57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

వెండితెర భాషకు భాష్యం: ఐఎఫ్ఎఫ్ఐ-2026 వేడుకలకు ముందుగా సినిమా కళ, సాంకేతికత, కథన వ్యాకరణంపై సమగ్ర అవగాహన కల్పించిన పీఐబీ-ఎఫ్‌టీఐఐ కోర్సు

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2026 7:57PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2339165Views: 11

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ముందు... గుర్తింపు కలిగిన మీడియా ప్రతినిధులు, మాస్ కమ్యూనికేషన్ విద్యార్థుల కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ)ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక 'ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సు' నిర్వహించారు. దీనిలో పాల్గొన్నవారు సినిమాను ఒక గొప్ప కళారూపంగా మరింత సమగ్రంగా అర్థం చేసుకునేలా చేయడం ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం. ఉత్సవ వేడుకలతో పాటు అందులో ప్రదర్శించే చిత్రాలను మరింత అవగాహనతో, విశ్లేషణాత్మక దృష్టితో వీక్షించేందుకు వీలుగా... సినిమా భాష, సౌందర్య దృష్టి, సృజనాత్మక ప్రక్రియలను ఈ కోర్సు ద్వారా వారికి పరిచయం చేశారు.

 

ప్రారంభోత్సవ సభనుద్దేశించి పీఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వత్స్ శర్మ మాట్లాడుతూ, సినిమాను కేవలం వినోద సాధనంగా మాత్రమే కాకుండా... దాని వ్యాకరణం, తత్వం, దృశ్య భాషను లోతుగా అర్థం చేసుకుని ఆస్వాదించాల్సిన ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు. అనంతరం శ్రీ మహేష్ కుమార్ మాట్లాడుతూ... సినిమాను దేశకాలాలకు, సాంకేతిక-పారిశ్రామిక రంగాలకు చెందిన ఒక విశిష్ట కళారూపంగా అభివర్ణించారు. సమాజంపై, సంస్కృతిపై సినిమా చూపే ప్రభావాన్ని మెరుగుపరచడంలో దృశ్య సాంకేతికతలు, ఆధునిక సాంకేతికత, సృజనాత్మక ప్రక్రియల పరస్పర సమన్వయం ఎంతో కీలకమని ఆయన వివరించారు.

 

సినీ వార్తల ప్రచురణలో కేవలం పరిమాణానికే కాకుండా... లోతైన విశ్లేషణకు, నాణ్యతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని శ్రీమతి స్మితా వత్స్ శర్మ స్పష్టం చేశారు. కేవలం వార్తల సంఖ్యను పెంచడంపైనే దృష్టి పెట్టడం కాకుండా... సినిమా వెనక గల కళాత్మక, సాంకేతిక నైపుణ్యాలను ప్రేక్షకులకు చేరువ చేయాలని మీడియా నిపుణులను ఆమె కోరారు. మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ... ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉండే సెషన్లు, సినిమాల వీక్షణ సహా దర్శకనిర్మాతలు, సినీ ప్రముఖులతో సంభాషించే అరుదైన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని శ్రీమతి స్మితా వత్స్ శర్మ సూచించారు.

ఎఫ్‌టీఐఐ అధ్యాపకులైన ప్రొఫెసర్ డాక్టర్ ఇంద్రనీల్ భట్టాచార్య (ప్రొఫెసర్, స్క్రీన్ స్టడీస్ - రీసెర్చ్), ప్రొఫెసర్ వైభవ్ అబ్నావే (అసోసియేట్ ప్రొఫెసర్, ఫిల్మ్ డైరెక్షన్) ఈ కోర్సును నిర్వహించారు. సినిమా రూపం, చలనచిత్ర చరిత్ర, అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాణ సౌందర్యాన్ని భాగస్వాములకు పరిచయం చేసేలా ఉపన్యాసాలు, చిత్ర ప్రదర్శనలు, చర్చలు, విశ్లేషణాత్మక అభ్యాసాల మేళవింపుతో ఈ సెషన్లను రూపొందించారు. ‘సినిమాలోని కాలం, ప్రదేశం’, ‘యానిమేటెడ్ డాక్యుమెంటరీలు’, ‘నిర్మాణాత్మక విశ్లేషణ’ వంటి కీలక అంశాలపై ఇందులో ప్రత్యేకంగా దృష్టి సారించారు. చివరగా, చలనచిత్ర విమర్శపై నిర్వహించిన ప్రత్యేక సెషన్‌తో ఈ కార్యక్రమం ముగిసింది. ఇందులో పాల్గొన్నవారు... కోర్సులో నేర్చుకున్న సిద్ధాంతాలు, విమర్శనాత్మక కోణాలను అన్వయిస్తూ ‘లైఫ్‌లైన్’ చిత్రాన్ని విశ్లేషించారు.

చలనచిత్ర ఆస్వాదన మెలకువలను నేర్పడంలో వారు అందించిన సేవలకు కృతజ్ఞతగా... ఘనమైన గోవా సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే ప్రత్యేక కళాకృతులతో ఎఫ్‌టీఐఐ అధ్యాపకులను సన్మానించారు. కోర్సు పూర్తి చేసుకున్న మీడియా ప్రతినిధులకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ కుమార్, ఎఫ్‌టీఐఐ వైస్-ఛాన్సలర్, ఎన్‌ఎఫ్‌డీసీ ఎండీ శ్రీ ధీరజ్ సింగ్, పీఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వత్స్ శర్మ ధ్రువపత్రాలను అందజేశారు.

సినిమా శాస్త్రంలోని సిద్ధాంతపరమైన అవగాహనను, ఆచరణాత్మక వీక్షణ అనుభవాన్ని మేళవించడం ద్వారా... అభ్యర్థులు సినిమాలను కళాత్మకంగా ఆస్వాదించి, వాటి అంతరార్థాన్ని విశ్లేషించగల వారి నైపుణ్యాలను బలోపేతం చేయడమే ఈ కోర్సు ఉద్దేశం. ఫలితంగా, 57వ ఐఎఫ్ఎఫ్ఐ చిత్రోత్సవాన్ని మరింత సమగ్ర అవగాహనతో, విమర్శనాత్మక దృక్కోణంతో వీక్షించే సరికొత్త శక్తిని ఈ కోర్సు వారికి అందించింది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2339165
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026