మంత్రిమండలి
ఎత్తయిన ప్రాంతాల జీవశాస్త్రం, మందులకు సంబంధించి ఉమ్మడిగా పరిశోధన చేసే కార్యక్రమంపై ఇండియా, కిర్గిస్థాన్ దేశాల మధ్యన కుదిరిన సహకార ఒప్పందానికి కేబినెట్ ఆమోదం.
Posted On:
12 JUN 2019 8:10PM by PIB Hyderabad
ఎత్తయిన ప్రాంతాల జీవశాస్త్రం, మందులకు సంబంధించి ఉమ్మడిగా పరిశోధన చేసే కార్యక్రమంపై ఇండియా, కిర్గిస్తాన్ దేశాల మధ్యన సహకార ఒప్పందం (ఎంఒసి) కుదిరింది. దీనికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఇరుదేశాల్లో సైన్సు, వైద్య రంగాల్లో ఇరుదేశాల పరస్పర సంబంధాలు బలోపేతమవుతాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల జీవశాస్త్రం, మందుల రంగాల్లో ఈ సంబంధాలు బలోపేతమవుతాయి.
ఈ ఎంఒసి కారణంగా ఇరుదేశాలకు పలు ప్రయోజనాలు కలుగుతాయి. ఎత్తైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సైనిక వ్యవస్థకు సంబంధించిన భౌతిక, మానసిక పరిస్థితులను అవగాహన చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఎత్తైన ప్రాంతాల్లో వచ్చే వ్యాధులను తగ్గించడం జరుగుతుంది. దీనికోసం ఇరుదేశాల సైనికులకోసం యోగా, ఆయుర్వేద మందులు, సహజ సిద్ధవనరుల ద్వారా తయారు చేసే మందులను ఉపయోగించడం జరుగుతుంది.
***
(Release ID: 1574500)
Visitor Counter : 132