మంత్రిమండలి

నవీకరణ యోగ్య శక్తి రంగంలో సహకారం కోసం భారతదేశం, మొరాకో ల మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 23 MAY 2018 3:54PM by PIB Hyderabad

నవీకరణ యోగ్య శక్తి రంగంలో సహకారం కోసం భారతదేశం, మొరాకో ల మధ్య కుదిరినటువంటి అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒయు పై 2018 ఏప్రిల్ 10వ తేదీన న్యూ ఢిల్లీ లో సంతకాలు అయ్యాయి.

నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి సంబంధిత అంశాలలో సాంకేతికపరమైనటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడానికి మరియు సహకారపూర్వకమైన సంస్థాగత సంబంధాలను పెంపొందించడానికి ఒక పునాదిని పరస్పర ప్రయోజనాలు, సమానత్వం మరియు ఆదాన ప్రదానం ప్రాతిపదికల పైన ఏర్పరచాలన్నది ఇరు పక్షాల ధ్యేయంగా ఉంది.  సహకరించుకోదగిన రంగాలకు సంబంధించిన అంశాలను సమీక్ష, పర్యవేక్షణ మరియు చర్చల కోసం ఒక సంయుక్త కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఎమ్ఒయు సంకల్పిస్తోంది.

ఈ ఎమ్ఒయు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టపరచడంలో సహాయకారి కాగలదు.
 

***



(Release ID: 1533202) Visitor Counter : 93