మంత్రిమండలి

వైద్య‌ రంగం లో స‌హ‌కారం కోసం యుఎస్ఎ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య అంత‌ర సంస్థాత్మ‌క ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 17 JUL 2019 4:21PM by PIB Hyderabad

నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాలు, శాస్త్రీయ‌మైన ఆలోచ‌న‌లు/ స‌మాచారం, ఇంకా సాంకేతిక‌త‌ ల ఆదాన ప్ర‌దానం ల‌తో పాటు శాస్త్రీయ‌ప‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ ను సంయుక్తం గా ఉప‌యోగించుకోవ‌డం, పున‌రుత్ప‌త్తి సంబంధిత వైద్యం మ‌రియు 3డి బ‌యో-ప్రింటింగ్‌.. ఈ రంగాల లో యుఎస్ఎ కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య కుదిరినటువంటి ఒక అంత‌ర సంస్థాత్మ‌క ఒప్పందాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఎక్స్-పోస్ట్  ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

ప్ర‌యోజ‌నాలు:

ఈ ఒప్పందం లో భాగం గా సంయుక్త ప‌రిశోధ‌న ప‌థ‌కాలు, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, స‌మావేశాలు, చ‌ర్చా స‌భ‌లు త‌దిత‌రాలు అర్హ‌త క‌లిగిన శాస్త్రవేత్త‌లందరి కి, సాంకేతిక వైజ్ఞానికుల‌ందరి కి అందుబాటు లోకి వ‌స్తాయి.  అంతేకాకుండా, వాటికి శాస్త్రీయ గుణాత్మ‌క‌త, ఇంకా శ్రేష్ట‌త్వాల ప్రాతిప‌దిక‌ న మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.  రిజ‌న‌రేటివ్ మెడిసిన్‌, ఇంకా 3డి బ‌యో-ప్రింటింగ్ రంగాల‌ లో శాస్త్రీయ  ప‌రిశోధ‌న మ‌రియు సాంకేతిక విజ్ఞాన అభివృద్ధి ల ద్వారా నూత‌న మేధో సంప‌త్తి, ప్ర‌క్రియ‌లు, మూల రూపాలు లేదా ఉత్ప‌త్తుల సృష్టి కి అవ‌కాశం ఉంటుంది.

ఒప్పందం లో భాగం గా ఇచ్చిపుచ్చుకోవాల‌ని రెండు సంస్థ‌ లు ఆశిస్తున్న‌టువంటి సాధార‌ణ విద్య ప‌ర‌మైన జ్ఞానం, నిర్దిష్ట ప్రోజెక్టుల అభివృద్ధి కి దారితీయ‌గ‌ల‌ద‌ని ఇరు ప‌క్షాల సంస్థ‌ లు ఆశిస్తున్నాయి.  

ముఖ్యాంశాలు:

విద్య సంబంధ‌మైన స‌హ‌కారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డం ద్వారా ఉభ‌య ప‌క్షాల సంస్థ‌ ల తాలూకు విద్య మ‌రియు ప‌రిశోధ‌న ల అభివృద్ధి కి తోడ్పాటును అందించాలనేది ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం.  ఇరు ప‌క్షాల‌ కు జ్ఞానం యొక్క ఆదాన ప్ర‌దానం మ‌రియు స‌హ‌కారాన్ని ఇచ్చి పుచ్చుకొనే ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాలు ముడిప‌డిన‌ రంగాల లో ఈ కింద పేర్కొన్న రంగాలు ఉన్నాయి:

1)  శిక్ష‌ణ‌ కోసం, అధ్య‌య‌నం కోసం మ‌రియు ప్ర‌త్యేకించి 3డి బ‌యోప్రింటింగ్ రంగం లో ప‌రిశోధ‌న ల కోసం విద్యార్థులు మ‌రియు ఫేక‌ల్టీ స‌భ్యుల ఆదాన ప్రదానం;

2) సంయుక్త ప‌రిశోధ‌క ప్రాజెక్టుల‌ ను అమలుప‌ర‌చ‌డం; ఇంకా

3)  స‌మాచారాన్ని మ‌రియు విద్యా రంగ సంబంధిత ప్ర‌చుర‌ణ‌ల ను ప‌ర‌స్ప‌రం అంద‌జేసుకోవ‌డం.

పూర్వ‌రంగం :

విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం రంగాల‌ లో ప‌ర‌స్ప‌ర ల‌బ్ది కి గాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు మ‌రియు భార‌త ప్ర‌భుత్వాని కి మధ్య బ‌ల‌మైన మ‌రియు దీర్ఘ‌కాలికమైన స‌హ‌కారం ఉండాల‌ని భార‌త ప్ర‌భుత్వం చూపుతున్న శ్ర‌ద్ధ కు అనుగుణం గా విద్యా రంగ స‌హ‌కారం అంశం పై ఒక ఒప్పందాన్ని భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ అధీనం లోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మెడిక‌ల్ సైన్సెస్ ఎండ్ టెక్నాల‌జీ (ఎస్‌సిటిఐఎమ్ఎస్‌టి) ఒక ఒప్పందాన్ని వేక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ హెల్త్ సైన్సెస్  (డ‌బ్ల్యుఎఫ్ఐఆర్ఎమ్‌) తో కుదుర్చుకుంది.  ఈ ఒప్పంద ప‌త్రాల పై శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌సిటిఐఎమ్ఎస్‌టి) ప‌క్షాన ఆ  సంస్థ డైరెక్ట‌ర్‌ ప్రొఫెస‌ర్ ఆశా కిశోర్ తో పాటు వేక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ-హెల్త్ సైన్సెస్ ప‌క్షాన చీఫ్ సైన్స్ ఆఫీస‌ర్ & సీనియ‌ర్ అసోసియేట్ డీన్ శ్రీ గ్రెగరీ బుర్‌కే లు 2018వ సంవత్స‌రం డిసెంబ‌ర్ 13వ తేదీ నాడు సంత‌కాలు చేశారు. 


**



(Release ID: 1579306) Visitor Counter : 250