నాడు పోస్టు చేయడమైనది:
08 NOV 2026 9:07AM by PIB Hyderabad
భారతరత్న, పూర్వ ఉప ప్రధాని శ్రీ ఎల్.కె. అద్వానీ 100వ ఏట అడుగిడిన సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ అద్వానీ గారు ఇవాళ, అంటే నవంబర్ 8న 100వ ఏట అడుగు పెట్టారు.
ప్రధానమంత్రి ఒక లేఖలో తన ఆలోచనలను ప్రస్తావించారు. అందులో.. భారతదేశానికి శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు అందించిన అమూల్య తోడ్పాటును గురించి ప్రధానమంత్రి వివరించారు. అద్వానీ గారి జీవిత ప్రస్థానాన్ని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చారు. ఈ క్రమంలో.. దేశ విభజన నాటి పీడకల మొదలు, జీవితాన్ని సున్నా నుంచి మళ్లీ మొదలుపెట్టడం నుంచి, జన సంఘ్‌ను బలోపేతం చేయడం, భారతీయ జనతా పార్టీని నిర్మించడం, అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యం కోసం దృఢంగా నిలబడడం, సోమ్నాధ్ నుంచి అయోధ్య దాకా రథ యాత్రకు నాయకత్వం వహించడంతో పాటు ప్రభుత్వంలో పాలుపంచుకొని దేశానికి సేవ చేయడం వరకు జీవిత యాత్రలో ఒక్కొక్క మజిలీ అధిగమిస్తూ పురోగమించిన అంశాలు భాగంగా ఉన్నాయి.
అద్వానీ గారి ఇతర అభిరుచులను గురించి కూడా శ్రీ మోదీ పేర్కొన్నారు. వాటిలో.. పఠనం పట్ల అద్వానీ జీకి తీవ్రమైన మక్కువ ఉండటం, సంస్కృతి అన్నా సినిమాలన్నా ఆయనకున్న ప్రేమ, ఒక రచయితగా ఆయన అందించిన కీలకమైన సేవలను గురించి తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘ఇవాళ, అంటే నవంబర్ 8, ఒక చరిత్రాత్మకమైన రోజు. గౌరవనీయులైన శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు తమ జీవితంలో 100వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ విశిష్ట సందర్భంలో, ఆయనకు ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేనొక వ్యాసాన్ని రాశాను, దీనిలో భారతదేశానికి అద్వానీ గారు అందించిన చిరస్థాయి తోడ్పాటును గురించి ప్రస్తావించాను.
ఆయన పూర్తి జీవిత యాత్రను నేను గుర్తు చేసుకున్నాను. దేశ విభజన వేళ ఆ పీడకల తాలూకు వేదనను అనుభవించి, సున్నా దగ్గర నుంచి జీవితాన్ని పునర్నిర్మించడం కావచ్చు, జన సంఘ్‌ను పటిష్టం చేయడం కావచ్చు, భారతీయ జనతా పార్టీని నిర్మించడం కావచ్చు, అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి దృఢంగా నిలబడడం కావచ్చు, సోమ్‌నాథ్ నుంచి అయోధ్య దాకా రథ యాత్రకు నాయకత్వం వహించడం కావచ్చు, లేదా తిరిగి ప్రభుత్వంలో ఉండి దేశ సేవ చేయడం కావచ్చు.. ఇవన్నీ నాకు స్ఫురణకు వచ్చాయి.
అద్వానీ గారిలోని ఇతర కోణాలను గురించి కూడా నేను వివరించాను.. ఉదాహరణకు ఆయనకు పఠనం పట్ల అమిత ఇష్టం ఉండటం, సంస్కృతి అన్నా, సినిమాలన్నా ఆయనకు గల మక్కువ, ఒక రచయితగా ఆయన అందించిన తోడ్పాటు, ఇంకా ఇలాంటి మరెన్నో విషయాలను తెలియజేశాను.
English - https://www.narendramodi.in/bharat-ratna-lk-advani-ji-at-100
हिंदी - https://www.narendramodi.in/hi/bharat-ratna-lk-advani-ji-at-100 ” అని పేర్కొన్నారు.