నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 10:25PM by PIB Hyderabad
పారా ఆసియా క్రీడల పురుషుల జావెలిన్ త్రో విభాగంలో భారత అథ్లెట్లు సాధించిన అద్భుతమైన క్లీన్ స్వీప్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొనియాడారు. ఈ విభాగంలో సుమిత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. మహేంద్ర గుర్జర్, సందీప్ సంజయ్ సర్గర్‌లు వరుసగా సరికొత్త క్రీడల రికార్డులతో రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకోవడాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ చారిత్రాత్మక విజయం భారతీయ పారా అథ్లెటిక్స్ రంగానికి ఎంతో గర్వకారణమైన క్షణమని పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. మన అథ్లెట్లు ఇదే రీతిలో తమ ప్రతిభతో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతూ దేశానికి నిరంతరం స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఈ విధంగా పేర్కొంది:
"పారా ఆసియా క్రీడల పురుషుల జావెలిన్ త్రోలో భారత్‌కు అపూర్వమైన క్లీన్ స్వీప్!
స్వర్ణ పతకం సాధించిన సుమిత్‌కు, సరికొత్త క్రీడల రికార్డుతో రజతాన్ని కైవసం చేసుకున్న మహేంద్ర గుర్జర్‌కు, సరికొత్త క్రీడల రికార్డుతో కాంస్య పతకాన్ని పొందిన సందీప్ సంజయ్ సర్గర్‌కు హృదయపూర్వక అభినందనలు. ఇది భారతీయ పారా-అథ్లెటిక్స్ రంగానికి అత్యంత గర్వకారణమైన క్షణం. వారు ఇదే విధంగా తమ ప్రతిభతో నూతన శిఖరాలను అధిరోహిస్తూ దేశప్రజలకు నిరంతర స్ఫూర్తిని అందించాలని కోరుకుంటున్నాను: PM @narendramodi”