మంత్రిమండలి
యువజనుల వ్యవహారాల లో భారతదేశాని కి మరియు తాజికిస్తాన్ కు మధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
నాడు పోస్టు చేయడమైనది:
22 NOV 2018 1:34PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం యువజనులకు సంబంధించిన వ్యవహారాల లో సహకారానికి గాను భారతదేశానికి, తాజికిస్తాన్ కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రానికి (ఎంఒయు) ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
ఈ ఎంఒయు పై దుషాంబే లో 2018వ సంవత్సరం అక్టోబర్ 8వ తేదీ న సంతకాలయ్యాయి. ఎంఒయు పైన యువజన వ్యవహారాలు మరియు క్రీడలు, భారత ప్రభుత్వం పక్షాన తాజికిస్తాన్ లో భారత రాయబారి శ్రీ సోంనాథ్ ఘోష్, రిపబ్లిక్ ఆఫ్ తాజకిస్తాన్ ప్రభుత్వం పక్షాన ఛైర్మన్ ఆఫ్ ది కమిటీ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ శ్రీ అబ్దుల్లోజోదా అహ తమ్ రుస్తమ్ లు సంతకాలు చేశారు.
ఈ ఎంఒయు 5 సంవత్సారాల పాటు చెల్లుబాటు అవుతుంది. యువజన వ్యవహారాల పై సహకారించుకొనే రంగాల లో- యువజన బృందాల, యువ సంస్థల ప్రతినిధుల మరియు యువజన విధాన రూపకల్పన కు బాధ్యులుగా ఉన్న ప్రభుత్వ అధికారుల రాక పోక లు, రెండు దేశాల లో యువజనుల వ్యవహారాల పై అంతర్జాతీయ సమావేశాలు, చర్చా సభల కు ఆహ్వాన పత్రాలను అందించడం, యువజనుల కు సంబంధించిన అంశాలపై ముద్రిత సామగ్రి, ఫిల్ములు, అనుభవాలు, యువత వ్యవహారాలపై పరిశోధన తదితర సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, యువత శిబిరాలు, యువజన ఉత్సవాలు మరియు ఇతరత్రా యువజన సంబంధ కార్యక్రమాల లో ప్రాతినిధ్యం తో పాటు రెండు దేశాల లోను సంబంధిత చట్టాలు మరియు నియమనిబంధనల పరిధి లో సంయుక్తంగా ఆమోదం లభించిన యువజనులకు సంబంధించినటువంటి మరే ఇతర సహకార పూర్వకమైన కార్యకలాపాలు వంటివి- భాగం గా ఉంటాయి.
ఇరు పక్షాల లో ఏదో ఒక పక్షం నిర్వహించే కార్యక్రమాలలో మరియు కార్యకలాపాల లో పాలుపంచుకోవడం, సమాచారాన్ని, జ్ఞానాన్ని పంచుకోవడం మరియు యువజనుల రాకపోకల ద్వారా తాజికిస్తాన్ తో యువజన సంబంధిత వ్యవహారాల లో సహకారాన్ని ప్రోత్సహించడం మరియు పటిష్టపరచడం అనేది ఈ ఎంఒయు ధ్యేయం.
ప్రయాజనాలు:
ఈ ఒప్పందం యువజన వ్యవహారాల రంగం లో ఇరు పక్షాల లో కార్యక్రమాలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది యువతీ యువకుల లో ఆలోచనలు, విలువలు, ఇంకా సంస్కృతుల ను ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ని ప్రోత్సహించడానికి దోహద పడుతుంది. అలాగే, భారతదేశం మరియు తాజికిస్తాన్ ల మధ్య మైత్రీ పూర్వక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఆ తరహా ద్వైపాక్షిక ఆదాన ప్రదాన కార్యక్రమాల ద్వారా రెండు దేశాల లోను యువతీ యువకులు అందరికీ వారి యొక్క కులం, మతం మరియు లింగ భేదాలకు అతీతం గా ప్రయోజనాలు సరిసమానంగా లభిస్తాయి. ఇది యువత లో అంతర్జాతీయ దృష్టి కోణాన్ని అభివృద్ధి పరచడం లో, యువజన వ్యవహారాల రంగం లో వారి జ్ఞానాన్ని మరియు ప్రావీణ్యాన్ని విస్తృత పరచడం లో సహాయకారి కాగలుగుతుంది.
**
(రిలీజ్ ఐడి: 1553534)
సందర్శకుల సూచీ సంఖ్య : : 215