ప్రధాన మంత్రి కార్యాలయం
2019 జూన్ 25వ తేదీన లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి ఇచ్చిన సమాధానం
Posted On:
25 JUN 2019 11:55PM by PIB Hyderabad
మాన్య స్పీకర్ సర్,
17వ లోక్ సభ ఏర్పాటయ్యాక, మాననీయులు రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడ కు హాజరు అయ్యాను.
మాననీయులు రాష్ట్రపతి, వారి ప్రసంగం లో, మేము ప్రాథమ్యాల ప్రాతిపదిక న రూపొందించినటువంటి మరియు భారతదేశ సామాన్య మానవుల యొక్క ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం విశదీకరించినటువంటి అంశాల నమూనాను మీ ముందు ఉంచేందుకు ప్రయత్నం చేశారు. దేశ ప్రజలు ఏ ఆశల తో, ఆకాంక్షల తో మనలను ఈ సభ కు పంపించారో అవి రాష్ట్రపతి ప్రసంగం లో ప్రతిధ్వనించాయి. మరి ఈ కారణం గా ఆయన ప్రసంగాని కి ధన్యవాదాలు తెలపడం అంటే ఒక విధం గా దేశం లోని కోట్లాది ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడమే అవుతుంది.
ఈ దేశాని కి చెందిన అనేక మంది ప్రముఖులు, ఒక శక్తివంతమైన, రక్షితమైన, సుసంపన్నమైన, సమ్మిళిత దేశం కావాలని కలలు కన్నారు. ఆ కలల ను సాకారం చేయడానికి, ఒక దృఢమైన మార్గం లో, మరింత తీవ్రత తో, వేగం తో మనం ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయం లో ఇది చాలా అవసరం. ప్రస్తుత అంతర్జాతీయ వాతావరణం లో, మనం ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు.
ఇదే ఉత్సాహంతో, మనందరం కలసి ముందుకు పోవాలి. దేశ ప్రజల ఆకాంక్షల ను నేరవెర్చే క్రమం లో ఎదురయ్యే ప్రతి అవాంతరాన్ని మనం అధిగమించగలమన్న నమ్మకం నాకుంది. ఈ చర్చ లో, సుమారు 60 మంది గౌరవనీయ పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. మొదటి సారి ఎన్నికైన వారు కూడా వారి యొక్క అభిప్రాయాల ను తెలియజేసి, ఈ చర్చ ను మరింత అర్ధవంతమైంది గా మార్చడానికి ప్రయత్నించారు. అనుభవం ఉన్న వారు కూడా, వారిది అయినటువంటి శైలి లో ఈ చర్చ ను మరింత ముందుకు తీసుకుపోయారు.
ఈ చర్చ ను అర్ధవంతంగా చేసిన వారి లో శ్రీ అధిర్ రంజన్ చౌధరి, శ్రీ టి.ఆర్. బాలు, శ్రీ దయానిధి మారన్, శ్రీ సౌగత్ రాయ్, శ్రీ జయదేవ్ గారు, మహువా మొయిత్రా, శ్రీ పి.వి. మిధున్ రెడ్డి, శ్రీ వినాయక్ రౌత్, శ్రీ రాజీవ్ రంజన్ సింహ్, శ్రీ పినాకి మిశ్రా, శ్రీ నామా నాగేశ్వరరావు, శ్రీ మొహమ్మద్ అజం ఖాన్, శ్రీ అసదుద్దీన్ ఒవైసీ, శ్రీ ప్రతాప్ చంద్ర సారంగీ, డాక్టర్ హీనా గవిట్ లతో సహా ప్రతి ఒక్కరి కి నేను కృతజ్ఞుడి నై ఉన్నాను.
మనం అందరం మానవ మాత్రులం అన్నది వాస్తవం. మరి గత 30 రోజుల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. దాని నుండి బయట పడటం కష్టం. ఈ కారణం గా, ఎన్నికల ప్రసంగాల ప్రభావం ఇప్పటికీ ఇక్కడ కనబడుతోంది. అదే విధమైన కథలు ఇక్కడ కూడా వినబడ్డాయి. ఇది ప్రకృతి సహజం. ఆ గౌరవప్రదమైన స్థానం లో ఉన్న మీరు ఈ సభ ను నిర్వహించారు. ప్రతి ఒక్కరి ని పరిశీలన లోకి తీసుకొని చర్చ ను ముందుకు తీసుకుపోయారు. మీరు కూడా ఈ పదవి కి కొత్త వారే. ఎక్కడైనా కొత్త సభ్యులు ఉంటే, కొంత మంది వారి ని ప్రారంభం లోనే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు.
అయితే, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, మీరు ప్రతి పని ని, ఎంతో ప్రశంసయుతం గా పూర్తి చేశారు. ఆ విషయమై, కొత్త స్పీకర్ కు సహకరించినందుకు, నేను మీ అందరి ని అభినందిస్తున్నాను. సభ కు కూడా నేను కృతజ్ఞత లు వ్యక్తం చేస్తున్నాను.
మాన్య స్పీకర్ సర్,
అనేక దశాబ్దాల అనంతరం, ప్రజలు ఒక పటిష్టమైన తీర్పు ను ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వానికి మరొక మారు మరింత బలం తో అధికారాన్ని కట్టబెడుతూ వారు వోటు వేశారు. ఈ రోజు, ఈ మామూలు వాతావరణం లో, భారతదేశం వంటి శక్తివంతమైన ప్రజాస్వామ్యం లో, మన వోటరు ప్రదర్శించిన విజ్ఞత కు, పరిణతి కి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు. వోటరు తన కన్నా దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు, దేశం కోసం నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఈ ఎన్నికల్లో స్పష్టం గా కనుపించింది. అందువల్ల, దేశం లోని వోటర్లు అందరికీ అనేక అభినందనలు.
మేము పూర్తి గా కొత్తవారం మరియు అంతగా పరిచయం కాని వారం అయినప్పటి కి, 2014వ సంవత్సరం లో, దేశ ప్రజలు పరిస్థితుల నుండి బయటపడేందుకు ఒక ప్రయోగం వలె మాకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు తో నేను మరియు నా యావత్తు జట్టు ఆనందిస్తున్నాము. కానీ, 2019వ సంవత్సరం లో ప్రజా తీర్పు మమ్మల్ని సకల విధాలు గా పరీక్షించిన తరువాతే ఇవ్వడమైంది. వారు మమ్మల్ని అర్ధం చేసుకొన్నారు, మరి ఆ ప్రాతిపదిక నే, మమ్మల్ని అధికారం లోకి తీసుకువచ్చారు. ఇది ప్రజాస్వామ్యాని కి ఉన్నటువంటి అత్యంత మహా శక్తి. విజయం సాధించిన వారు, పరాజయం పాలయిన వారు, అలాగే ఈ రంగం లో ఇంటా బయటా, ప్రతి ఒక్కరు, ‘సర్వజనహితాయ, సర్వజనసుఖాయ’ (దీనికి ప్రజలందరి మంచి కోసం, అందరి సంతోషం కోసం అని భావం) అనే విధానాల అమలు కోసం విజయవంతమైన కృషి ని చేశారు. ఈ దేశాని కి సేవ చేయడం కోసం, ప్రజలు, మరో సారి వారి ఆమోదాన్ని తెలియజేశారు,
మాన్య స్పీకర్ సర్,
దైవం యొక్క రూపాల లో ఒక రూపం గా ఉన్న ప్రజలు ఒక వ్యక్తి పని ని ఆమోదించారన్న వాస్తవం కంటే సంతృప్తి ని ఇచ్చేది మరొకటి ఉండదు. ఇది ఒక్క గెలవడమో లేదా ఓడిపోవడమో లేదా గణాంకాల క్రీడో కాదు. ఇది ప్రజల పట్ల మనకు గల భక్తి, వచనబద్ధత, ఒక అంకిత భావం. ఇది ప్రజల కోసం జీవించడం, ప్రజల కోసం పోరాడడం. ఐదు సంవత్సరాల తిరుగులేని నిబద్దత, అంకిత భావానికి ప్రతిఫలం గా, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవాని కి ప్రతీక. అందువల్ల, గెలవడం గురించి లేదా ఓడిపోవడం గురించి నేను ఆలోచించను. దీని కి అతీతంగా నా ఆలోచనలు ఉంటాయి. 130 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆశయాలు, స్వప్నాలు ఎల్లప్పుడూ నా మనస్సు లో మెదులుతూ ఉంటాయి.
మాన్య స్పీకర్ సర్,
2014 లో, సెంట్రల్ హాల్ లో మొదటి సారి, నా దేశ ప్రజలు నా యొక్క ఆలోచనల ను మీ ముందు ఉంచే అవకాశాన్ని కల్పించినప్పుడు, నా ప్రభుత్వం పేద ప్రజలకు అంకితమని మాత్రమే చెప్పాను. ఆ ఐదు సంవత్సరాల తరువాత, ప్రజలు ఇవిఎమ్ ల మీట పై నొక్కడం ద్వారా నా పట్ల వారి యొక్క సంతృప్తి ని వ్యక్తం చేశారని నేను ఎంతో సంతృప్తి తో చెప్పగలను. ఈ చర్చ ఆరంభం లో, మొదటి సారి ఎం.పి. శ్రీ ప్రతాప్ సారంగ్ గారు మరియు నా ఆదివాసీ సముదాయాని కి చెందిన డాక్టర్ హీనా గవిట్ గారు అనేక సూక్ష్మ సమస్యల ను గురించి ప్రస్తావించారు. తదనంతరం వాటి కి నేను జోడించవలసినవి ఏమీ లేవని నేను భావిస్తున్నాను.
మాన్య స్పీకర్ సర్,
ప్రజా జీవితం లో మనకు మార్గదర్శకులుగా ఉన్న మన దేశ ప్రముఖులందరూ ‘నిరుపేదలు, వారి సంక్షేమం’ గురించే ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు. పూజ్య బాపూ, బాబాసాహబ్ ఆంబేడ్కర్ గారు, లోహియా గారు లేదా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ల వంటి ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని చెప్పారు. గత ఐదు సంవత్సరాల లో ఎవ్వరూ లేరనుకొనే వారి పక్కన ఎల్లప్పుడూ ప్రభుత్వం ఉంది అనే భావన కలిగేలా మేము పనిచేశాము.
స్వాతంత్య్రం అనంతరం, మనం అనుకోకుండానే ఒక సాంప్రదాయాన్ని ఆమోదించాము. దాని నే ప్రచారం చేశాము. అదేమిటంటే, ఒక సాధారణ పౌరుడు, తన హక్కుల ను వినియోగించుకోవాలంటే అతడు అనేక అవరోధాల ను, సవాళ్ళ ను అధిగమించవలసి వస్తుంది. నేను ఎవరినీ నిందించడం లేదు. అయితే, ఎటువంటి ఇబ్బందులు లేని విధం గా, సామాన్య పౌరుడు తన హక్కుల ను పొందలేడా? ఈ విధానం అలాగే ఉండాలని, మనం భావించాము.
ఈ విషయాల ను మార్చడానికి చాలా సమయం పడుతుందన్నది నాకు ఎరుకే. ఈ విషయాలన్నింటినీ ఒక తాటి మీదకు తీసుకు రావడం చాలా కష్టం. 70 సంవత్సరాల నుండి ఉన్న వ్యాధుల ను ఐదు సంవత్సరాల లో నయం చేయడం చాలా కష్టం. అయితే, అవరోధాలు ఎన్ని ఉన్నప్పటికీ, మేము, మా నిబద్ధత ను దారి మళ్లించడం కానీ నీరు కార్చడం కానీ చేయలేదనీ, అదే మార్గం లో పయనించామనీ చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏది వాస్తవమో, ఏది కాదో, ఈ దేశమే చెబుతుంది. మరుగుదొడ్డి అనేది కేవలం ఒక కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదనీ, గ్యాస్ అనేది కేవలం వంట కు ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే కాదని, దేశం గ్రహించింది. ప్రభుత్వం ఈ పథకాల ను తీసుకురావడానికి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటన్న సంగతి దేశానికి తెలుసు. గ్యాస్ కావాలని నేను ఎప్పుడూ అడగలేదు, నేను విద్యుత్తు లేకుండానే నా మొత్తం జీవితాన్ని గడిపాను, అలాంటప్పుడు వారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ?. ‘వారు ఎందుకు చేయడం లేదు?’ - అనే ప్రశ్న గతం లో ఉత్పన్నమవుతూ ఉండేది. ఈ రోజు వారు ఒక విశ్వాసాన్ని పెంచుకున్నారు. అందువల్ల, ‘ వారు ఎందుకు ఇది చేస్తున్నారు?’ అని అడుగుతున్నారు. ‘వారు ఎందుకు చేయడం లేదు?’ - అనే పరిస్థితి నుండి ‘వారు ఎందుకు ఇది చేస్తున్నారు?’ అనే పరిస్థితి కి చేరుకోడానికి మధ్య చాలా దూరం ఉంది. అయితే, వారికి విశ్వాసం ఉంది, ఈ రోజు వారు దేశం లో ఒక కొత్త సామర్ధ్యాన్ని అనుభవిస్తున్నారు. దాన్ని ముందుకు తీసుకుపోవాలని మేము ప్రయత్నిస్తున్నాము.
ఒక సంక్షేమ రాష్ట్రం పేదరికం తో ఉన్నప్పుడు, ఆ ప్రజల కు వివిధ సంక్షేమ పధకాల ద్వారా జీవన సౌలభ్యం కలిగించాలి. అయితే అదే సమయం లో దేశం కూడా అభివృద్ధి చెందాలి. పేద ప్రజల ను పైకి తీసుకు రావాలి, సాధికారిత ను కల్పించాలి. అయితే, అదే సమయం లో ఆధునిక భారతదేశం కూడా ముందుకు సాగాలి. అందువల్ల, అభివృద్ధి పథం ముందుకు సాగుతూనే ఉండాలి. సాధారణ ప్రజల సంక్షేమంపై ఒక వైపు దృష్టి కేంద్రీకరిస్తూనే, మరోవైపు ఆధునిక సదుపాయాల అభివృద్ధికి ఇతర పథకాల ను అమలు చేస్తూ ఉండాలి.
మేము రెండింటిపైనా దృష్టి పెట్టాము. చంద్రయాన్ తో సహా జాతీయ రహదారులు, ఐ-వేస్, జల మార్గాలు, రైల్వేలు, రహదారులు, ఉడాన్ పథకం ద్వారా వాయు మార్గాలు, స్టార్ట్- అప్ లు, నూతన ఆవిష్కరణలు, టింకరింగ్ ల్యాబ్స్ మొదలైన వాటితో ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలి. మనం అన్ని రకాల సవాళ్ళ తో పోరాడాలి.
ఇక్కడ చాలా కొత్త విషయాలు చెప్పడం జరిగింది. ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసే కొన్ని కఠిన విషయాల ను కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి కి ఒక వ్యక్తిగత అజెండా ఉంది. దీనిపై నేను వ్యాఖ్యానించను. అయితే, ఇక్కడ చెప్పినట్లు - ‘మా శక్తి ని ఎవరూ కించపరచలేరు’- అని చెప్పి పొరపాటు చేయలేము. ఎవరినైనా కించపరచి, మన సమయాన్ని వృథా చేసుకోలేము.
మీ ఔన్నిత్యం తో మీరు సంతోషంగా ఉండండి. మీరు భూమి ని చూడలేనంత ఎత్తు లో ఎగురుతున్నారు, మూలాల నుండి వేరు చేయబడ్డారు. క్రిందకు చూసి, భూమి మీద ఉన్న ప్రజల పై దృష్టి పెట్టండి. అందువల్ల, మీ high headedness నాకు మంచిదే. మీరు అలాగే ఉంటారని నేను ఆశిస్తున్నాను. high headedness విషయం లో మాకు మీతో పోటీ లేదు, ఎందుకంటే, మీ అందరితో కలసి మెలసి సన్నిహితం గా ఉండాలని మేము కలలు కంటున్నాము.
దేశాన్ని పటిష్ఠపరచాలనే మూలాల తో మా కల గట్టిగా పెనవేసుకొని ఉంది. అందువల్ల, మేము పోటీలో లేము. ఈ కారణం గా, మీ ఔన్నత్యం క్రమంగా పెరగాలని మేము కోరుకుంటున్నాము. కొంతమంది వ్యక్తులు ప్రశంసించబడతారు, నలుగురి లో ప్రస్తావించబడతారు అనేది వాస్తవం. ఒకవేళ ఎవరూ తమ ను ప్రస్తావించక పోతే, వారు అది ఒక అవమానం గా భావిస్తారు. అది కారణం కాకూడదు కానీ, అది అలానే జరుగుతుంది.
2014వ సంవత్సరాని కి ముందు అటల్ గారి ప్రభుత్వం ఉంది. 2004వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం వరకు అధికారం లో ఉన్నారు. వారు అటల్ గారి ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదు సరికదా, ఆయన చేపట్టిన కొన్ని మంచి పనుల ను కూడా తలచుకోలేదని నేను ఘంటాపథం గా చెప్తున్నాను. సరే, అటల్ గారి ని వదలివేయండి, వారు కనీసం నరసింహారావు ప్రభుత్వాన్ని సైతం మెచ్చుకోలేదు. అంతేకాక, తమ ప్రసంగాల లో, కనీసం డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారి ని గురించి కూడా వారు ఏమీ ప్రస్తావించలేదు. అటువంటి గొప్ప వారి తో పోల్చుకుంటే నేను చాలా చిన్న వాడి ని. నేను ఒక సామాన్య వ్యక్తి ని. అయితే, స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి, దేశాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాయని, ఎర్ర కోట మీది నుండి రెండు సార్లు చెప్పిన మొదటి ప్రధాన మంత్రి ని నేనే అన్న విషయాన్ని, మీరు ధ్రువపరచుకోవచ్చును.
ఇదే విషయాన్ని, ఈ సభ లో నేను అనేక సార్లు చెప్పాను. నేను దీని ని పునరుద్ఘాటించాలని అనుకుంటున్నాను. అవును, వారికి వేరే అంచనాలు ఉండవచ్చు. అయితే, మా స్వభావాన్ని, మనస్తత్వాన్ని, ఆలోచన లను తెలియజేసే ఒక ఉదాహరణ ను మీకు వెల్లడించాలని అనుకుంటున్నాను.
గుజరాత్ ముఖ్యమంత్రి గా దీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు లభించింది. అప్పుడు గుజరాత్ కు స్వర్ణోత్సవ సంవత్సరం. అందువల్ల, ఆ ఏడాది, అందరి ని కలుపుకొని, అనేక కార్యక్రమాల ను నిర్వహించాము. అయితే, ఈ రోజు న, ఒక ముఖ్యమైన పని ని గురించి నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. గత 50 సంవత్సరాల లో, గౌరవనీయులైన గవర్నర్లు చేసిన ప్రసంగాలన్నింటినీ ఒక పుస్తక రూపం లో కూర్చి, చరిత్ర లో నమోదు చేయాలని నేను చెప్పాను. ఇప్పుడు చెప్పండి, 50 సంవత్సరాల నుండి ఉన్న గవర్నర్లంటే, వారు ఎవరి ప్రభుత్వానికి చెందిన వారై ఉంటారు.
ఇది ఒక రకం గా, ఆ కాలం లో ఉన్న ప్రభుత్వ విజయాల సమాహారం గా ఉంటుంది. అవి మా పార్టీ కి చెందిన ప్రభుత్వాలు కాదు. అయినప్పటి కి, దేశ పురోగతి కి ముఖ్యమైన పాత్ర పోషించిన వారి కి గుర్తింపు ను ఇవ్వాలనేది మన స్వభావం కావాలి. ఇది ఒక సానుకూల ప్రక్రియ. ఇది వార్తాపత్రికల సంపాదకుల సంపాదకీయాల సంకలనం కాదు, ఇది గవర్నర్ల ప్రసంగాల సంకలనం, ఇది ఇప్పటికీ అందుబాటులో ఉంది.
ఇతరుల పని ని ఎప్పుడూ గుర్తించని వారికి, మమ్మల్ని విమర్శించే హక్కు లేదు. అలాగే, గత ప్రభుత్వాల పని ని మేము గుర్తించ లేదని చెప్పే హక్కు లేదు. నరసింహారావు గారి కి ఆయన పదవీకాలం లోనే భారత రత్న పురస్కారం అందవలసివుంది. అదే విధంగా డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారికి కూడా ఆయన మొదటి పదవీ కాలం ముగిసిన వెంటనే భారత రత్న రావలసివుంది.
అయితే, కుటుంబాని కి సంబంధించని వారి కి ఎవరి కి ఎప్పుడూ ఏమీ లభించవు. కానీ, మేము భిన్నంగా ఉన్నాము. ప్రణబ్ గారు ఏ పార్టీ కి చెందిన వారో, ఏ పార్టీ కి ఆయన పనిచేశారో అని మేము ఎప్పుడూ ఆందోళన చెందలేదు. దేశాని కి చేసిన సేవల ఆధారం గా ఆయన కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నాము. అందువల్ల, దయచేసి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు.. ఆ విధం గా ఇప్పటి వరకు లేదు. ఇక ముందు ఉండదు.
మేము ఎవరి సహాయాన్ని కూడా తిరస్కరించము. 125 కోట్ల మంది భారతీయులు ఈ దేశాన్ని ముందుకు తీసుకు పోయారు అని నేనంటే, అందులో, అందరు కలిసి ఉన్నట్లే. అందువల్ల, దయచేసి, ఈ చర్చ ను కించపరచ వద్దు,
మాన్య స్పీకర్ సర్,
‘ఇది ఎవరు చేశారు?’ అంటూ వారు అనేక నినాదాలు చేశారు. ఈ రోజు జూన్ నెల 25వ తేదీ. జూన్ 25వ తేదీ ప్రాముఖ్యం గురించి చాలా మందికి తెలియదు. వారు తమ పొరుగు వారి ని అడుగుతున్నారు. జూన్ 25వ తేదీ రాత్రి దేశం యొక్క ఆత్మ క్షోభించింది. భారతదేశం లో ప్రజాస్వామ్యం రాజ్యాంగం పుటల లో నుండి పుట్టింది కాదు. ప్రజాస్వామ్యం అనేది యుగాల నుండి మన దేశపు ఆత్మ లోనే ఉంది. అది నలిగిపోయింది. దేశం లోని ప్రసార మాధ్యమాలు గగ్గోలు పెట్టాయి. దేశం లోని ప్రముఖ వ్యక్తులను జైళ్ల లో పెట్టారు. కేవలం ఒకరి స్థానాన్నో లేదా అధికారాన్నో కాపాడటం కోసం మొత్తం భారతదేశాన్ని కారాగారం గా మార్చివేశారు. న్యాయ వ్యవస్థ ను, దాని తీర్పు ను అగౌరవపరచారనడానికి ఇది ఒక సజీవ ఉదాహరణ.
ఈ రోజు, జూన్ నెల 25వ తేదీ, ప్రజాస్వామ్యం పట్ల మన భక్తి ని మరో సారి వ్యక్తం చేయాలి. మరింత ఘనమైనటువంటి సాంద్రత తో సంకల్పాన్ని పునరుద్ఘాటించాలి. ఒకవైపు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకొంటూనే, మరోవైపు రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడం వంటి పాప కృత్యాల ను ఎవరూ మర్చిపోలేరు. ఈ పాపం లో భాగస్వాములైన వారందరూ ఈ మురికి మాసిపోదని గుర్తుంచుకోవాలి. ఇటువంటి పాపాని కి ఒడిగట్టే వ్యక్తి మరొకరు జన్మించ కుండా చూసే విధం గా ఈవిషయాన్ని తరచు గా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది కేవలం గుర్తుచేయాడానికే తప్ప, తిట్టుకోడానికి కాదు.
ఇది కేవలం ప్రజాస్వామ్యం పట్ల భక్తి యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తు చేయాడానికి మాత్రమే. ప్రసార మాధ్యమాలు గగ్గోలు పెట్టిన ఆ సమయంలో, ప్రతి ఒక్కరు ఎప్పుడు అరెస్టు అవుతామో అన్న భయం తో జీవించారు. ఎన్నికల సమయం లో తమ తీర్పు ను వెల్లడించారు. వారు ప్రజాస్వామ్యానికి వోటు వేసి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. నా దేశ వోటర్ల శక్తి, బలం ఇదే. కులం, మతం, శాఖ, భాష వంటి వాటి ని పక్కన పెట్టి కేవలం దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజలందరూ మరో సారి వోటు వేశారు.
మాన్య స్పీకర్ సర్,
రాష్ట్రపతి వారి ప్రసంగం లో, రెండు ముఖ్యమైన సంఘటనల ను గురించి ప్రస్తావించారు. ఒకటి గాంధీ 150వ జయంతి, మరొకటి 75వ స్వాతంత్య్ర దినోత్సవం. అది ఒక వ్యక్తి జీవితం గాని, లేదా ఒక కుటుంబం, లేదా ఒక సమాజం గాని, కొన్ని తేదీలు మన లో ఒక రకమైన కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. అవి జీవితాన్ని ఉత్తేజపరుస్తాయి, తీర్మానాల ను నెరవేర్చగల అనుభూతి ని కలిగిస్తాయి. భారతదేశాని కి పూజ్య బాపూజీ కంటే గొప్ప స్ఫూర్తి ప్రదాత ఎవరూ లేరు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తుల స్మృతులు ఎప్పుడూ మనల్ని వెన్నంటే ఉంటాయి. మనం ఈ అవకాశాన్ని కోల్పోకూడదు.
దేశం కోసం ప్రాణాలర్పించిన వారి ని, భరత మాత సేవ లో వారి జీవితాన్ని గడిపిన వారి ని, పూజ్య బాపూజీ ని, స్వాతంత్య్ర ఉద్యమాన్ని విజయవంతం గా నిర్వహించిన వారి ని స్మరించుకొని, ఆయా తేదీల ను ఒక అవకాశం గా మలచుకొని దేశం లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుకుందాము. ఇది ఒక పార్టీ లేదా ఒక ప్రభుత్వం అజెండా కాకూడదు. దేశవ్యాప్తం గా ఇప్పుడు ఇదే అజెండా కావాలి. ఇందులో పార్టీ లు లేవు, కేవలం దేశం మాత్రమే. మాననీయ రాష్ట్రపతి గారు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తీర్మానాలను నెరవేర్చుకోడానికి ఇదే మంచి తరుణం. ఎన్నికల రంగం లో మనం ఒకరితో మరొకరు చర్చించుకొని ఉండవచ్చు, కానీ ఇప్పుడు మనందరం ఈ అవకాశాన్ని వినియోగించుకుందాము. స్వాతంత్య్రానికి ముందు దేశం కోసం ప్రాణాలర్పించే వారు, కానీ ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ప్రజలు దేశం కోసం జీవించాలని భావిస్తున్నారు.
సభ లోని ప్రతినిధులందరి కి నేనొక విజ్ఞప్తి ని చేయాలనుకుంటున్నాను. మాననీయ రాష్ట్రపతి గారి ఆదేశాలు, అంచనాలు, కోరికల ను మనము అనుసరించడానికి ముందుకు సాగుదాము. న్యూ ఇండియా ను నిర్మించడానికి, సాధారణ ప్రజానీకం తో కలసి, ఈ రెండు ముఖ్యమైన అవకాశాల ను వినియోగించుకోడానికి ప్రయత్నిద్దాము.
భారతదేశం చాలా కాలం వలస పాలన లో ఉంది. అయితే, ఆ కాలం లో ప్రజలకు తిరగబడే అవకాశమే రాలేదు, లేదా దేశం లో ఏ ప్రాంతం లోనూ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించవలసిన అవసరం రాలేదు. 1857 లో ఒక వ్యవస్థీకృత బృందం తయారయ్యింది. అయితే, మహాత్మా గాంధీ ఒక భారీ కార్యక్రమం చేపట్టారు. సామాన్య ప్రజానీకాన్ని- ఆయన స్వాతంత్య్ర సమరయోధులు గా తయారు చేశారు. ఆయన ఊడిస్తే అది స్వాతంత్య్రం కోసం, ఆయన విద్యార్థుల కు బోధిస్తే అది స్వాతంత్య్రం కోసం, ఆయన ఖద్దరు ను ధరిస్తే అది స్వాతంత్య్రం కోసం.
మాననీయులైన బాపు దేశవ్యాప్తంగా ఆ విధమైన ఒక వాతావరణాన్ని తయారుచేశారు. 1942వ సంవత్సరం లో దేశం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం లో నిమగ్నం అయ్యింది. 1942వ సంవత్సరం నుండి 1947వ సంవత్సరాల మధ్య స్వాతంత్య్ర సంగ్రామం ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. గాంధీ 150వ జయంతి సందర్భం గా మరియు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భం గా, ఆ స్పూర్తి తో, దేశాన్ని సమస్యల నుండి దూరం చేయడానికి, మన బాధ్యతలను నొక్కి చెప్పడానికి, దేశాన్ని ప్రేరేపించడానికి, మన బాధ్యతల ను నెరవేర్చడానికి, మనం ముందుకు రాగలమా?
మాననీయ రాష్ట్రపతి గారు ఈ విషయాన్ని చాలా ముఖ్యమైన రీతి లో మన ముందు ఉంచారని నేను భావిస్తున్నాను. స్వాతంత్య్రం కావాలని కోరుకొన్నప్పుడు, ఈ దేశాన్ని మనం ఏ విధం గా పరిపాలించగలమా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. వారు దీని పట్ల అనుమానం వ్యక్తం చేశారు. అయితే, స్వాతంత్య్ర సమరయోధులకు దృఢ సంకల్పం ఉంది. స్వాతంత్య్రం కోసం జీవితాల ను త్యాగం చేసే వారి కి, స్వాతంత్య్రం కోసం జీవించే వారి లో, ఆ శక్తి ని ప్రేరేపించే భిన్నమైన స్ఫూర్తి కలిగి ఉంటుంది. ఈ నాయకత్వాని కి ఆ సామర్ధ్యం ఉంది.
ఇది అందరి కోసం. ఇది కేవలం నా కోసం, నా పార్టీ కోసం కాదు. మనం అందరం కలసి దీన్ని సాధించగలం. ఇది నా వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు. అటువంటి సంకుచితమైన ఆలోచన నాకు లేదు. నేను ఎప్పుడూ సూక్ష్మం గా ఆలోచించను. అంతే కాదు, 125 కోట్ల మంది భారతీయుల స్వప్నాల ను సాకారం చేయాలని అనుకుంటే, సంకుచితం గా ఆలోచించే హక్కు నాకు లేదు.
जब हौसला बना लिया ऊँची उड़ान का
फिर देखना फिजूल है कद आसमान का।
ఈ స్పూర్తి తో, కొత్త సంకల్పం తో మనం తప్పక ముందుకు సాగాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటై కేవలం మూడు వారాలు అయ్యింది. అయితే, - पुत्र के लक्षण पालने में। అంటూ ఒక సామెత ఉంది.
మేము కూడా మా విజయాన్ని సంబరంగా జరుపుకోగలము. కానీ మేము ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఆరు నెలల పాటు ఎన్నికల సన్నాహకాల కోసం కష్టపడ్డాక, కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకోవచ్చు, కానీ అది మాకు నచ్చదు.
ఆ మార్గాన్ని మేము ఎంచుకోలేదు. మేము దేశం కోసం జీవించడానికి వచ్చాము. మూడు వారాల లో ఈ ప్రభుత్వం, అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేస్తున్నాము. చిన్న దుకాణదారుల కు, రైతుల కు, రైతు కూలీల కు పింఛను విషయమై 60 ఏళ్ల తరువాత నిర్ణయం తీసుకున్నాము.
ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి యోజన పరిధి లోకి రైతులందరినీ తీసుకువస్తామని మేము హామీ ఇచ్చాము. ఆ హామీ ని నెరవేర్చాము. సైనికుల పిల్లల ఉపకార వేతనాల ను పెంచడం తో పాటు సమాజ భద్రత కు బాధ్యత వహిస్తున్న పోలీసు సిబ్బంది పిల్లలకు కూడా ప్రయోజనాల ను కల్పించాము. ముఖ్యమైన మానవ హక్కులకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు లో ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేశాము. 2022వ సంవత్సరం కల నెరవేర్చే దిశ లో భాగంగా, ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం తో సహా అఖిలపక్ష సమావేశం, అన్ని రాజకీయ పార్టీ ల అధ్యక్షుల తో సమావేశం ఏర్పాటు చేయడం వంటి సాధ్యమైన అన్ని పనులు కేవలం 3 వారాల లో పూర్తి చేశాము. మేము లెక్కపెట్టడం మొదలుపెడితే, మేము చేసిన పనులు సగటు న రోజు కు మూడు ఉంటాయి. అందువల్ల, మాన్య స్పీకర్ గారు, మాననీయ రాష్ట్రపతి గారు వారి ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఏ పనీ చేయలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు.
పలు ప్రాంతాల లో నీటి రిజర్వాయర్ లను నిర్మించే అంశం పై చర్చ కొనసాగింది. ఈ చర్చ లో శ్రీ బాబాసాహబ్ ఆంబేడ్కర్ పేరు ను ప్రస్తావించి వుంటే బాగుండేది. భారతదేశం లో ఉన్న నీటి సంబంధిత కార్యక్రమాలను శ్రీ బాబాసాహబ్ ఆంబేడ్కర్ నాయకత్వం కిందకు తీసుకొని రావడం జరిగింది. ఏది ఏమైతేనేం ఒక స్థాయి కి వెళ్లిపోయిన తరువాత క్షేత్ర స్థాయి ని చూడరు. నాడు శ్రీ బాబాసాహబ్ ఆంబేడ్కర్ కేంద్ర నీటి విధానాల ను గురించి, సాగునీటి వ్యవస్థ ను గురించి, నౌకాయనాన్ని గురించి మాట్లాడే వారు. శ్రీ బాబాసాహబ్ నాడు ఇచ్చిన సూచనలు, సలహాలు నేటికి కూడా అనుసరించదగ్గవే అని నేను నమ్ముతున్నాను. ఆయన అంటుండే వారు.. రాబోయే రోజుల్లో మనం ఇబ్బంది పడేది నీటి కి అందుబాటులో లేకపోవడం వల్ల కాదు, నీరు లభ్యం కాక అని. ఆయన దీనిపై తన ఆందోళన ను వ్యక్తం చేశారు. ఆయన ఆలోచనల కు అనుగుణం గా ఇప్పుడు మనం కార్యాచరణ ను రూపొందించుకోవాలి.
నీటి రిజర్వాయ్ లకు సంబంధించిన చర్చల లో సర్ దార్ సరోవర్ రిజర్యాయర్ గురించి కూడా చర్చించడం జరిగింది. మాన్య స్పీకర్ గారికి విన్నవించుకుంటున్నాను.. దీని పై నేను కొంత సమయం తీసుకుంటాను. కొన్ని సార్లు వదంతులు వ్యాపించాయి. వారి స్వభావం కారణంగా అలా చేయడాన్ని వారు ఆస్వాదించారు. వారు ఎలాగైనా సరే వాస్తవాల ను బయటకు రానీయరు. ఈ రోజు న ఇక్కడ నేను వివరణలు ఇచ్చినప్పటికీ వాస్తవం వెలికి వస్తుందనే పూచీ లేదు. అయినప్పటికీ నా విధి ని నేను నిర్వహించడమే నాకు సంతోషాన్ని ఇస్తుంది.
సర్ దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణం కోసం 1961వ సంవత్సరం లో శ్రీ పండిత్ నెహ్రూ పునాది రాయి ని వేశారు. ఈ రిజర్వాయరు ను నిర్మించాలనేది శ్రీ సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ కన్న కల. దాన్ని సాకారం చేయడానికిగాను 1961వ సంవత్సరం లో పునాది రాయి ని వేయడం జరిగింది. అయితే ఆ తరువాత అనేక దశాబ్దాల పాటు దీనికి ఆమోదం లభించలేదు. నాడు పునాది రాయి ని వేసే సమయాని కి అనుమతులు లేవు. ఆ సమయం లో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.6 వేల కోట్లు. అయితే అది పూర్తి అయ్యే సమయానికి రూ. 60 వేల కోట్ల నుండి రూ.70 వేల కోట్లు వరకు ఖర్చు అయ్యాయి.
దీనివల్ల జాతి కి మనం చేసిన సేవ ఏంటి? అంతే కాదు, యూపిఏ హయాం లో ఈ ప్రాజెక్టు ను ఆపడానికి ప్రయత్నాలు జరిగాయి. 1986-87 సంవత్సరాల మధ్య ప్రాజెక్టు వ్యయం 6 వేల కోట్ల రూపాయలు. అది ఆ తరువాత 62 వేల కోట్ల రూపాయలకు చేరుకొంది. మేం పాలన లోకి వచ్చాము. ప్రాజెక్టు ను పూర్తి చేశాము. ఈ ప్రాజెక్టు కోసం గతం లో నేను నిరాహారదీక్ష చేశాను. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి ని. మొత్తం ఆపివేశారు. ఇప్పుడు చూడండి ప్రాజెక్టు పూర్తి అయింది. నేను ప్రధాన మంత్రి ని అయిన తరువాత 15 రోజుల్లోనే ఈ ప్రాజెక్టు కు వున్న అవరోధాలు అన్నిటినీ తొలగించాను.
ఈ రోజు న దాదాపు 4 కోట్ల మంది ప్రజలు దీని ద్వారా లబ్ధి ని పొందుతున్నారు. ఇప్పుడు పరిశుభ్రమైన నీరు ఏడు మెట్రో నగరాలకు, 107 పురపాలక సంఘాలకు, 9 వేల గ్రామాలకు అందుతోంది. నీటి కొరత అంటే ఏంటో రాజస్థాన్, గుజరాత్ ప్రజల కు తెలుసు. అందుకే మేం ప్రత్యేకం గా ఒక జల శక్తి మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేశాము. నీటి కి సంబంధించిన సమస్యల ను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఈ సీజన్ లో ఎంత వీలయితే అంత నీటి ని పొదుపు చేయాల్సి వుంది.
స్వచ్ఛంద సేవా సంస్థల కు చెందిన గౌరవనీయులైన సభ్యుల కు నేను విజ్ఙప్తి చేస్తున్నాను .. దేశం లో నీటి లభ్యతను పెంచాలి అని. ప్రభుత్వ పరిధి ని దాటి మీరు ఈ పని ని చేయాలి. నీటి ని పొదుపు చేయడం ద్వారా సామాన్యుల జీవితాల ను కాపాడగలిగినవారం అవుతాము. నీటి కి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు అవి పేదవారి ని ముఖ్యంగా తల్లుల ను, సోదరీమణుల ను తీవ్రం గా ఇబ్బంది పెడతాయి.
మన సోషలిస్టు స్నేహితుల కు ఏమైందో నాకు తెలియదు. కానీ లోహియా గారు అంటుండే వారు.. ఈ దేశం లో మహిళల కు రెండు సమస్యలు ఉన్నాయని. అవి నీరు, పారిశుద్ధ్యం. ఈ సమస్యలు మాతృమూర్తుల కు, సోదరీమణుల కు కలగకుండా చేయాలని లోహియా గారు పదే పదే చెప్పే వారు. ఎంతో పకడ్బందీ గా పని చేయడం ద్వారా మన మాతృమూర్తులు, సోదరీమణుల కోసం మరుగుదొడ్లు నిర్మించి లోహియా గారి స్వప్నాన్ని మేం సాకారం చేశాము. తద్వారా వారికి పారిశుద్ధ్య సమస్య నుండి విముక్తి ని కలగజేశాము. ప్రతి ఇంటి కి నీటి ని అందించాలనే సంకల్పం తో ముందడుగు వేశాము.
నాకు తెలుసు ఇది చాలా కష్టమైన పని అని. బహుశా ఎవరైనా ఈ విషయం లో నా పని విధానాన్ని పరిశీలించి నాకు అపజయాన్ని ఆపాదించవచ్చు. మోదీ కి నూటి కి 70 మార్కుల కు బదులుగా యాభై మార్కులు ఇవ్వవచ్చు. కానీ ఎవరో ఒకరు ప్రారంభించాలి. ఆ పని ని మేం చేశాము. నేను మాట్లాడుతున్నది జల్ శక్తి మంత్రిత్వ శాఖ ను గురించి. నీటి సంరక్షణ తరువాత నీటి పారుదల అనేది మరో బాధ్యత. చెరకు పంట సాగు కు సూక్ష్మ నీటి పారుదల ఎంతో మేలు గా ఉంటుందని ప్రపంచవ్యాప్తం గా నిరూపితమైంది. ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా ఎవరు చెబుతారు? సూక్ష్మ నీటి పారుదల ద్వారా వచ్చే ప్రయోజనాల గురించి రైతులకు ఎవరు చెబుతారు? మా ప్రభుత్వం అమలు చేసే పథకం తో నిధులు ఖర్చు చేసి నీటి ని పొదుపు చేయడం జరుగుతోంది. అలాంటి పనులు అనేకం జరిగాయి. ప్రతి నీటి బొట్టు ను పొదుపు చేయడం ద్వారా మన జాతి ముందడుగు వేసేలా చేయాలి.
మన దేశ ఆర్ధిక రంగాని కి వ్యవసాయం వెన్నెముక లాంటిది. ఇది మన గ్రామీణ ఆర్ధిక రంగాని కి వెన్నెముక. అయితే మనం గతించిపోయిన విధానాల్ని, వ్యవస్థల్ని వదిలేయాలి. సాగు కు అయ్యే ఖర్చుల్ని తగ్గించాలి. జీరో బడ్జెటు వ్యవసాయ ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. దిగుబడుల్లో తగ్గుదల లేదు. సమగ్రమైన ఆరోగ్య భద్రత ను కోరుకుంటున్న ఈ రోజుల్లో నాణ్యత అనేది మెరుగవుతోంది.
రాజకీయాల తో సంబంధం లేకుండా మేం పని చేశాము. అంతే కాదు ఏ కార్యక్రమాన్నయినా ప్రభుత్వ కార్యక్రమంగా భావించలేదు. మన దేశ రైతుల సంక్షేమం కోసం అందరమూ కలిసికట్టుగా పని చేయాలి. మనందరం రైతుల చేతులు పట్టుకొని ముందుకు నడిపించాలి. కార్పొరేట్ రంగం పెట్టుబడులు వ్యవసాయ రంగం లో లేవు. ఈ విషయం లో కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించవలసి ఉంది. వారి కోసం కొన్ని నియమ నిబంధనల ను, చట్టాల ను ఏర్పాటు చేయాలి. లేకపోతే ట్రాక్టర్ ను అందించడాన్ని కొంతమంది పెట్టుబడి అని నమ్ముతారు. కానీ మనకు కార్పొరేట్ ప్రపంచం పెట్టుబడులు పెట్టడం కావాలి. ఈ రంగం ఆహార ఉత్పత్తుల తయారీ లో, గోదాముల ను, శీతల గిడ్డంగుల ను నిర్మించడంలో ఈ పెట్టుబడులు పెట్టాలి. ఇది ఇప్పటి అవసరం. దీని ని ప్రోత్సహించే దిశ గా మనం తప్పకుండా పని చేయాలి.
విత్తనం దగ్గర నుండి దిగుబడులను విపణి లో విక్రయించే వరకు రైతుల కు అన్ని రకాల అవకాశాల ను కల్పించడానికి గాను ఏపీఓల సాయం తో ఒక వ్యవస్థ ను నిర్మించాలి. ఇది వ్యవసాయ రంగం లో ఎగుమతులకు గాను అపారమైన అవకాశాల ను కలగజేస్తుంది.
గతం లో అంటే 2014వ సంవత్సరం లో పప్పు దినుసుల ధరలు సమస్య గా తయారయ్యాయి. కానీ రైతులు కనబరచిన స్ఫూర్తి ని చూడండి. పప్పు దినుసుల పంటల ను అధికం గా పండించాలని నేను ఒక చిన్న విజ్ఞప్తి ని చేశాను. వెంటనే నా రైతు సోదరులు ముందుకు వచ్చి దేశానికి కావలసిన పప్పు దినుసుల పంటల ను పండించారు. ఈ పప్పు దినుసుల పంటల తరువాత నూనె పంటల ను పండించే విషయం లో మన రైతుల ను ప్రోత్సహించవలసి వుంది. మన దేశం ఇక ముందు నూనెల ను, వంటనూనెల ను దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి బయటపడాలి. మన దేశ రైతులు తమకు కావలసిన స్ఫూర్తి ని పొందగలరని నేను నమ్ముతున్నాను. భవిష్యత్ దార్శనికత తో రైతుల సామర్థ్యాన్ని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను, దేశ అవసరాల ను అనుసంధానం చేయగలిగేలా మనం పని ని చేయాలి. ఈ దిశగా మనం ముందడుగు వేయాలి.
మాన్య స్పీకర్ సర్,
గణాంకాల విషయం లో ఇది వాస్తవం. ఏ విధంగా చూసినా వాటి ని విమర్శలు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. జాతి కన్న కలల్ని సాకారం చేయడమనేది ఒకరి హయాం లో ఎంతో సంతోషకరమైన విషయంగా వున్నది. మరొకరి హయాం లో మాత్రం పట్టించుకునే అంశంగా లేదు. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ 13వ స్థానం నుండి 11వ స్థానాని కి చేరుకున్నప్పుడు ఇదే సభ లో ఉత్సాహం పెల్లుబికింది. అందరూ బల్లలు చరుస్తూ వారి సంతోషాన్ని వెలిబుచ్చారు. అప్పుడు దీని ని అతి గొప్ప విజయం గా అభివర్ణించారు. కానీ ఇప్పుడు భారతదేశం 6వ స్థానాని కి చేరుకుంది. అయితే ఆ సంతోషాన్ని మాత్రం కోల్పాయాము. అప్పుడు ఇప్పుడు ఒకే దేశం. మనం అదే దేశాని కి చెందిన ప్రజలము. 11వ స్థానాని కి చేరుకోవడం సంతోషకరమైన సంగతి అయితే 6వ స్థానాన్ని చేరుకోవడం మరింతగా సంతోష పెట్టాలి. కేవలం అత్యున్నత విషయాలు మాట్లాడుతూ వాస్తవాలను చూడకుండా ఎంతకాలం వుండగలం? 5 ట్రిలియన్ డాలర్ విలువ గల ఆర్ధిక వ్యవస్థ ను సాధించడమనేది మనందరి కల గా ఎందుకుండకూడదు? మన దేశం 5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్ధిక వ్యవస్థ గా రూపొందితే ఎవరికి నష్టం వస్తుంది? ఎవరికీ నష్టం రాదు. అందరమూ లబ్ధి ని పొందుతాము. దానికోసం మనందరం కష్టపడి పనిచేయాలని నేను నమ్ముతున్నాను. ఆ కల ను సాకారం చేయడానికి మనందరం ముందడుగు వేయాలి. మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ప్రకటించినప్పుడు అందరూ నవ్వారు. కానీ ఇప్పుడు దేశం లో దాని పాత్ర ను ఎవరైనా కాదనగలరా?
మాన్య స్పీకర్ సర్,
ఇక్కడ నేను ఎవరి ని విమర్శించదలుచుకోలేదు. నా సమయాన్ని వృథా చేసుకోలేదు. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కానీ దేశ ప్రజలకు కొన్ని విషయాల ను తెలియజేయడం ముఖ్యమని భావిస్తున్నాను. లోహాలను తయారు చేయడంలో మన దేశానికి 200 నుంచి 225 సంవత్సరాల అనుభవముంది. దేశాని కి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం లో లోహాల తయారీ పరిశ్రమలు 18వరకు వుంటే చైనా లో ఒక్కటి కూడా లేదు. ఆ విషయం లో చైనా కు ఎలాంటి అనుభవం లేదు. కానీ ఈ రోజు న రక్షణ ఉత్పత్తుల ను ప్రపంచవ్యాప్తం గా ఎగుమతి చేస్తుంటే దిగుమతి చేసుకోవడం లో మనం నంబర్ వన్ గా వున్నాము. మనం ఈ దు:స్థితి నుండి బయటపడాలి. మేక్ ఇన్ ఇండియా పథకాన్ని ఎగతాళి చేయడం ద్వారా మీరు ఏం సాధించగలరు? బహుశా మీరు రాత్రి బాగా నిద్రపోగలరు. కానీ దాని వల్ల దేశాని కి ఎలాంటి ప్రయోజనం కలగదు.
మాన్య స్పీకర్ సర్,
ఈ సభ లో మాట్లాడడానికి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు, ఈ సభ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలోనే ఐదు పెద్ద ఆర్ధిక వ్యవస్థల సరసన భారత్ నిలవడానికి ఏ యే మార్గాలు ఉన్నదీ మనం తెలుసుకోవాలి. భారతదేశం నుండి ఎగుమతులు పెరిగాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాని కి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాము. స్టార్ట్ -అప్ కంపెనీల ను ప్రారంభిస్తున్న యువత కు ప్రోత్సాహం లభిస్తోంది. ‘జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, జై అనుసంధాన్ ’నినాదాన్ని ప్రోత్సహించవలసి ఉంది. యువత కు ఉపాధి అవకాశాలు తప్పకుండా లభించేలా చూడాలి. పర్యటన రంగం లో అభివృద్ధి అవకాశాలు అపారం గా ఉన్నాయి. మన దేశం పట్ల ప్రపంచానికి ఎంతో గౌరవం ఉంది. కానీ దీని ని సద్వినియోగం చేసుకోవడం లో మనం విఫలం అయ్యాయమనే అభిప్రాయాన్ని మనం కలగజేశాము.
దేశం లో కొనసాగుతున్న స్వచ్ఛ్ బారత్ ఉద్యమం మనకు శక్తి ని ఇస్తోంది. పర్యటక రంగం పట్ల శ్రద్ధ పెట్టాలి. దేశం లో ఉపాధి కల్పన ను పెంపొందించే అవకాశాల ను పెంచవచ్చు. ప్రపంచ దృష్టి లో పర్యటక రంగం పరం గా మన దేశాని కి నూతన అస్తిత్వాన్ని సృష్టించవచ్చు. ఈ అంశాలన్నిటినీ ముందుకు తీసుకుపోవాలి. రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయం లో దేశాన్ని ప్రగతి పథం లో తీసుకు పోవాలి. దేశానికి గల అవసరాల ను దృష్టిలో పెట్టుకుంటే 100 లక్షల కోట్ల రూపాయల నిధులు కూడా తక్కువే అని చెప్పవచ్చు.
కానీ ఈ అతి పెద్ద స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి. మన దేశాని కి ప్రపంచ దేశాల నుండి వస్తున్న సాయాన్ని, అందిస్తున్న సౌకర్యాల ను మనం చక్కగా ఉపయోగించుకోవాలి. నూతన భారతదేశాన్ని, ఆధునిక భారతదేశాన్ని, సౌకర్యవంతమైన జీవనం కలిగిన భారతదేశాన్ని సాధించడం దీని ద్వారానే సాధ్యమవుతుంది. దేశం లోని సామాన్య మానవులు సైతం సౌకర్యవంతం గా జీవించగలిగి, వారి కలల ను సాకారం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకోసం ఉపయోగపడే వ్యవస్థల ను తయారు చేసుకోవాలి. గ్రామీణులకు కావచ్చు, నగర వాసులకు కావచ్చు అందరికీ సమాన అవకాశాల ను అందించాలి.
జనాభా పరం గా లభించే మేలు ను గురించి ఈ రోజు న మాట్లాడుకుంటున్నాము. మన దేశం లో యువశక్తి కి కొదవ లేదు. కానీ మన యువత ను ప్రపంచ అవసరాల కు అనుగుణం గా తీర్చిదిద్దుతున్నామా? ఈ విషయం లో మనం చాలా చేయవలసి ఉంది. దేశం లో నైపుణ్యాల అభివృద్ధి స్థాయి ని పెంచాలి. తద్వారా ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి. ఆధునికత దిశ గా దేశం ఎలా పయనించవచ్చో అనే విషయాన్ని మాననీయ రాష్ట్రపతి గారు తెలియజేశారు.
మార్కెట్ కోసం ప్రభుత్వం జిఇఎమ్ ను ప్రవేశపెట్టింది. పార్టీల కు అతీతంగా అన్ని రాష్ట్రాల కు విజ్ఞప్తి చేస్తున్నాను.. అన్ని రాష్ట్రాలు తప్పకుండా జిఇఎమ్ పోర్టల్ ను ఉపయోగించుకోవాలి. దీని ద్వారా అధిక మొత్తం లో డబ్బులు పొదుపు అవుతాయి. అందరికీ ఇది మేలు చేస్తుంది. ఏ వ్యక్తయినా తన ఉత్పత్తి ని ప్రభుత్వాని కి విక్రయించవచ్చును. దీని ని వినియోగించుకొనే దిశ గా అందరూ పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అవినీతి కి వ్యతిరేకం గా చేస్తున్న పోరాటాన్ని మనం కొనసాగిద్దాము. కొంతమంది ని జైలు లో ఉంచనందుకు మన మీద విమర్శలు వచ్చాయి. ఎవరినైనా జైలు లో పెట్టడానికి ఇది అత్యవసర పరిస్థితి కాలం కాదు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. న్యాయ వ్యవస్థ తన పని ని తాను చేస్తుంది. మనం చట్టపరం గా వ్యవహరిద్దాము. ఎవరికైనా బెయిలు వస్తే సంతోషిస్తారు. ఎవరూ కక్షపూరితంగా వ్యవహరించవద్దు. అయితే అవినీతి కి వ్యతిరేకం గా జరిగే పోరాటం కొనసాగుతుంది. మనం ఏంచేయగలమో అదంతా నిజాయతీ తో చేద్దాం. ఎవరిమీదనైనా కోపాన్ని పెట్టుకొని వారికి వ్యతిరేకం గా పని చేయకూడదు. దేశం మనకు చాలా ఇచ్చింది. కాబట్టి తప్పుదోవ లో ప్రయాణం చేయవద్దు. సాంకేతికత ను సమర్థవంతం గా ఉపయోగించుకోవాలి.
మాన్య స్పీకర్ సర్,
ఉగ్రవాదాని కి సంబంధించి వివిధ అభిప్రాయాలు ఎందుకుండాలి? ఇది మానవాళి కి పెను ప్రమాదంగా మారింది. మానవ జాతి కి పెను సవాళ్లను విసురుతోంది. మానవత్వం మీద నమ్మకం ఉన్న వారు ఐకమత్యం గా మెలగుతూ దీనికి వ్యతిరేకం గా పోరాటం చేయాలి.
మహిళా సాధికారిత ను సాధించడానికిగాను కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అనేక అవకాశాలు ఉండేవి. కానీ వారు చాలా గర్వం గా వ్యవహరించి కొన్ని విషయాలను చూడలేకపోయారు. యాభైవ దశకం లోనే ఉమ్మడి పౌర స్మృతి ని గురించి చర్చించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశముండేది. కానీ వారు దాని ని వదులుకున్నారు. వారు హిందూ కోడ్ బిల్లు తో మొదలుపెట్టారు.
35 సంవత్సరాల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో అవకాశం లభించింది. షా బానో కేసు విషయం లో సుప్రీం కోర్టు మద్దతుగా నిలిచింది. దేశం లో లింగ సమానత్వానికి మద్దతు గా ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడింది. వారు ఎక్కడో కూర్చొని ఉండడం వల్ల క్షేత్రస్థాయి లోని వాటిని చూడలేకపోయారు. దాంతో వారు వారికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. 35 సంవత్సరాల తరువాత మరోసారి కాంగ్రెస్ కు అవకాశం లభించింది. మన ముందుకు బిల్లు వచ్చింది. దేశ మహిళల గౌరవాన్ని మతాలతో, వర్గాలతో ముడిపెట్టి చూడకూడదు.
షా బానో కేసు విషయం లో కొంతమంది మంత్రులు టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచే ప్రకటనలు చేశారు. వాటిలోని నిజానిజాలు ఎంతో తెలుసుకోవడానికి నా దగ్గర మార్గాలు లేవు. నేను ఏమి విన్నానో ఆ విషయాన్నే మీకు చెబుతున్నాను. షా బానో కేసు సమయం లో కాంగ్రెస్ కు చెందిన ఓ మంత్రి మాట్లాడుతూ ముస్లిముల సంక్షేమం కాంగ్రెస్ బాధ్యత కాదని అన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. వారు బురద లో పడాలనుకుంటే పడనీయండి. ఇది మీకు యూట్యూబ్ లో లభిస్తుంది. నేను మీకు లింకు పంపుతాను.
మాన్య స్పీకర్ సర్,
నేను ఎక్కువ సమయం తీసుకోను. గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రస్తావించిన గాంధీ 159, స్వాతంత్ర్య దినోత్సవం-75 కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడతాను. కొన్ని కారణాలవలన ప్రతీది హక్కుల మీద కేంద్రీకృతమై వుంది. ప్రతి ఒక్కరూ హక్కుల గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పుడు మనకు ఒక అవకాశం లభించింది. దేశంలో ఒక ప్రాధమిక మార్పును తీసుకురావచ్చు. ఈ ఆందోళనను హక్కులనుంచి విధులవైపు తీసుకుపోవడంద్వారా ఈ ప్రాధమిక మార్పును తేవచ్చు. ప్రజల మనస్సాక్షిలో చైతన్యం నింపి వారికి దారిని చూపించే బాధ్యత ప్రజాప్రతినిధుల మీద కూడా వుంది. మనలో చాలా మంది... విధులకున్న శక్తి సామర్థ్యాల గురించి విని వుంటారు.
మహాత్మ గాంధీ అంటుండే వారు.. ప్రతి హక్కు తో పాటు దానికి సంబంధించిన విధి కూడా వుంటుంది అని. తమ విధులను నిర్వహించేవారు ఎవరైనా సరే నష్టపోరు అని లోహియా గారు అంటుండే వారు. ఈ గొప్ప వాక్యంపైన నేను కొంత వివరణ ను ఇవ్వదలుచుకున్నాను. ఇది చాలా పురాతనమైన వాక్కు. మొదటి స్థానం విధులదే అని భారతదేశం ఏనాడో మనకు బోధించింది. హక్కులు అనేవి మనం నిర్వించే విధుల నుండి బయటకు వస్తాయి. ఈ ఆధునిక భౌతిక ప్రపంచం లో ఎక్కడ చూసినా సంఘర్షణ లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వారి ప్రయోజనాల కు అనుగుణం గా వారి హక్కుల ను గురించి మాట్లాడుతున్నారు. మనం నిర్వర్తించాల్సిన విధుల ను గురించి చాలా తక్కువ గా మాట్లాడుతున్నారు. ఇదే సంఘర్షణల కు కారణం అవుతోంది. ఇది వాస్తవం. మనం హక్కులు, సౌకర్యాల ను గురించి మాత్రమే పోరాటం చేస్తున్నాము. ఈ క్రమం లో విధుల ను గురించి మరచిపోతే అప్పుడు ఈ హక్కులు, సౌకర్యాలనేవి మనకు మిగలవు.
ఈ అద్భుత సత్యాన్ని చెప్పిన మహానుభావుడి ని స్మరించుకోవడం మన బాధ్యత. కానీ దాని ని గురించి మరిచిపోయాము. ఆయన అందించిన ఆలోచనల ను ముందుకు తీసుకుపోదామా ? ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాగ్దాన పత్రం విడుదల సందర్భం గా 1951వ సంవత్సరం జులై 14న ఆ మహానుభావుడు చెప్పిన మాటలు ఇవి. ఆ రోజు న ఈ వాగ్దాన పత్రం విడుదల సమయం లో ఈ ఒక్క పేరాగ్రాఫు ను పండిత్ నెహ్రూ చదివారు.
1951వ సంవత్సరం లో పండిత్ నెహ్రూ కన్న ఈ కల ను సాకారం చేసేందుకు మనం ముందడుగు వేద్దామా? అందరమూ కలసి కట్టుగా ఆలోచించి ముందడుగు వేద్దాము.
చదువుల ను పక్కన పెట్టి స్వాతంత్ర్య సమరంలోకి దూకండి అని మహాత్మ గాంధీ ఆనాటి యువత కు పిలుపునిచ్చారు. ఇది భారతదేశ చరిత్ర. ఆయన పిలుపునకు స్పందించి ప్రజలు స్వాతంత్ర్య సమరం లోకి వచ్చారు. అంతే కాదు ఆనాడు విదేశీ వస్తువుల ను బహిష్కరించాలని మహాత్మా గాంధీ పిలుపునివ్వగానే ప్రజలు ఆయన బాట ను అనుసరించారు. రోజు కు ఒక పూట తిని మరో పూట భోజనాన్ని వదలివేసి దేశం లో ఉత్పత్తులను పెంచాలని లాల్ బహాదుర్ శాస్త్రి గారు పిలుపునివ్వగానే ప్రజలు ఆ పిలుపు ను శిరసావహించారు. అలాగే ఎంతో చిన్నవాడినైన నేను గ్యాస్ రాయితీ ని విడచిపెట్టండని పిలుపునివ్వగానే ప్రజలు ఆ పని ని చేశారు. అంటే మంచి బాట లో నడవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.
రండి... న్యూ ఇండియా ను, ఒక ఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికిగాను రాజకీయాల కు అతీతం గా మనందరమూ ముందంజ వేద్దాము. రాజకీయాల కంటే దేశం గొప్పది. అంతే కాదు రాజకీయ పార్టీల కంటే దేశం పెద్దది. కోట్లాది ప్రజలు ఎన్నెన్నో ఆశలు, ఆకాంక్షల తో జీవిస్తున్నారు. ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికిగాను మాననీయ రాష్ట్రపతి గారు చూపిన మార్గదర్శకత్వాన్ని, చేసిన దిశానిర్దేశాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆయన ప్రసంగానికి మాత్రమే నేను అభినందనలు తెలియజేయడం లేదు. దేశ సంక్షేమం కోసం ఆయన ప్రసంగం అందిస్తున్న స్ఫూర్తి పట్ల కూడా నాకు ఎంతో నమ్మకం ఉంది.
ఈ చర్చ లో పాల్గొని వారి యొక్క విలువైన అభిప్రాయాలను వెలిబుచ్చిన గౌరవ సభ్యుల కు నా నమస్కరాలు తెలియజేస్తూ, నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
స్పీకర్ సర్, మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
**
(Release ID: 1580994)
Visitor Counter : 304