నాడు పోస్టు చేయడమైనది:
17 NOV 2026 4:00PM by PIB Hyderabad
మనీలాలో జరుగుతున్న 23వ భారత్ - ఆసియాన్ సదస్సు, 21వ తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా.. గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
2025 సెప్టెంబరులో భారత్‌లో సింగపూర్ ప్రధానమంత్రి వాంగ్ అధికారిక పర్యటన సందర్భంగా ఆమోదించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక కింద సాధించిన పురోగతిని ప్రధానమంత్రులిద్దరూ సమీక్షించారు. ఆర్థిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, డిజిటలీకరణ, సుస్థిరత, కనెక్టివిటీ, ఆరోగ్య రక్షణ - వైద్యం, రక్షణ - భద్రతా సహకారం, ప్రజా - సాంస్కృతిక సంబంధాలతోపాటు ఎనిమిది ప్రాధాన్య రంగాల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా వారు చర్చించారు.
ఆసియాన్ అధ్యక్ష స్థానాన్ని చేపట్టబోతున్న సింగపూర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ మోదీ.. సదస్సు విజయవంతమయ్యేందుకు భారత్ పూర్తి సహకారాన్ని అందిస్తుందని సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ వాంగ్‌కు హామీ ఇచ్చారు.
***