ఆయుష్
azadi ka amrit mahotsav

నేచరోపతి దినోత్సవం-2026.. భారతదేశంలో ప్రకృతి ఆధారిత ఆరోగ్యసంరక్షణ ప్రణాళికను బలోపేతం చేస్తున్న శాస్త్రీయ పరిశోధన

‘ప్రాకృతిక చికిత్సా, స్వస్థ్ భారత్’ ఇతివృత్తంతో కర్నాటకలోని నాగమంగళలో నవంబర్ 18న తొమ్మిదో జాతీయ నేచరోపతి దినోత్సవం

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 12:12PM by PIB Hyderabad

భారతదేశంలో నేచరోపతి క్రమక్రమంగా ప్రాకృతిక వనరులతో చికిత్స చేయడమనే తన సాంప్రదాయిక అనుబంధాన్ని మించి శాస్త్రీయ పరిశోధన, రోగచికిత్స సంబంధిత మూల్యాంకనం, నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణ పద్ధతులపై ఆధారపడ్డ ఒక వ్యవస్థాగత విస్తారిత అనుబంధ ప్రణాళిక (ఇకోసిస్టమ్)గా మార్పు చెందుతోంది. జీవనశైలితో ముడిపడిన రుగ్మతలు, స్థూల కాయం, ఒత్తిడి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వృద్ధాప్యంలోకి అడుగిడటంపై ప్రజల్లో శ్రద్ధాసక్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ చికిత్స ప్రణాళికలో పోషణకు, ప్రాకృతిక ఉపచారాలకు, జీవనశైలిలో మార్పులకు పెద్ద పీట ను వేస్తుండటం వల్ల, ఇది.. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం మరిన్ని వర్గాల ఆదరణకు నోచుకొంటోంది.

తొమ్మిదో జాతీయ నేచరోపతి దినోత్సవాన్ని కర్నాటకలోని నాగమంగళలో గల సెంట్రల్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచరోపతి (సీఆర్ఐవైఎన్)లో 2026 నవంబర్ 18న పాటించనున్నారు. ఈ సందర్భానికి ‘‘ప్రాకృతిక చికిత్స, స్వస్థ్ భారత్’’ను ఇతివృత్తంగా ఎంపిక చేశారు. నేచరోపతి పట్ల , ప్రాకృతిక వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి అనుసరణలో నేచరోపతి పాత్ర పట్ల ప్రజల్లో అవగాహనను పెంపొందింప చేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సరి అయిన ఆహారం, శారీరక కార్యకలాపాలు, యోగా, ఒత్తిడిని తట్టుకోవడం, తదితర ఫలితాలను అందించగలిగే నేచరోపతి విధానాలను అవలంబించడం ద్వారా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని, మెరుగైన ఆరోగ్య సంరక్షణకు మొగ్గు చూపాలని ఈ సంవత్సర నేచరోపతి దినోత్సవ ఇతివృత్తం స్పష్టం చేస్తున్నది. స్థూల కాయం సమస్యకు గురి కాకుండా, జీవనశైలితో సంబంధం గల రుగ్మతల బారిన పడకుండా ప్రజలలో చైతన్యాన్ని పెంపొందింపచేయడం, ఆరోగ్యవంతమైన, మరింత మన్నికైన జీవనశైలిని వ్యక్తులు, సమాజం అలవరుచుకొనేటట్లుగాను ప్రోత్సహించడం ఈ దినోత్సవ లక్ష్యం. ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం గౌరవనీయ ప్రధానమంత్రి ‘ఫిట్ ఇండియా, హెల్దీ ఇండియా’ దృష్టికోణానికి అనుగుణంగా ఉంది. ముందుజాగ్రత్త చర్యలు ప్రధానంగా ఉండే ఆరోగ్య సంరక్షణ, స్వస్థ జీవనశైలి, ప్రజాసంక్షేమానికి పాటుపడటం మన అందరి బాధ్యత అని ఫిట్ అండ్ హెల్దీ ఇండియా చెబుతున్నది.

ఆయుష్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ మాట్లాడుతూ, ‘‘జీవనశైలికి, ప్రకృతికి, సమగ్ర స్వస్థతకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని నేచరోపతి మనం అర్థం చేసుకొనేటట్లు చేస్తుంది. విశ్వసనీయ పరిశోధనలు, నాణ్యమైన విద్య, సాంప్రదాయిక ఆరోగ్య సంరక్షణ పద్ధతులతో బాధ్యతాయుత ఏకీకరణ.. ఈ మార్గాల్లో ఈ చికిత్స పద్ధతికున్న శాస్త్రీయ పునాదిని బలపరచడానికి మేం ప్రాధాన్యాన్నిస్తున్నాం. ఈ వైఖరి నివారణ ప్రధాన ఆరోగ్య సంరక్షణకు దన్నుగా నిలుస్తూనే ఫిట్ అండ్ హెల్దీ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకుపోవడానికి కూడా తోడ్పడుతుంది’’ అన్నారు.

ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ, ‘‘నేచరోపతికి విశ్వసనీయత పెరిగి, మరింత ఆదరణ లభించాలంటే ఈ చికిత్సా పద్ధతికి శాస్త్రీయ చెల్లుబాటు లభించడం కీలకం. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ యోగా అండ్ నేచరోపతి (సీసీఆర్‌వైఎన్), ఇతర సంస్థల ద్వారా వ్యవస్థాగత పరిశోధనను, రోగ నిర్ధారణకు ఉద్దేశించిన పరీక్షలను (క్లినికల్ ఇవాల్యుయేషన్), సహకారాన్ని ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల తగిన శాస్త్రీయ కొలమానాల ద్వారా ప్రాకృతిక చికిత్స పద్ధతుల మూల్యంకనం సాధ్యపడుతుంది. అలాగే వాటిని బాధ్యతాయుత చికిత్స పద్ధతిలో చేర్చేందుకు కూడా వీలు ఉంటుంది’’ అన్నారు.

 

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ యోగా అండ్ నేచరోపతి (సీసీఆర్‌వైఎన్) పరిశోధన పత్రాలు అనేకం 2025-26 ఆర్థిక సంవత్సరంలో పీర్-రివ్యూ పత్రికల్లో వచ్చాయి. కాగా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని అయిదు పరిశోధన సంస్థలు కలిసి 653 పత్రాలను ప్రచురించాయి. ఈ కౌన్సిల్‌కు దేశవ్యాప్తంగా 22 యూనిట్లు కూడా ఉన్నాయి. పరిశోధన, విద్య, సంబంధాల పరంగా కౌన్సిల్ సంస్థాగత ఉనికి విస్తరించిన తీరును ఈ యూనిట్లు అద్దం పడుతున్నాయి.

అచ్చంగా యోగా, నేచరోపతిలలో విద్యాబోధన, పరిశోధనకు అంకితమైన స్నాతకోత్తర సంస్థలు ఏర్పాటు కావడంతో భారతదేశంలో సంస్థాగత స్వరూపం పరిధి నానాటికీ విస్తరిస్తోంది. దీనికి అదనంగా, హర్యానాలోని ఝజ్జర్‌లో కర్నాటకలోని నాగమంగళలో 200 పడకల సామర్థ్యం కలిగిన యోగా, నేచరోపతి ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేశారు. పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచరోపతి (ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో నిసర్గ్ గ్రామ్‌లో గల బ్యాచిలర్ ఆఫ్ నేచరోపతి అండ్ యోగిక్ సైన్సెస్ (బీఎన్‌వైఎస్) కాలేజీ.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నెలకొల్పిన ఈ కోవకు చెందిన మొదటి కళాశాల. ఈ సంస్థ నేచరోపతి, యోగాలో విద్యాబోధన, క్లినికల్ ట్రయినింగ్, పరిశోధన ద్వారా నేర్చుకోవడంతో పాటు ఆచరణాత్మక అనుభవాలను అందిసతూ ఈ విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను మరింత పటిష్టపరుస్తోంది. ఆరోగ్యసంరక్షణ, పరిశోధన, శిక్షణ, ప్రయివేటు ప్రాక్టీస్ రంగాల్లో కెరియర్ కోసం ఇక్కడ పట్టభద్రులను తీర్చిదిద్దుతున్నారు.

పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచరోపతి (ఎన్ఐఎన్) ఒక ప్రత్యేక పరిశోధన విభాగం ద్వారాను, ఆరోగ్యపరిశోధన విభాగంలో రిజిస్టరైన ఒక సంస్థాగత ఎథిక్స్ కమిటీ ద్వారాను తన పరిశోధన ప్రధాన ఫ్రేంవర్కును బలోపేతం చేసుకుంది. ఇది నిర్వహిస్తున్న కార్యక్రమాలలో రిసర్చ్ మెథడాలజీ వర్క్‌షాపులు, మంచి క్లినికల్ ప్రాక్టీస్ శిక్షణ, పరిశీలనాత్మక అధ్యయనాలు, వ్యవస్థాగత సమీక్షలు, సహకార ప్రధాన పరిశోధన వంటివి ఉన్నాయి.

ఆరోగ్యదాయక ఆహార పద్ధతులకు, శారీరక కార్యకలాపాలకు, తగినంత విశ్రాంతికి, ఒత్తిడి నిర్వహణకు నేచరోపతి పెద్దపీటను వేస్తోంది. ఈ నేపథ్యంలో నేచరోపతిలో పరిశోధనకు ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. జీవనశైలితో ముడిపడిన ఈ చర్యలు వివిధ వయోవర్గాల ప్రజలకు నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణను అనుసరించడంలో తోడ్పడగలుగుతాయి. జీవనశైలితో సంబంధమున్న అపాయ కారకాల విషయంలో చైతన్యాన్ని ఇవి పెంపొందిస్తాయి.  

జాతీయ నేచరోపతి దినోత్సవం సందర్భంగా, నేచరోపతికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలని పటిష్టపరచడం, సంస్థాగత సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడంపైన కూడా దృష్టి సారిస్తారు. నిరంతర పరిశోధన, నాణ్యతయుక్త విద్యాబోధన, ప్రజల భాగస్వామ్యం ద్వారా భారత్ విశ్వసనీయ, సౌలభ్యపూర్వక నేచరోపతి ఇకోసిస్టమ్‌ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇకోసిస్టమ్ విస్తృత ప్రాతిపదికను కలిగివుండే నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణ కృషికి పూరకంగా ఉంటూ, ‘ప్రాకృతిక చికిత్సా, స్వస్థ్ భారత్’ దార్శనికత సాకారం కావడానికి తోడ్పడుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2335467) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada