మంత్రిమండలి

ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో షెడ్యూలు తెగ‌ల జాబితాలో స‌వ‌ర‌ణ‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Posted On: 13 FEB 2019 9:14PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని షెడ్యూలు తెగ‌ల (ఎస్‌టిల‌) జాబితాలో మార్పులు చేసేందుకు వీలుగా రాజ్యాంగ ( షెడ్యూలు కులాలు,తెగ‌ల‌) ఆర్డ‌ర్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు 2016 ద్వారా అధికారిక స‌వ‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు రూపొందిన ప్ర‌తిపాద‌న‌ల‌ కేబినెట్ నోట్‌కు ఆమోదం తెలిపింది.

ఛ‌త్తీస్‌ఘ‌డ్ షెడ్యూలు తెగ‌ల జాబితాలో ఈ కింద తెలిపిన మార్పులు చేయ‌డం జ‌రుగుతుంది.

1)ఎంట్రీ నెంబ‌ర్ 5 లో, భారియా భూమియా త‌ర్వాత‌, ఈ కింది దానిని చేర్చ‌డం జ‌రుగుతుంది. అది
భూయిన్యా,భూయియాన్‌, భూయాన్‌

2)ఎంట్రీ 14 విష‌యంలో కింది ప్ర‌త్యామ్నాయం చేరుస్తారు.
14. ధ‌న్‌వార్‌,ధ‌నుహ‌ర్‌,ధ‌నువార్‌

3) ఎంట్రీ 32, 33 విష‌యంలో కింద తెలిపిన ప్ర‌త్యామ్నాయాల‌ను చేరుస్తారు. అవి
      32. న‌గెసియా, న‌గాసియా, కిసాన్  33. ఒరాన్‌,ధంకా,ధన్‌గ‌డ్  

4)ఎంట్రి 41 విష‌యంలో కింది ప్ర‌త్యామ్నాయం చేరుస్తారు అవి
      41. స‌వార్‌, స‌వ‌ర‌, సౌన్‌ర సాఓన్రా మ‌రియు ఎంట్రీ 42 త‌ర్వాత కింది ఎంట్రీని చేరుస్తారు. అది 43- భిన్‌జ్‌హియా
      ఈ చ‌ట్టాన్ని రాజ్యాంగ (షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగ‌ల‌) ఆర్డ‌ర్ (స‌వ‌ర‌ణ‌) బిల్లు , 2019 అంటారు. బిల్లు చ‌ట్టంగా రూపొందిన త‌ర్వాత ఈ క‌మ్యూనిటీల‌కు చెందిన సభ్యులు ఛ‌త్తీస్‌ఘ‌డ్‌కు చెందిన స‌వ‌రించిన షెడ్యూల్డ్ తెగ‌ల జాబితాలో స‌భ్యుడు అవుతారు. దీని ద్వారా వీరు ప్ర‌స్తుత ప్ర‌భుత్వ ప‌థ‌కాల కింద షెడ్యూలు తెగ‌ల వారు పొందే ప్ర‌యోజ‌నాలు పొంద‌డానికి వీలు క‌లుగుతుంది.  పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌, నేష‌న‌ల్ ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్‌, నేష‌న‌ల్ ఫెలోషిప్‌, ఉన్న‌త ప్ర‌మాణాలు క‌లిగిన విద్య‌, నేష‌న‌ల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ డ‌వ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ నుంచి రాయితీపై రుణాలు పొందే అవ‌కాశం, ఎస్‌టి బాల బాలిక‌ల‌కు హాస్ట‌ల్ స‌దుపాయం వంటివి ఇలాంటి ప్ర‌ధాన ప‌థ‌కాల‌లో కొన్ని. వీటికి తోడు ప్ర‌భుత్వ విధానాల ప్ర‌కారం విద్యాసంస్థ‌ల‌లో ప్ర‌వేశానికి, ఉద్యోగాలలో రిజ‌ర్వేష‌న్‌లు పొంద‌డానికి వీరికి అవ‌కాశం ఉంటుంది.
**



(Release ID: 1564524) Visitor Counter : 133