మంత్రిమండలి
వ్యవసాయ సంబంధ వ్యాపారం కోసం అవసరమైన పర్యావరణ వ్యవస్థ లను మెరుగుదల కోసం పరస్పర సహకారాన్ని అందించుకోవడం లో భారతదేశాని కి మరియు మాల్‌దీవ్స్ కు మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
06 FEB 2019 9:51PM by PIB Hyderabad
మాల్‌దీవ్స్ అధ్యక్షులు భారతదేశాని కి ఆధికారిక పర్యటన కు విచ్చేసిన సందర్భం గా 2018 వ సంవత్సరం డిసెంబర్ 17వ తేదీ నాడు భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, మాల్‌దీవ్స్ మత్స్య పరిశ్రమ, సముద్ర సంబంధ వనరులు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ లు సంతకాలు చేసిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి (ఎంఒయు కు) కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు న ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
వ్యవసాయ సంబంధ సెన్సస్, వ్యవసాయ సంబంధిత వ్యాపారం, ఏకీకృత సేద్య పద్ధతి, సాగునీరు, అభివృద్ధి పరచిన విత్తనాలు, భూమి స్వస్థత నిర్వహణ, పరిశోధన, స్థానిక వ్యవసాయ సంబంధ వ్యాపార రంగం లో సామర్ధ్య నిర్మాణం, ఆహార భద్రత మరియు పౌష్టికాహార రంగాల కు చెందిన నవ పారిశ్రామికుల లో జ్ఞానాన్ని ఇనుమడింప చేయడం, రుతువుల లో వచ్చే చీడ పీడల ను తట్టుకొని నిలచేటటువంటి వ్యవసాయ పద్ధతి ని అభివృద్ధి పరచడం, కీటక నాశనుల అవశేషాల ను పరీక్షించడం కోసం తగిన సదుపాయాల ను నెలకొల్పడం తదితర రంగాల లో సహకారాని కి ప్రోది చేసే ఒక ఇకో సిస్టమ్ ను మెరుగు పరచడాని కి రెండు దేశాలు కలసి కృషి చేసేందుకు ఈ ఎంఒయు తోడ్పడనుంది.
ఈ ఎంఒయు లో భాగం గా సహకారాని కి ప్రణాళికల ను సిద్ధం చేయడం కోసం, ఇరు పక్షాలు ఖాయం చేసిన కార్య ప్రణాళికల ను అమలు లోకి తీసుకురావడం కోసం మరియు నిర్దేశించుకొన్న కార్యక్రమాల అమలు కై తీరు తెన్నుల ను సూచించడం కోసం ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
**
(Release ID: 1563312)
Visitor Counter : 177