మంత్రిమండలి

డిఎన్‌ఎ టెక్నాల‌జీ (ఉపయోగం, అనువ‌ర్తింపు) వ్యవస్థీకరణ బిల్లు, 2018కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

డిఎన్ఎ లేబ‌రెట‌రీ లకు నియంత్ర‌ణ‌ మరియు గుర్తింపు తప్పనిసరి

Posted On: 04 JUL 2018 2:25PM by PIB Hyderabad

డిఎన్ ఎ టెక్నాల‌జి (ఉప‌యోగం, అనువ‌ర్తింపు) వ్యవస్థీకరణ బిల్లు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 

వివ‌రాలు:

డిఎన్ ఎ ఆధారిత సాంకేతిక ప‌రిజ్ఞానం (ఉపయోగం, అనువ‌ర్తింపు) వ్యవస్థీకరణ బిల్లు, 2018 ని తీసుకురావ‌డం వెనుక ముఖ్యోద్దేశం డిఎన్ఎ ఆధారిత ఫోరెన్సిక్ సాంకేతిక‌ ప‌రిజ్ఞాన వినియోగాన్ని మ‌రింత విస్తృతం చేయ‌డం ద్వారా న్యాయాన్ని అందించే వ్య‌వ‌స్థ‌ కు మ‌ద్ద‌తు నివ్వ‌డం, దానిని బ‌ల‌ప‌ర‌చ‌డమే. 

నేరాల‌ను ప‌రిష్క‌రించ‌డంలోను, త‌ప్పిపోయిన వారిని గుర్తించ‌డంలోను డిఎన్ఎ ఆధారిత సాంకేతిక ప‌రిజ్ఞానం యొక్క ఉపయోగం ప్ర‌పంచ‌ం అంత‌టా గుర్తింపునకు నోచుకొంది.

డిఎన్ఎ లేబ‌రెట‌రీల న‌మోదును, గుర్తింపు ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డం ద్వారా ఈ బిల్లు దేశంలో డిఎన్ ఎ సాంకేతిక ప‌రిజ్ఞానం విస్తృత స్థాయి వినియోగానికి  దోహ‌ద‌ప‌డుతుంది.  అలాగే డిఎన్ఎ ప‌రీక్ష ఫ‌లితాలు విశ్వసనీయమైన‌వి.  ఇందుకు సంబంధించిన డాటా ను ఈ దేశం లోని పౌరుల‌కు గ‌ల గోప్య‌త హ‌క్కుల‌కు అనుగుణంగా భ‌ద్రంగా ఉంచుతారు.  ఇక్క‌డ దుర్వినియోగానికి అవ‌కాశం ఉండ‌దు.  
దీనివ‌ల్ల.. 
        *  స‌త్వ‌ర న్యాయ‌ స‌హాయాన్ని అందిచ‌డానికి, 
        *  నేర నిర్ధార‌ణ రేటు పెర‌గ‌డానికి.. 

వీలు ఏర్పడుతుంది.

త‌ప్పి పోయిన వారి వివ‌రాల ఆధారంగా ఆయా వ్య‌క్తుల‌ను స‌రిపోల్చుకోవ‌డానికి, దేశంలోని వివిధ ప్రాంతాల‌లో గుర్తింపున‌కు నోచుకోని మృత‌దేహాల‌ను గుర్తించ‌డానికి, భారీ విప‌త్తుల స‌మ‌యంలో బాధితుల‌ను గుర్తించ‌డానికి ఈ బిల్లు లోని అంశాలు వీలు క‌ల్పిస్తాయి.

పూర్వరంగం:

హ‌త్య‌, అత్యాచారం, మాన‌వ అక్ర‌మ ర‌వాణా, తీవ్రంగా గాయ‌ప‌ర‌చ‌డం వంటి కేసుల‌ను ప‌రిష్క‌రించ‌డానిక ఫోరెన్సిక్ డిఎన్ఎ స‌మాచారం ఎంతగానో దోహదప‌డుతుంది.  అలాగే దొంగ‌త‌నం, దోపిడి ల వంటి వాటి విష‌యంలో కూడా కేసుల ప‌రిష్కారానికి ఇది తోడ్పడుతుంది.  నేశనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సిఆర్ బి) గ‌ణాంకాల ప్ర‌కారం 2016 వ సంవ‌త్స‌రంలో సంవ‌త్స‌రానికి 3 ల‌క్ష‌ల‌ కంటే ఎక్కువ‌గా ఇలాంటి నేరాలు న‌మోదు అవుతున్నాయి.  ఇందులో కొన్నింటిలో మాత్ర‌మే డిఎన్ఎ ప‌రీక్షను నిర్వ‌హిస్తున్నారు.  ఈ కేట‌గిరీ నేరాల విష‌యంలో డిఎన్ఎ సాంకేతికతను విస్తారంగా వాడ‌గ‌లిగితే స‌త్వ‌ర న్యాయం లభించడం తో పాటు నేర నిర్ధార‌ణ‌ కూడా గ‌ణ‌నీయంగా పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది.  ప్ర‌స్తుతం నేర నిరూప‌ణ శాతం సుమారు 30% గా మాత్రమే (ఎన్‌సిఆర్‌బి 2016 గ‌ణాంకాలు) ఉంది. 


***



(Release ID: 1537861) Visitor Counter : 210