మంత్రిమండలి

ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎమ్) పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం; సంయుక్త కార్య‌ద‌ర్శి స్థాయి, అంత‌కు పైబ‌డిన కొన్ని పోస్టుల స్థాయి పెంపు, ర‌ద్దు మరియు ఏర్పాటులకు నిర్ణ‌యం

Posted On: 02 MAY 2018 3:36PM by PIB Hyderabad

ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎమ్) ను , సంయుక్త కార్య‌ద‌ర్శి, ఆ పై స్థాయి కి చెందిన కొన్నిపోస్టుల ర‌ద్దు, స్థాయి పెంపు మరియు కొత్త పోస్టుల ఏర్పాటుల ద్వారా పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించేందుకు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ మొత్తం కాడ‌ర్ సంఖ్య‌ను ప్ర‌స్తుతం ఉన్న 1477 స్థాయిలో ఉంచడం జ‌రుగుతుంది.
 
      పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ వ‌ల్ల‌, ఐబిఎమ్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత స‌మ‌ర్ధంగా నిర్వ‌హించ‌గ‌లుగుతుంది.  అలాగే మిన‌ర‌ల్ రంగంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డానికి, నియంత్ర‌ణ‌ల ప‌రివ‌ర్త‌న‌కు ఉప‌క‌రిస్తుంది.  మిన‌ర‌ల్ రెగ్యులేశన్‌, అభివృద్ధి రంగంలో ఐబిఎమ్ మ‌రింత మెరుగ్గా చురుకుగా ప‌నిచేయ‌డానికి,ఐటి, స్పేస్ టెక్నాలజీని అందిపుచ్చుకోవ‌డానికి ఇది వీలు క‌ల్పిస్తుంది.   ఇంకా చెప్పుకోవాలంటే, కొత్త‌గా ఏర్పాటు చేసే  పోస్టులు  సంస్థ కార్య‌క‌లాపాల విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి, జ‌వాబుదారిత్వానికి మ‌రింతగా ఉప‌క‌రిస్తాయి.

ప్ర‌భావం:

 ఈ ప్ర‌తిపాద‌న వ‌ల్ల ఈ రంగంలో మొత్తంగా మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు ఏర్ప‌డ‌తాయి.  మిన‌ర‌ల్ రంగంలో స‌త్వ‌ర అభివృద్ధికి వీలుగా అత్యంత బాధ్య‌త‌తో ప‌నిచేసేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానం క‌ల వారికి  మ‌రిన్ని ప్ర‌త్య‌క్ష ఉపాధి అవ‌కాశాలు ఏర్ప‌డ‌నున్నాయి.   ఐబిఎమ్ ప‌నితీరు మ‌రింత మెరుగుప‌డ‌డం మైనింగ్ రంగానికి ప్ర‌యోజ‌న‌క‌రం కానుంది.

వివ‌రాలు:

ఐబిఎమ్ లో సంయుక్త కార్య‌ద‌ర్శి స్థాయిలో కొన్ని పోస్టుల స్థాయి పెంపు, కొత్త పోస్టుల ఏర్పాటు, మ‌రి కొన్నింటి ర‌ద్దు కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఎ.              లెవ‌ల్ 15 లో ఛీఫ్ కంట్రోల‌ర్ ఆఫ్ మైన్స్ పోస్టు 1 ఏర్పాటు, లెవ‌ల్ 14 లో కంట్రోల‌ర్ ఆఫ్ మైన్స్ పోస్టులు 3 ఏర్పాటు
బి.             11 పోస్టుల స్థాయి పెంపు. అందులో 1 పోస్టుల లెవ‌ల్ 15 నుండి 16 వ‌ర‌కు ఒక కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ పోస్టు ఏర్పాటు.  లెవ‌ల్ 14 నుండి 15 వ‌ర‌కు ఒక్కొక్క‌టి రెండు పోస్టులు ఛీఫ్ కంట్రోల‌ర్ ఆఫ్ మైన్స్ అండ్ డైరెక్ట‌ర్ (ఓర్ డ్ర‌స్సింగ్‌) ఏర్పాటు, అలాగే 8 పోస్టుల స్థాయి పెంపు.  (5 కంట్రోల‌ర్ ఆప్ మైన్స్ పోస్టులు, ఛీఫ్ మిన‌ర‌ల్ ఎకాన‌మిస్ట్‌, ఛీఫ్ ఓర్ డ్ర‌స్సింగ్ ఆఫీస‌ర్‌, ఛీఫ్ మైనింగ్ జియాల‌జిస్ట్‌) ప్ర‌స్తుత 13 ఎ నుంచి 14 స్థాయిలో పెంపు. మ‌రియు,     
సి.             లెవ‌ల్ 14 జీతం స్థాయి లోని ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీసు కు చెందిన అధికారి , ప్ర‌స్తుత కాడర్ పోస్ట్ అయిన 1 డిప్యూటి డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (స్టాటిస్టిక్స్‌) పోస్టు ర‌ద్దు

పూర్వరంగం:

                    ఐబిఎమ్ ను భార‌త ప్ర‌భుత్వం 1948 మార్చి 1న మినిస్ట్రీ ఆఫ్ వ‌ర్క్స్‌, మైన్స్‌, ప‌వ‌ర్ కింద ఏర్పాటు చేసింది.  తొలుత దీనిని ఒక స‌ల‌హా సంస్థ గా ఏర్పాటు చేశారు.  మైనింగ్ రంగంలో విధానాల రూప‌క‌ల్ప‌న‌కు స‌హ‌క‌రించ‌డానికి, చ‌ట్ట‌ప‌ర‌మైన విధివిధానాల రూప‌క‌ల్ప‌న‌కు , మిన‌ర‌ల్ రంగంలో వ‌న‌రుల స‌ద్వినియోగం, అభివృద్ధి విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌ల‌హా ఇవ్వ‌డానికి దీనిని ఏర్పాటు చేశారు.  అయితే ఆ త‌రువాత కాలంలో ఐబిఎమ్ పాత్ర మారుతున్న ప‌రిస్థితులకు అనుగుణంగా ఫెసిలిటేట‌ర్‌, మైనింగ్ రంగపు నియంత్రణదారు సంస్థ గా మారింది (బొగ్గు, పెట్రోలియం, అటామిక్ మిన‌ర‌ల్స్ మిన‌హా).

           2008 లో తీసుకువ‌చ్చిన  జాతీయ మిన‌ర‌ల్ పాల‌సీ (ఎన్ ఎమ్ పి) నేప‌థ్యంలో ఐబిఎమ్ పాత్ర‌, దాని కార్య‌క‌లాపాలను  స‌మ‌గ్రంగా స‌మీక్షించి, పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించేందుకు గ‌నుల శాఖ ఒక క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీ 
4-5-2012 న త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించింది.  ఈ నివేదిక‌ను మంత్రిత్వ‌శాఖ ఆమోదించింది.

               మిన‌ర‌ల్ రంగం ఫెసిలిటేష‌న్‌, రెగ్యులేష‌న్‌కు సంబంధించి ఐబిఎమ్ ద్వారా గ‌నుల మంత్రిత్వ‌శాఖ ఎన్నో చ‌ర్య‌లు తీసుకొంది.
       
1)  గ‌నుల కార్య‌క‌లాపాల‌కు సంబంధించి శాస్త్ర‌, ప‌ర్యావ‌ర‌ణ‌, సామాజిక అంశాల కు సంబంధించి తీసుకునే చొర‌వ‌ను దృష్టిలో ఉంచుకుని గ‌నుల‌కు స్టార్ రేటింగ్ ఇవ్వ‌డం, సుస్థిరాభివృద్ధి ఫ్రేమ్ వ‌ర్క్ (ఎస్‌డిఎఫ్‌) అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకొంది.

2)  భాస్క‌రాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేశన్‌, జియో ఇన్ఫర్మాటిక్స్ (బిఐఎస్‌ఎజి) స‌హాయంతో గ‌నుల లీజు కు ఇచ్చిన 500 మీట‌ర్ల జోన్‌ లో అక్ర‌మ మైనింగ్‌ ను ఉప‌గ్ర‌హ ఛాయాచిత్రాల స‌హాయంతో క‌నిపెట్ట‌డం, ఇందుకు సంబంధించి గ‌నుల నిఘా వ్య‌వ‌స్థ‌ను (ఎంఎస్‌ఎస్‌)అబివృద్ధి చేయ‌డం జ‌రిగింది.

3) మిన‌ర‌ల్ ప్రాసెసింగ్ విష‌యంలో  ప‌రిశోధ‌న అభివృద్ధిపై దృష్టి కేంద్రీక‌రించ‌డం జ‌రిగింది.  త‌క్కువ స్థాయి ఓర్‌ను అప్‌గ్రేడ్ చేయ‌డానికి  ప్రాసెస్ అబివృద్ధి , మిన‌ర‌ల్ రంగ కార్య‌క‌లాపాల‌ను కంప్యూట‌రైజ్ చేయ‌డానికి ఐటి ఆధారిత మైనింగ్‌, ట్రీట్‌మెంట్  
వ్య‌వ‌స్థ‌(ఎంటిఎస్‌) ఏర్పాటు వంటివి చేప‌ట్ట‌డం జ‌రిగింది.

ఐబిఎమ్ ఇటీవ‌లి కాలంలో చేప‌ట్టిన కొత్త కార్య‌క‌లాపాలు, చోర‌వ‌కు అనుగుణంగా , మారిన దాని స్వ‌భావం, కార్య‌క‌లాపాలు, మారిన విధానాలు చ‌ట్టాలకు అనుగుణంగా సంస్థ‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల నేప‌థ్యంలో ఐబిఎమ్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ అవ‌స‌రమైంది. 

మిన‌ర‌ల్ బ్లాక్‌ల‌ను ఉన్న‌త‌స్థాయి పార‌ద‌ర్శ‌క‌త‌తో వేలం వేయ‌డంలో రాష్ట్రాల‌కు ఐబిఎమ్ స‌హ‌క‌రిస్తోంది. మిన‌ర‌ల్ రాయితీలకేటాయింపుల‌ విష‌యంలోనూ దీని పాత్ర ఉంది.  వేలం బ్లాక్‌ల జాబితా త‌యారీ, స‌గ‌టు అమ్మ‌కపు ధ‌ర ప్ర‌క‌ట‌న‌, వేలం అనంత‌రం 

ప‌ర్య‌వేక్ష‌ణ‌, అనుమ‌తుల ప్ర‌క్రియ‌లో రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు ఐబిఎమ్ స‌హ‌క‌రిస్తోంది.
ఐబిఎమ్ కార్యాలయాల‌ను రీ లొకేట్ చేయ‌డం ఇప్ప‌టికే దానికి అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డానికి ఉప‌క‌రిస్తోంది. రాయ్‌పుర్‌, గాంధీన‌గ‌ర్‌ల‌లో కొత్త ప్రాంతీయ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించారు. గౌహ‌తిలోని ఉప ప్రాంతీయ కార్యాల‌యాన్ని ప్రాంతీయ‌కార్యాల‌యం స్థాయికి పెంచారు.  ప్ర‌స్తుతం కోల్‌క‌తా, ఉద‌య్ పుర్‌ల‌ లోని ప్రాంతీయ కార్యాల‌యాల‌ను జోన‌ల్ కార్యాల‌యం ( తూర్పు), జోన‌ల్ కార్యాల‌యం ( ఉత్త‌రం)గా స్థాయి పెంచారు.  నైపుణ్యాభివృద్ధి కి సంబంధించి ఉద‌య్‌పుర్ లో సుస్థిరాభివృద్ధి ఫ్రేమ్ వ‌ర్క్ ఇన్‌స్టిట్యూట్‌, హైద‌రాబాద్ లో రిమోట్ సెన్సింగ్ కేంద్రం, కోల్‌క‌తా లో జాతీయ స్థాయి శిక్ష‌ణ కేంద్రాలైన‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స‌స్టెయిన‌బుల్ మైనింగ్‌ను ఏర్పాటు చేయడమైంది.  వారాణసీ లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు.


*** 



(Release ID: 1531071) Visitor Counter : 66