Infrastructure
భారతదేశ ఇంధన ప్రస్థానం: విస్తరిస్తున్న సామర్థ్యం, పటిష్ఠమవుతున్న భద్రత
प्रविष्टि तिथि:
13 AUG 2026 15:26 PM
భారతదేశ ఇంధన రంగ ముఖచిత్రం
పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఇంధన భద్రతను పటిష్ఠం చేస్తూ స్వచ్ఛమైన భవిష్యత్తుకు మద్దతు ఇచ్చేలా భారత ఇంధన రంగం రూపాంతరం చెందుతోంది. పునరుత్పాదక ఇంధనం, అణుశక్తి, పెట్రోలియం, సహజ వాయువు, బొగ్గు, వర్ధమాన సాంకేతికతలు ఈ పరివర్తనలో భాగంగా ఉన్నాయి.
విధానపరమైన సహాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశీయ ఉత్పత్తి, తయారీ విస్తరణ, ఇంధన వనరులకు విస్తృత అందుబాటు ఈ పరివర్తనకు రూపమిస్తున్నాయి. శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు దేశీయ ఇంధన వనరులను బలోపేతం చేస్తూ భవిష్యత్తు కోసం కొత్త సాంకేతికతలను భారత్ అభివృద్ధి చేస్తోంది.
ముఖ్య గణాంకాలు:
* మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం: 2014లో 249 గిగావాట్లు కాగా, 2026 జూలైలో దాదాపు 552 గిగావాట్లకు చేరింది.
* శిలాజేతర ఇంధన సామర్థ్యం: 2026 జూలై 31 నాటికి 300.50 గిగావాట్లు. మొత్తం స్థాపిత సామర్థ్యంలో దీని వాటా 54 శాతానికి పైగా ఉంది.
* పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.
బొగ్గుతో ఇంధన భద్రతకు బలం
భారత ఇంధన భద్రత, విద్యుత్ సరఫరాలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోంది. దేశ ప్రాథమిక ఇంధన అవసరాల్లో దాదాపు 55 శాతాన్ని, విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతానికి పైగా వాటాను బొగ్గు తీరుస్తోంది. భారత్‌లో దాదాపు 4,00,715 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు, వినియోగదారుగా భారత్ ఉంది.
* 2014–15 ఆర్థిక సంవత్సరంలో 609.18 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి, 2024–25లో 1,047.52 మిలియన్ టన్నులకు, 2025–26లో 1,040.08 మిలియన్ టన్నులకు చేరింది.
* సొంత అవసరాలు, వాణిజ్య మైనింగ్: 2025–26లో సొంత అవసరాలు, వాణిజ్య గనుల నుంచి ఉత్పత్తి 210.46 మిలియన్ టన్నులకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 10.22 శాతం వృద్ధి నమోదైంది.
* దిగుమతులపై ఆధారపడటం తగ్గింపు: థర్మల్ విద్యుత్ కేంద్రాల బొగ్గు దిగుమతులు 2024–25లో 62.5 మిలియన్ టన్నుల నుంచి 2025–26లో 45.4 మిలియన్ టన్నులకు తగ్గాయి. ఇది దాదాపు 27.4 శాతం క్షీణత.
ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం (2026)
ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు 2026 మేలో ₹37,500 కోట్ల పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
* దాదాపు ఏటా 75 మిలియన్ టన్నుల బొగ్గును వినియోగించవచ్చని అంచనా. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ సాధించాలన్న జాతీయ లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది.
* ₹2.5–3 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించవచ్చని అంచనా.
* 25 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 50 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
సౌర విద్యుత్: భారీ విస్తరణ, మరింత మందికి చేరువ
భారత స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం 2014లో 2.8 గిగావాట్ల నుంచి 2026 జూలై 31 నాటికి 164.59 గిగావాట్లకు చేరింది. భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ప్రస్తుతం సౌర విద్యుత్ అతిపెద్ద విభాగంగా ఉంది. 2025లో అమెరికా 34 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని జోడించగా, భారత్ 37 గిగావాట్లకు పైగా సామర్థ్యాన్ని జోడించి ప్రపంచంలో రెండో అతిపెద్ద సౌర వృద్ధి మార్కెట్‌గా అవతరించింది.

పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన
కోటి కుటుంబాల కోసం ₹75,021 కోట్ల మొత్తం కేటాయింపుతో 2024 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
* దేశవ్యాప్తంగా పైకప్పు సౌర విద్యుత్ వ్యవస్థల ద్వారా 51.58 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి.(ఈ గణాంకాలు 2026 ఆగస్టు 12 నాటివి)
* లబ్ధిదారులకు దాదాపు ₹28,024 కోట్ల రాయితీని బదిలీ చేశారు.
* దాదాపు 19 లక్షల కుటుంబాలకు ప్రస్తుతం సున్నా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి.
* పథకం కింద ఇప్పటివరకు మొత్తం 14.8 గిగావాట్ల పైకప్పు సౌర విద్యుత్ సామర్థ్యాన్ని ప్రారంభించారు.
ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన
ఇంధన నిల్వ వ్యవస్థలతో కూడిన తేలియాడే సౌర ఫొటోవోల్టాయిక్ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా భారత సౌర విద్యుత్ విస్తరణకు కొత్త కోణాన్ని జోడిస్తూ ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు 2026 జూలై 31న ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి ₹5,070 కోట్లు కేటాయించారు.
* లక్ష్యం: 5 వేల మెగావాట్ల తేలియాడే సౌర ఫొటోవోల్టాయిక్ ప్రాజెక్టులు.
* కనీసం రెండు గంటల వ్యవధి కలిగిన, 10 వేల మెగావాట్ గంటలకు సమానమైన అనుబంధ నిల్వ సామర్థ్యం.
* 2026–27 నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు ప్రాజెక్టులకు మంజూరు ఇవ్వనున్నారు.
పవన విద్యుత్
భారత పునరుత్పాదక ఇంధన విస్తరణలో పవన విద్యుత్ కీలక స్తంభంగా కొనసాగుతోంది. స్థాపిత పవన విద్యుత్ సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ రంగంలో వార్షిక సామర్థ్య జోడింపు, దేశీయ తయారీ కూడా పుంజుకుంటున్నాయి.
* స్థాపిత సామర్థ్యం: 2026 జూలై 31 నాటికి 58.14 గిగావాట్లు.
* 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.05 గిగావాట్ల సామర్థ్యాన్ని జోడించింది. దేశ చరిత్రలో ఒకే ఏడాదిలో నమోదైన అత్యధిక పవన విద్యుత్ సామర్థ్య జోడింపు ఇదే. 2024–25తో పోలిస్తే ఇది 46 శాతం అధికం.
* దాదాపు 28 గిగావాట్ల అదనపు పవన విద్యుత్ సామర్థ్యం అమలు దశలో ఉంది.
* పవన టర్బైన్ల తయారీ సామర్థ్యం 2014లో 10 గిగావాట్ల నుంచి 2026 మార్చి నాటికి దాదాపు 24 గిగావాట్లకు పెరిగింది. కీలక విడిభాగాల్లో ఈ రంగం 70–80 శాతం స్వదేశీకరణను సాధించింది.
* ఒక గిగావాట్ సముద్రతీర పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం ₹7,453 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకానికి 2024 జూన్ 19న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
జీవ ఇంధనం
2026 జూలై 31 నాటికి జీవ విద్యుత్ సామర్థ్యం 11.75 గిగావాట్లుగా ఉంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ వ్యవస్థ కూడా విస్తరించింది. 2026 ఆగస్టు 13 నాటికి 1,929 కంప్రెస్డ్ బయోగ్యాస్/బయో–సీఎన్‌జీ ప్లాంట్లు నమోదయ్యాయి. వీటిలో 217 ప్లాంట్లు కార్యకలాపాలు ప్రారంభించగా, 357 నిర్మాణ దశలో ఉన్నాయి.
* బయోమాస్ కో-జనరేషన్: 2026 జూలై 31 నాటికి చెరకు పిప్పి ఆధారిత సామర్థ్యం 9,821.32 మెగావాట్లు, చెరకు పిప్పితో సంబంధం లేని సామర్థ్యం 1,048.84 మెగావాట్లు.
* వ్యర్థాల నుంచి విద్యుత్: 2026 జూలై 31 నాటికి గ్రిడ్‌తో అనుసంధానించిన వ్యర్థాల నుంచి విద్యుత్ సామర్థ్యం 324.24 మెగావాట్లుగా ఉంది. గ్రిడ్‌తో అనుసంధానం లేని ప్లాంట్లు మరో 554.16 మెగావాట్ల సామర్థ్యాన్ని అందించాయి.
* జాతీయ జీవ ఇంధన కార్యక్రమం: ఆర్థిక సహాయం ద్వారా వ్యర్థాల నుంచి విద్యుత్, బయోమాస్, బయోగ్యాస్ ప్రాజెక్టులకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తోంది. ₹858 కోట్ల కేటాయింపుతో తొలి దశను 2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల వరకు అమలు చేశారు.
గోబర్‌ధన్: వ్యర్థాల నుంచి ఇంధన వృద్ధి
* గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రిసోర్సెస్ ధన్(గోబర్‌ధన్)–జాతీయ వృత్తాకార జీవ ఇంధన పథకం: 2026–27 నుంచి 2035–36 ఆర్థిక సంవత్సరాల వరకు ₹23,731 కోట్ల కేటాయింపుతో ఈ పథకానికి 2026 ఆగస్టు 6న ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
* దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడం, జాతీయ వృత్తాకార జీవ ఆర్థిక వ్యవస్థను సృష్టించడం ఈ పథకం లక్ష్యం.
జల విద్యుత్
విశ్వసనీయమైన, అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయగల విద్యుత్ ఉత్పత్తిని అందించే ముఖ్యమైన పునరుత్పాదక ఇంధన వనరుగా జల విద్యుత్ కొనసాగుతోంది. సౌర, పవన విద్యుత్ సామర్థ్యం విస్తరిస్తున్న కొద్దీ గ్రిడ్ స్థిరత్వానికి కూడా ఇది సహకరిస్తోంది. భారీ, చిన్న జల విద్యుత్‌తో కలిపి 2026 జూలై 31 నాటికి సంచిత జల విద్యుత్ సామర్థ్యం 57.24 గిగావాట్లుగా ఉంది.
చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకం
* 2026–27 నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరాల వరకు అమలు చేసేందుకు ₹2,584.60 కోట్ల కేటాయింపుతో చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకానికి 2026 మార్చిలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
* 1–25 మెగావాట్ల ప్రాజెక్టుల ద్వారా దాదాపు 1,500 మెగావాట్ల చిన్న జల విద్యుత్ సామర్థ్యాన్ని జోడించడం ఈ పథకం లక్ష్యం. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు ఇది సహాయం అందిస్తోంది.
హరిత హైడ్రోజన్
ఉద్గారాలను తగ్గించడం క్లిష్టమైన రంగాలకు స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయంగా హరిత హైడ్రోజన్ ఆవిర్భవించింది. ఇంధన భద్రత, పారిశ్రామిక వృద్ధికి కూడా ఇది తోడ్పడగలదు.
జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్:
హరిత హైడ్రోజన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఈ రంగంలోని అవకాశాలు, సవాళ్లకు వ్యవస్థాగత పరిష్కారాలను ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమంగా జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌ను ప్రభుత్వం 2023లో ప్రారంభించింది.
* 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా ₹19,744 కోట్ల కేటాయింపుతో 2023 జనవరిలో ఆమోదం తెలిపింది.
* ఉత్పత్తి సామర్థ్యం: 2026 ఫిబ్రవరి నాటికి ఏటా దాదాపు 8 వేల టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించారు.
* రవాణా: 21 మార్గాల్లో హైడ్రోజన్‌తో నడిచే 70 వాహనాల కోసం మిషన్ కింద 12 ప్రయోగాత్మక ప్రాజెక్టులను ప్రభుత్వం 2026 జూలైలో ప్రారంభించింది.
* భారత్‌లో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన ఘటంతో నడిచే రైలు 2026 జూలైలో జింద్–సోనిపట్ మార్గంలో సేవలను ప్రారంభించింది.
అణుశక్తి
గత దశాబ్ద కాలంలో భారత అణుశక్తి రంగం గణనీయంగా విస్తరించడంతో పాటు ఆధునికీకరణ దిశగా ముందడుగు వేసింది. స్వచ్ఛ ఇంధనం, స్వదేశీ సాంకేతికత, అత్యుత్తమ పనితీరుపై దృష్టితో దేశం ప్రస్తుత నిర్వహణ సామర్థ్యంతో పాటు భవిష్యత్ అవకాశాలను కూడా విస్తరించింది.
* స్థాపిత సామర్థ్యం: 2026 జూలై 31 నాటికి 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం.
* అణుశక్తి మిషన్: 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
* ప్రణాళికాబద్ధ విస్తరణ: స్వదేశీ 700 మెగావాట్ల రియాక్టర్లు, అంతర్జాతీయ సహకారంతో అభివృద్ధి చేస్తున్న వెయ్యి మెగావాట్ల రియాక్టర్ల ద్వారా 2031–32 నాటికి సామర్థ్యం 22.38 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా.
* చిన్న మాడ్యులర్ రియాక్టర్లు: చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రూపకల్పన, అభివృద్ధి, ఏర్పాటు కోసం అణుశక్తి మిషన్ ₹20 వేల కోట్లు అందిస్తోంది. 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్: కల్పాక్కంలోని 500 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ 2026 ఏప్రిల్ 6న తొలి క్రిటికాలిటీని సాధించింది. భారత మూడంచెల అణు విద్యుత్ కార్యక్రమంలో ఇది ముఖ్యమైన మైలురాయి.
శాంతి చట్టం–2025
సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(శాంతి) చట్టం-2025 లైసెన్స్ ఆధారంగా అణు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి లేదా అణుశక్తి ఉత్పత్తి, వినియోగం, వ్యర్థాల తొలగింపు కార్యకలాపాలు చేపట్టడానికి ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతిస్తోంది.
* పౌర బాధ్యత: ప్రతి అణు ప్రమాదానికి గరిష్ఠ బాధ్యత 300 మిలియన్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌కు సమానమైన రూపాయి విలువ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే మొత్తంగా ఉంటుంది.
* ఈ చట్టం అణుశక్తి నియంత్రణ మండలికి చట్టబద్ధ హోదా కల్పిస్తూ దాని నియంత్రణ, భద్రతా విధులను బలోపేతం చేస్తోంది.
భూతాప శక్తి
సౌర, పవన విద్యుత్ వంటి హెచ్చుతగ్గులు కలిగిన వనరులకు అనుబంధంగా భూతాప శక్తి విశ్వసనీయమైన పునరుత్పాదక ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. భూమిలో నిల్వ ఉన్న ఉష్ణాన్ని విద్యుత్ ఉత్పత్తికి లేదా నేరుగా వేడిని అందించేందుకు భూతాప శక్తి వినియోగిస్తుంది.
జాతీయ భూతాప శక్తి విధానం(2025 సెప్టెంబరు 15న నోటిఫికేషన్)
* భూతాప వనరుల అన్వేషణ, అభివృద్ధి, వినియోగానికి ఈ విధానం ఒక కార్యాచరణ చట్రాన్ని అందిస్తోంది.
* 381 వేడి నీటి బుడగల్లో చేపట్టిన అన్వేషణ ఆధారంగా భారత భూతాప శక్తి సామర్థ్యం దాదాపు 10,600 మెగావాట్లుగా ఉన్నట్లు భారత భూవైజ్ఞానిక సర్వేక్షణ సంస్థ అంచనా వేసింది. వీటిలో 42 భూతాప ఉనికి ప్రాంతాలను ఆశాజనకమైనవిగా గుర్తించింది.
* సాంకేతిక భాగస్వామ్యాలు, పరిజ్ఞాన బదిలీ, సంయుక్త పరిశోధన–అభివృద్ధిని ఈ విధానం ప్రోత్సహిస్తోంది. భూతాప శక్తి రంగంలో ఆస్ట్రేలియా, ఐస్‌లాండ్, సౌదీ అరేబియా, అమెరికాతో భారత్‌కు సహకార వ్యవస్థలు ఉన్నాయి.
* నమూనా ఉత్పత్తి కేంద్రం, వనరుల అంచనా ప్రాజెక్టులు, సౌర–భూతాప మిశ్రమ ప్లాంట్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు 2025 జూలై–ఆగస్టు మధ్య మంజూరు ఇచ్చారు. భూతాప అనువర్తనాల సాంకేతిక–ఆర్థిక సాధ్యాసాధ్యాలను నిర్ధారించడం వీటి లక్ష్యం.
మారుతున్న భారత ఇంధన వినియోగ ముఖచిత్రం
స్వచ్ఛమైన వంట ఇంధనం అందుబాటులోకి తీసుకురావడం ఒకప్పుడు సవాలుగా ఉండగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుటుంబాలకు విస్తృతంగా లభించే ఇంధన ప్రత్యామ్నాయంగా మారింది. ఎల్‌పీజీ కనెక్షన్ల విస్తరణ, పెరుగుతున్న వినియోగం దేశంలోని కుటుంబాలకు ఇది మరింతగా చేరువవుతోందని తెలియజేస్తున్నాయి.
* జాతీయ ఎల్‌పీజీ పరిధి 2014లో 55.9 శాతం నుంచి 2026లో 107.2 శాతానికి పెరిగింది.
* ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్య 2014 నుంచి 2026 మధ్య 14.51 కోట్ల నుంచి 33.18 కోట్లకు పెరిగింది.
* ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 49.21 కోట్ల సిలిండర్ల రీఫిల్లులను పంపిణీ చేశారు.
* 2025–26 ఆర్థిక సంవత్సరంలో పీఎంయూవై కింద అదనంగా 25 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లకు ఆమోదం ఇచ్చారు. వీటిలో 2026 ఆగస్టు 5 నాటికి 24.84 లక్షల కనెక్షన్లను విడుదల చేశారు.
* దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 22 చమురు శుద్ధి కేంద్రాల్లో ఏటా 258.1 మిలియన్ టన్నుల స్థాపిత సామర్థ్యంతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ముడి చమురు శుద్ధి దేశంగా భారత్ నిలిచింది.
‘సముద్ర మంథన్’–జాతీయ సముద్రతీర అన్వేషణ పథకం
సముద్రతీర చమురు, గ్యాస్ అన్వేషణకు ఊతమిస్తూ ఇంధన భద్రతను పటిష్ఠం చేసేందుకు ₹84,084 కోట్ల కేటాయింపుతో 2026 జూలై 31న ఈ పథకానికి ఆమోదం తెలిపారు. భూకంప తరంగ సర్వేలు, లోతైన సముద్రంలో అన్వేషణాత్మక తవ్వకాలు, సముద్రతీర ఉత్పత్తి–రవాణా మౌలిక సదుపాయాలు ఇందులో భాగంగా ఉన్నాయి.
భవిష్యత్తు దిశగా: భారతదేశ ఇంధన రంగ నిర్మాణం
భద్రత, సుస్థిరత, ఆవిష్కరణల సమ్మేళనంతో కూడిన ఇంధన వ్యవస్థను భారత్ నిర్మిస్తోంది. శిలాజేతర ఇంధన సామర్థ్య విస్తరణకు బలమైన దేశీయ వనరులు, మౌలిక సదుపాయాలు, తయారీ, వర్ధమాన సాంకేతికతలు మద్దతు ఇస్తున్నాయి.
ఇంధన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత వైవిధ్యభరిత ఇంధన సమ్మేళనం విశ్వసనీయ విద్యుత్, మెరుగైన ఇంధన భద్రత, స్వచ్ఛమైన భవిష్యత్తుకు తోడ్పడుతుంది. నిరంతర విధానపరమైన సహాయం, సాంకేతిక పురోగతి స్థిరమైన, స్వావలంబనతో కూడిన, భవిష్యత్తుకు సిద్ధమైన ఇంధన వ్యవస్థ నిర్మాణానికి దోహదపడతాయి.
References
Cabinet
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241799®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=158349®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2292445®=48&lang=1
Ministry of New and Renewable Energy (MNRE)
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2296782®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250039®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293256®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2244667®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2245157&lang=2®=48
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250039&lang=1®=3
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291541®=48&lang=1
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2026700®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200435®=48&lang=2
https://pmkusum.mnre.gov.in/#/landing
https://mnre.gov.in/en/physical-progress/
https://mnre.gov.in/en/bio-energy-overview/
https://mnre.gov.in/en/new-technologies-overview/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1777364®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2268992®=48&lang=2
https://pmsuryaghar.gov.in/#/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249408®=3&lang=1
Ministry of Petroleum & Natural Gas
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2266034®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2295494®=3&lang=1
https://ppac.gov.in/download.php?file=rep_studies/1785837484_LPG_Profile_Report_Q1_FY_2026-27_Final_Web.pdf
https://www.pmuy.gov.in/index.aspx
https://gobardhan.eil.co.in/
Ministry of Coal
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293366®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2289973&lang=2®=48
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260621&lang=2®=3
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286591®=48&lang=1
Department of Atomic Energy (DAE)
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2198951®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=156593&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2294814®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249537®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247971&lang=2®=48
Ministry of Railways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285240®=48&lang=1
PIB Backgrounders
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150630®=3&lang=1
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=149232®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2270740®=3&lang=1
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=156593&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155990&ModuleId=3®=48&lang=2
Click here to see PDF
***
(तथ्य सामग्री आईडी: 150961)
आगंतुक पटल : 33
Provide suggestions / comments