నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 9:21AM by PIB Hyderabad
ప్రజా విశ్వాసంతో, సూర్య ఆరాధనతో ముడిపడిన నాలుగు రోజుల ‘ఛఠ్ మహాపర్వ్’ ఈ రోజు నుంచి ఆరంభం అవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ప్రజా విశ్వాసం, సూర్య ఉపాసనతో ముడిపడిన నాలుగు రోజుల పవిత్ర వ్రతం ‘ఛఠ్’ శుభారంభ సందర్భంలో, దేశ ప్రజలందరికీ ఇవే హర్దిక శుభకామనలు. ఈ రోజు స్నానాలు-భోజనాల పండుగరోజు. వ్రతాన్ని ఆచరిస్తున్న వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. ఛఠీ మాత ఆశీర్వాదాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.