ ఎనర్జి సెంటర్ కు మరియు భారతదేశానికి మధథ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 11 DEC 2019 6:11PM by PIB Hyderabad

మన్నికైనటువంటి, స్థిరమైనటువంటి మరియు కర్బనాన్ని తక్కువ స్థాయి లో ఉపయోగించుకొనేటటువంటి విద్యుత్తు ను సరఫరా చేస్తూ పర్యావరణ పరం గా మెరుగుదల కు తోడ్పడేలా జపాన్ కు మరియు భారతదేశాని కి మధ్య సహకారానికి ఉద్దేశించిన ఓ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పై సెంట్రల్ ఇలెక్ట్రిసిటి ఆథారిటి, ఇండియా, ఇంకా జపాన్ కోల్ ఎనర్జి సెంటర్ సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 

ఈ ఎంఒయు మన్నికైనటువంటి, స్థిరమైనటువంటి మరియు కర్బనాన్ని తక్కువ స్థాయి లో ఉపయోగించుకొనేటటువంటి విద్యుత్తు ను అభివృద్ధిపరచే ప్రక్రియల ను వేగిరపరచడం లో తల ఎత్తే సమస్యల ను పరిష్కరించేందుకు, ఎదురయ్యే అడ్డంకుల ను తొలగించేందుకు తోడ్పడే ఒక ఫ్రేం వర్క్ ను సమకూర్చుతుంది.  దీనికిగాను అధ్యయనాలు, శిక్షణ కార్యక్రమం మరియు జ్ఞానాన్ని పరస్పరం పంచుకొనే కార్యకలాపాల ను ఓ మాధ్యమం గా వినియోగించుకొంటారు.  తద్వారా అందే ఫలితాలు భారతదేశం లో విద్యుత్తు సమగ్ర అభివృద్ధి కి అనుకూలంగా ఉండగలగడం తో పాటు భారత ప్రభుత్వం సంబంధిత విధానాన్ని త్వరిత గతి న అమలు చేసేందుకు కూడా ఉపకరిస్తాయి. 
 

**



(Release ID: 1596089) Visitor Counter : 143