మంత్రిమండలి
భారతదేశానికి మరియు మొరాకో కు మధ్య భూగర్భ శాస్త్రం, ఇంకా గనుల తవ్వకాల రంగం లో ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
16 MAY 2018 3:42PM by PIB Hyderabad
భారతదేశానికి మరియు మొరాకో కు మధ్య భూగర్భ శాస్త్రం, ఇంకా గనుల తవ్వకాల రంగం లో అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం పై భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ మరియు మొరాకో కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, మైన్స్ అండ్ సస్‌టైనబుల్ డివెలప్‌మెంట్ లు 2018 ఏప్రిల్ 11వ తేదీన న్యూ ఢిల్లీ లో సంతకాలు చేశాయి.
ఈ ఎమ్ఒయు భూగర్భ శాస్త్రం, ఇంకా గనుల తవ్వకాల రంగంలో భారతదేశానికి మరియు మొరాకో కు మధ్య ఒక సంస్థాగత యంత్రాంగం ఏర్పాటుకు రంగాన్ని సిద్ధం చేస్తుంది. ఈ సహకారం ఇరు దేశాల ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ రంగాలలో పరస్పరం ప్రయోజనకారిగా ఉండగలదు.
ఈ ఎంఒయు భూగర్భ శాస్త్రం, ఇంకా గనుల తవ్వకాల రంగంలో భారతదేశానికి మరియు మొరాకో కు మధ్య సహకారాత్మక కార్యకలాపాలకు మరియు ఒక భూగర్భ శాస్త్ర సంబంధిత డేటా బ్యాంకు స్థాపన కు అవకాశం కల్పిస్తుంది. ఫలితంగా నూతన ఆవిష్కరణలకు బాట వేయాలనే లక్ష్యం సైతం నెరవేరగలదు.
***
(Release ID: 1532424)