నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 2:30PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న పునరుత్పాదక ఇంధన సదస్సు, ఎక్స్‌పో–2026 కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక పీఎం సూర్యఘర్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని రైల్వే మంత్రిత్వశాఖకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రదానం చేశారు.

ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా "కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో అత్యధిక భవనాలకు సౌర విద్యుదీకరణ’’ విభాగంలో ఈ మంత్రిత్వశాఖ అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో పునరుత్పాదక ఇంధన వినియోగానికి సంబంధించి జాతీయ స్థాయిలో స్పూర్తిదాయకమైన ప్రమాణాన్ని నెలకొల్పింది.
దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్‌కు అనువుగా ఉన్న 15,868 భవనాలను రైల్వే మంత్రిత్వశాఖ గుర్తించింది. ఇప్పటి వరకు 12,495 భవనాల్లో రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇది గుర్తించిన భవనాల సంఖ్యలో 79 శాతంగా ఉంది. నిర్దేశించుకున్న 424 మెగావాట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 351 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని మంత్రిత్వశాఖ ప్రారంభించింది.
జాతీయ స్థాయిలో 77 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 39,135 భవనాలను గుర్తించారు. వాటిలో 25,984 భవనాలకు సౌర విద్యుద్దీకరణ పూర్తయింది. ఇది గుర్తించిన భవనాల సంఖ్యలో 66 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో సాధించిన ఈ విజయానికి రైల్వే మంత్రిత్వ శాఖ గణనీయమైన స్థాయిలో సహకారం అందించింది.
గుర్తించిన వాటిలో మిగిలిన భవనాలకు సైతం 2027 మార్చి నాటికి సౌర విద్యుత్ శక్తిని ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. భారతదేశానికి పర్యావరణహితమైన, ఇంధన సామర్థ్యం ఉన్న, సుస్థిరమైన భవిష్యత్తును అందించడంలో తన అంకితభావాన్ని పునరుద్ఘాటించింది.
***