మంత్రిమండలి

ఇండస్ట్రియ‌ల్ రిలేశన్స్ కోడ్ బిల్లు, 2019కి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 20 NOV 2019 10:35PM by PIB Hyderabad

పార్ల‌మెంటు లో ఇండ‌స్ట్రియ‌ల్ రిలేశన్స్ కోడ్ బిల్లు, 2019ని ప్ర‌వేశ‌పెట్ట‌డాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదాన్ని తెలిపింది.

లాభాలు:

·  ఇద్ద‌రు స‌భ్యుల ప్రత్యేక న్యాయాస్థానాన్ని (ఒక స‌భ్యుని స్థానం లో) ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ముఖ్య‌మైన కొన్ని కేసుల ను సంయుక్తం గా న్యాయ నిర్ణ‌యం చేయ‌డానికి మ‌రియు మిగిలిన కేసుల ను ఒకే స‌భ్యుని ద్వారా న్యాయ నిర్ణ‌యం చేయ‌డానికి అనువుగా ఉండ‌టం చేత దావాల ను శీఘ్ర గ‌తి న ప‌రిష్క‌రించ‌డం సాధ్యపడుతుంది.

· ‘ఎగ్జిట్’ నిబంధనల (రిట్రెంచ్‌మెంట్ వగైరాల కు సంబంధించినవి) లో స‌ర‌ళ‌త్వాన్ని సంత‌రించ‌ వచ్చును.  తద్వారా త‌గిన ప్ర‌భుత్వ పూర్వామోదం కోసం అవసరమైనటువంటి ఆరంభిక పరిమితి ని 100 మంది ఉద్యోగుల స్థాయి వ‌ద్దే యథావిధి గా ఉంచ‌డం జ‌రిగింది; అయితే, దీనిలో ఒక నిబంధన ను కూడా జోడించడమైంది. దాని ప్రకారం నోటిఫికేశన్ ద్వారా ‘అటువంటి ఉద్యోగుల సంఖ్య ను’ మార్చ‌వచ్చును.

·  నైపుణ్యాల ను బోధించేందుకు అవ‌స‌ర‌మైన నిధి ని శ్రామికుల కు రుణాల ను ఇచ్చేందుకు ఉప‌యోగిస్తారు; అయితే ఇందుకు తగిన విధానాన్ని ఇంకా నిర్ధారించవలసివుంది.

· నిర్ణీత అవధి తో కూడిన ఉపాధి తాలూకు నిర్వ‌చ‌నం. దీని ప్రకారం ఏ విధ‌మైన నోటీస్ గడువు అనేది ఉండదు; అంతే కాదు, రిట్రెంచ్‌మెంట్ జరిగినప్పుడు ప‌రిహారం చెల్లింపు ను గురించి ఇందులో చేర్చడం జరుగలేదు.

· జరిమానా ల రూపం లో పెనాల్టీ తో జతపడినటువంటి వివాదాల లో న్యాయ నిర్ణ‌యం కోసం ప్ర‌భుత్వ అధికారుల కు అధికారాల‌ ను ఇవ్వడం జరుగుతుంది. దీని తో ప్రత్యేక న్యాయస్థానం యొక్క కార్యభారం తగ్గిపోతుంది.


**  


 



(Release ID: 1592950) Visitor Counter : 172