మంత్రిమండలి
మాస్కో లో ఐఎస్ఆర్ఒ టెక్నికల్ లియెజోన్ యూనిట్ కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
31 JUL 2019 3:39PM by PIB Hyderabad
రష్యా లోని మాస్కో లో ఐఎస్ఆర్ఒ టెక్నికల్ లియెజోన్ యూనిట్ (ఐటిఎల్‌యు)ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఆర్థికపరమైనటువంటి అంతస్సూచనలు:
రష్యా లోని మాస్కో లో ఐటిఎల్‌యు కు జీతాలు, కార్యాలయ ఖర్చులు, అద్దె, పన్ను లు తదితరాల కు ప్రతి ఒక్క సంవత్సరాని కి దాదాపు గా ఒకటిన్నర కోట్ల రూపాయలు మేరకు సరాసరి వ్యయం అవుతుందని భావిస్తున్నారు.
వివరాలు:
మాస్కో లోని ఐఎస్ఆర్ఒ టెక్నికల్ లియెజోన్ యూనిట్ (ఐటిఎల్‌యు) ఐఎస్ఆర్ఒ (‘ఇస్ రో’) యొక్క కార్యక్రమాల కు సంబంధించిన లక్ష్యాల ను సాధించడం కోసం వివిధ అంశాల పై సకాలం లో చొరవలు తీసుకొనేందుకు రష్యా తో మరియు ఇరుగు పొరుగు దేశాల తో ప్రభావశీలమైనటువంటి సాంకేతిక సమన్వయాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడుతుంది. ఇస్ రో నుండి ఐటిఎల్‌యు కు పంపే లియజోన్ ఆఫీసర్ ఆయా దేశాల లో పరిశోధకులు, ప్రభుత్వ ఏజెన్సీ లు మరియు పరిశ్రమల తో తాము జరిపే సమావేశాల ఫలితం గా పరిశోధన మరియు సాంకేతిక విజ్ఞానం లోను, ఇతర తుది ఫలితాల తాలూకు సాంకేతిక సమాచారాన్ని సమకూర్చుతారు. అంతేకాక అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం రంగం లో ప్రస్తుతం అమలవుతున్న సహకారపూర్వక ద్వైపాక్షిక కార్యక్రమాల కు కూడా మద్దతు ను ఇవ్వడం తో పాటు తమకు నివేదించినటువంటి అంశాల పైన ఇస్ రో తరఫున క్రియాశీలం గానూ వ్యవహరిస్తారు.
లాభాలు:
పరస్పర సమన్వయం అవసరపడే ఫలితాల ను సాధించడం కోసం రష్యా మరియు ఇరుగు పొరుగు దేశాల లోని స్పేస్ ఏజెన్సీస్ తో/పరిశ్రమల తో ఇస్ రో సహకరించ గలుగుతుంది.
ఇస్ రో యొక్క గగన్‌యాన్ కార్యక్రమాని కి రోదసి లో ప్రాణ సమర్ధన కు అత్యవసరమైనటువంటి కీలకమైన సాంకేతికతల లో కొన్నింటిని అభివృద్ధి పరచవలసిన మరియు ప్రత్యేక సదుపాయాల ను స్థాపించవలసిన అవసరం ఎంతయినా ఉంది.
మానవ సహిత గగన్‌యాన్ కార్యక్రమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం నిర్దేశించుకొన్న 2022వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ గడువు ను దృష్టి లో పెట్టుకొని, నిర్దిష్ట రంగాల లో ఇప్పటికే తమ సాంకేతిక శక్తియుక్తుల ను నిరూపణ చేసుకొన్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల వద్ద నుండి సాంకేతిక సహకారాన్ని పొందడం వివేకవంతమైన చర్య అవుతుంది. అంతరిక్షయాన సామర్ధ్యాన్ని కలిగివున్నటువంటి దేశాల లో రష్యా ఒక దేశం కావడం తో, సంబంధిత వివిధ రంగాల లో రష్యా తో విస్తృత స్థాయి లో సహకారాన్ని నెరపాలని తలపోశారు.
అమలు సంబంధిత వ్యూహం:
ఐటిఎల్‌యు మాస్కో కార్యాలయాన్ని ఇస్ రో నుండి డెప్యుటేశన్ పై ‘‘కౌన్సెలర్ (స్పేస్)’’ హోదా తో పంపబడినటువంటి ఒక ఐఎస్ఆర్ఒ శాస్త్రవేత్త/ఇంజినీర్ నిర్వహిస్తారు. ఇక స్థానికం గా పని లోకి తీసుకొనే సిబ్బంది ఈ కార్యాలయ విధుల లో సహకరిస్తారు. ఈ ప్రక్రియ ను ఆమోదం లభించిన తేదీ నుండి ఆరు నెలల లోపల పూర్తి చేయాలని ఓ ప్రణాళిక ను సిద్ధం చేసుకోవడమైంది.
ప్రభావం:
లియెజోన్ ఆఫీసర్లు ఆయా దేశాల లోని పరిశోధకులు, ప్రభుత్వ ఏజెన్సీ లు మరియు పరిశ్రమల తో తాము జరిపిన సమావేశాల నుండి అందే ఫలితాలను, అలాగే పరిశోధన మరియు సాంకేతిక విజ్ఞానం లలో చోటుచేసుకొనే పరిణామాల తాలూకు సాంకేతిక సమాచారాన్ని సమకూర్చుతారు. వారు రోదసి విజ్ఞాన రంగం లో ఇప్పటికే అమలవుతున్న సహకారపూర్వక ద్వైపాక్షిక కార్యక్రమాల కు కూడా మద్దతు ను అందిస్తారు. అంతేకాక తమకు నివేదించినటువంటి వ్యవహారాల లో ఐఎస్ఆర్ఒ తరఫున క్రియాశీలం గా వ్యవహరిస్తారు కూడా.
**
(Release ID: 1580902)
Visitor Counter : 233
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam