57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ ఇఫీ వేడుకల్లో పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతను చాటిచెప్పిన తమిళ చిత్రం 'కూడు'

భూమి మానవాళిది మాత్రమే కాదని, సమస్త జీవరాశులదని పేర్కొంటూ సామరస్య జీవన విధాన ప్రాముఖ్యతను స్పష్టం చేసిన దర్శకుడు జోయల్ విజయ్

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 6:42PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340763Views: 3

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) సందర్భంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు జోయల్ విజయ్, నిర్మాతలు రాజేష్ మీనన్, గణేష్ ఎం, నటుడు వి. జయప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'కూడు' (గూడు) సినిమా విశేషాలను, దాని స్ఫూర్తిని, అందులోని పర్యావరణ సందేశాన్ని చిత్ర బృందం పంచుకుంది.

తమిళనాడులోని వాచాతి నేపథ్యంలో సాగే ఈ కథలో ఒకసారి విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో గుడ్లతో ఉన్న పిచ్చుక గూడు బయటపడుతుంది. ఆ పక్షులను కాపాడేందుకు గ్రామ పెద్ద అగస్త్యన్ మార్గదర్శకత్వంలో వ్యవసాయ రంగంలో పట్టభద్రుడైన కతిర్, గ్రామస్తులు కలిసి 35 రోజుల పాటు కరెంటు లేకుండా ఉండాలని నిర్ణయించుకుంటారు. వారి నిర్ణయానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ఆ పక్షి గూడును సురక్షితంగా ఉంచేందుకు కతిర్, గ్రామస్తులు ఎన్నో త్యాగాలు చేస్తారు.

 

ఈ భూమి కేవలం మనుషులకే సొంతం కాదని, సమస్త జీవరాశులకు నిలయమని దర్శకుడు జోయల్ విజయ్ ఈ చిత్రం ద్వారా తెలియజేయాలనుకున్నారు. సామరస్య జీవన విధాన ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... ఇతర జీవరాశులను గౌరవించటం, రక్షించటం వాటితో కలిసిమెలిసి జీవించటం మానవుల బాధ్యతని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.

తన వ్యక్తిగత అలవాట్లను ఈ చిత్రం ప్రభావితం చేసిన తీరుని నటుడు వి. జయప్రకాష్ పంచుకున్నారు. కథా సారాంశాన్ని విన్న కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రాజెక్టును అంగీకరించినట్లు, ముఖ్యంగా ఇది నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందటం తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. ఈ చిత్రం ఇచ్చే పర్యావరణ సందేశాన్ని గుర్తుచేసుకుంటూ, రోజువారీ వినియోగానికి, చెట్ల నరికివేతకు మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించి, టిష్యూ పేపర్ వాడకం పట్ల మరింత స్పృహతో ఉండటమే వ్యక్తిగతంగా నేర్చుకున్న అతిపెద్ద విషయమని తెలిపారు. నిత్య జీవితంలో టిష్యూ పేపర్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకునేలా ఈ చిత్రం ప్రోత్సహించిందని, ఆ విధంగా సినిమా సందేశం తన వ్యక్తిగత అలవాట్లపై ప్రభావం చూపిందని ఆయన వివరించారు.

పూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఇక్కడ వీక్షించండి.

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

****


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340763
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026