మంత్రిమండలి
కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిశరీస్ లో ఒక కార్యదర్శి పదవి మరియు ఒక సంయుక్త కార్యదర్శి పదవి లను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
19 FEB 2019 9:07PM by PIB Hyderabad
కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిశరీస్ కు అప్పగించే పనులు సాఫీ గా సాగిపోయేందుకు గాను శాశ్వత ప్రాతిపదిక న ఆ డిపార్ట్‌మెంట్ లో ఒక కార్యదర్శి పదవి ని పే మేట్రిక్స్ యొక్క లెవెల్ 17 (రూ. 2,25,000/- స్థిర ప్రాతిపదిక న) లో మరియు ఒక సంయుక్త కార్యదర్శి పదవి ని పే మేట్రిక్స్ యొక్క లెవెల్ 14 (రూ. 144200-218200) లో ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం పలు పథకాలు/ప్రోజెక్టు లను చేపట్టడానికి/పర్యవేక్షించేందుకు, అలాగే భారీ సంఖ్య లో ఉన్న మత్స్యకారుల ప్రయోజనాల పరిరక్షణ కు వారి యొక్క సంక్షేమాని కి కృషి చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిశరీస్ కు నూతనం గా ఏర్పాటైన పదవులు అవకాశాన్ని ఇస్తాయి.
**
(Release ID: 1565448)
Visitor Counter : 109