57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ ఇఫీలో ‘ఫిలింస్ ఫ్రమ్ బ్రిక్స్’ విభాగంలో ప్రదర్శితమైన తొలి చిత్రం రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ (పార్ట్–1)


పనాజీలో జరుగుతున్న ఉత్సవంలో పాల్గొన్న నైజీరియా, ఇండోనేషియా, రష్యా, ఇరాన్ దేశాల రాయబారులు : ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న విశ్వజనీన సినిమా

57వ ఇఫీలో మూడో రోజు రాయబారులకు సత్కారం, రెడ్-కార్పెట్ ప్రీమియర్‌తో ప్రారంభమైన బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాలకు చెందిన 21 చిత్రాల ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 7:55PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340241Views: 9

భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) మూడో రోజు నిత్య నూతనమైన భారతీయ పురాణాలకు అంతర్జాతీయ వేదిక లభించింది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ (పార్ట్ 1)... ఈ ఏడాది ‘ఫిల్మ్స్ ఫ్రం బ్రిక్స్’ విభాగంలో తొలి చిత్రంగా ప్రదర్శితమైంది.

భారతదేశంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఇతిహాసాల్లో ఒకదాని ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. తరతరాలుగా వివిధ సంస్కృతుల్లో ప్రయాణించిన కథను అంతర్జాతీయ సినీ వేదికపైకి తీసుకువచ్చింది. ఈ విభాగంలో తొలుత ప్రదర్శించిన చిత్రంగా భౌగోళిక, భాషా సరిహద్దులకు అతీతంగా ప్రజలను కలిపే సినిమా శక్తిని చాటిచెప్పే వేడుకకు నాంది పలికింది.

ప్రారంభ కార్యక్రమంలో సభ్యదేశాల దౌత్య ప్రతినిధులను సత్కరించారు. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా హై కమిషన్ రాయబారి శ్రీ సైదు దహిరు ముహమ్మద్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ సన్మానించారు. ఇండోనేషియా రాయబార కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఎర్నీ వాహియు, ముంబయిలోని రష్యన్ ఫెడరేషన్ కాన్సులేట్ జనరల్ తాత్కాలిక కాన్సుల్ జనరల్ అలెగ్జాండర్ ఫుర్సోవ్‌లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ శంభు లింగప్ప హక్కి సత్కరించారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ డాక్టర్ మోస్తఫా గోహరిఫర్, భారతదేశంలోని ఐపీఐఎస్ ప్రతినిధి డాక్టర్ ఒమిద్ బాబెలియన్‌లను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) ఛైర్మన్ శ్రీ జి. కృష్ణకుమార్ సత్కరించారు.

ఇండోనేషియా రాయబార కార్యాలయం ట్రెజరీ విభాగాధిపతి మెయిలిజా కరునియా హరహప్‌ను కూడా శ్రీ జి. కృష్ణకుమార్ సత్కరించారు. ఈ ఏడాది ‘ఫిలింస్ ఫ్రమ్ బ్రిక్స్’ విభాగంలో తొలుత ప్రదర్శించిన ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ (పార్ట్ 1)’ చిత్రానికి గుర్తింపుగా ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్ దర్శకుడు నితేష్ తివారీని సత్కరించారు.

వినోదానికి అతీతంగా సినిమాకున్న ప్రాధాన్యాన్ని ‘ఫిలింస్ ఫ్రం బ్రిక్స్’ విభాగం ప్రదర్శిస్తుంది. విభిన్న సమాజాల జీవితాలను, విలువలను, సంప్రదాయాలను, ఆకాంక్షలను తెలుసుకొనే అవకాశాన్ని సినిమాలు అందిస్తాయి. ఇవి తమ దృక్పథాలను తెలియజేసే వీలును దేశాలకు అందిస్తాయి. అదే సమయంలో సరిహద్దులకు అతీతంగా సంస్కృతులను అర్థం చేసుకొనే అవకాశాన్ని ప్రజలకు అందిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసే, సృజనాత్మక సహకారాన్ని ప్రోత్సహించే, గ్లోబల్ సౌత్ నుంచి వచ్చే సినిమాలకు  మరింత గుర్తింపును ఇచ్చే అవకాశాన్ని బ్రిక్స్ వేదిక అందిస్తుంది.

ఈ చిత్రాలన్నీ కలిసి సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఉమ్మడి మానవ అనుభవాలను ప్రదర్శించే వేడుకగా ‘ఫిలింస్ ఫ్రమ్ బ్రిక్స్’ విభాగాన్ని నిలబెడుతున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల కథలను ఒకే తెరపైకి తీసుకురావడం ద్వారా, దేశాల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో, సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడంలో, మరింత అవగాహనను పెంచడంలో సినిమా పోషించే పాత్రను ఇఫీ పునరుద్ఘాటిస్తుంది. వసుధైవ కుటుంబం లేదా ఈ ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అనే స్ఫూర్తిని ఈ ప్రదర్శన ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రజల భాషలు, చరిత్రలు, సంప్రదాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ కథలు వారిని ఎంత చేరువ చేయగలవో తెలియజేస్తుంది.

విశ్వజనీన కథలు: ‘ఫిల్మ్స్ ఫ్రం బ్రిక్స్’లో సినిమాల సాంస్కృతిక వైవిధ్య వేడుక

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో ‘ఫిలింస్ ఫ్రం బ్రిక్స్’ విభాగం... 11 సభ్యదేశాలు, 10 భాగస్వామ్య దేశాల్లో వివిధ ప్రక్రియలు, భాషలు, జీవన వాస్తవాలకు అతీతంగా విభిన్నమైన సమకాలీన కథనాలను ఒకచోట చేరుస్తుంది. నితీష్ తివారీ రూపొందించిన రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ (పార్ట్ 1), బ్రెండా లిజియా, ఎడు ఫెలిస్టోక్‌ల అమాడియో అండ్ ది హైపోథెటికల్ న్యూ వరల్డ్ లాంటి అద్భుత పౌరాణిక దృశ్యకావ్యాలు, యానిమేటెడ్ చారిత్రక పునర్నిర్మాణాల నుంచి మొదలుకొని న్గుయెన్ హోంగ్ డీప్ తెరకెక్కించిన 1982, సోమ్‌పాట్ చిడ్గాసోర్న్‌పాంగ్సే దర్శకత్వం వహించిన 9 టెంపుల్స్ టు హెవెన్, ఆండ్రీ ఎగోరోవ్ చిత్రమైన అండ్ ది స్నో వాస్ ఫాలింగ్, నైలా అల్ ఖాజా దర్శకత్వం వహించిన బాబ్, అరిఫ్ జుల్కర్నైన్ చిత్రమైన బాగా: టుమారో బిలాంగ్స్ టు నో వన్, లూయిస్ ఎర్నెస్టో డోనాస్ తెరకెక్కించిన బారాకోవా, అనస్తాసియా కుజినా చిత్రం బో బో, రషీద్ మాలికోవ్ సినిమా కాటన్, క్యాట్రిన్ వెబర్ దర్శకత్వం వహించిన డ్రీమింగ్ ఆఫ్ సెరెనాడా లాంటి హృదయాన్ని హత్తుకునే డ్రామాలు, విభిన్న శైలుల సమ్మేళన కథనాల వరకు ఈ చిత్రాలన్నీ కుటుంబ జ్ఞాపకాలు, సామాజిక ఒత్తిళ్లు, స్థిరత్వం, పర్యావరణ అనుబంధం లాంటి అంశాలను ఆవిష్కరిస్తాయి.

ఈ ఏడాది ‘స్టోరీస్ వితవుట్ బోర్డర్స్’ అనే ఇతివృత్తం పరిధిలో కూర్చిన ఈ చిత్రాల జాబితా... బ్రిక్స్ దేశాల సినిమాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును చాటుకుంటూనే సార్వజనీనమైన మానవ భావోద్వేగాలను ఎలా ఆవిష్కరిస్తాయో తెలియజేస్తుంది.

Read IFFILOID here: 

https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340241
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026