మంత్రిమండలి

“న‌దుల అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక సంఘం” అందించిన స్థితి మరియు పురోగతి నివేదిక

Posted On: 06 JUN 2018 3:25PM by PIB Hyderabad

న‌దుల అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన‌ ప్ర‌త్యేక సంఘం 2016 జులై 1వ తేదీ నుండి 2018 మార్చి నెల 31వ తేదీ మ‌ధ్య కాలానికి ఇచ్చిన స్థితి మరియు పురోగతి నివేదిక‌ వివరాలను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టి కి తీసుకు రావ‌డ‌మైంది. 

న‌దుల అనుసంధానం అంశంపై పురోగ‌తి నివేదిక ను మాన్య స‌ర్వోన్న‌త న్యాయస్థానం 2012 ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ నాడు రిట్ పిటిశన్ (సివిల్) – 512 of 2002: ‘‘నెట్ వర్కింగ్ ఆఫ్ రివర్స్’’ విషయంలోను మరియు రిట్ పిటిశన్ సంఖ్య 668 ఆఫ్ 2002 విషయంలోను ఇచ్చినటువంటి తీర్పున‌కు అనుగుణంగా మంత్రివ‌ర్గానికి స‌మ‌ర్పించ‌డ‌మైంది. ఈ తీర్పు నదుల అనుసంధానం అంశంపై ఒక ప్రత్యేక సంఘాన్ని నియమించాలని యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ను ఆజ్ఞ‌ాపించింది.  న‌దుల అనుసంధానం కోసం ఏర్పాటైన ప్ర‌త్యేక సంఘం సాధించిన పురోగ‌తిపై ఒక నిర్ణీత కాలిక నివేదిక‌ను మంత్రివ‌ర్గానికి స‌మ‌ర్పించ‌వ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉన్న‌ది.
 
న‌దుల అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక సంఘం (ఐఎల్ఆర్) యొక్క స్థితి నివేదిక లో కెన్-బెట్ వా లింకు, దామన్ గంగా-పింజల్ లింకు మరియు పారా-తాపి-నర్మద లింకు అనే మూడు ప్రాధాన్య లింకులతో పాటు 1980 నాటి నేశనల్ పర్ స్పెక్టివ్ ప్లాన్ ప్రకారం గుర్తించిన ఇతర హిమాలయ ప్రాంత సంబంధి లింకులు మరియు ద్వీపకల్ప సంబంధి లింకుల విషయంలో సాధించినటువంటి గణనీయ పురోగతి పేర్కొనబడింది.


***



(Release ID: 1534584) Visitor Counter : 130