ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో స్వర్ణం కైవసం చేసుకున్న సొలైరాజ్ ధర్మరాజ్‌కు ప్రధాని అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 22 OCT 2026 9:54PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు–2026లో పురుషుల లాంగ్ జంప్ టీ44/టీ62/టీ64 విభాగంలో స్వర్ణం సాధించిన సొలైరాజ్ ధర్మరాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. అద్భుతమైన జంప్ చేసి అసాధారణ ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు.

తన ఆసియా రికార్డును తానే అధిగమించి మరోసారి తన అద్భుతమైన నైపుణ్యాలను, సంకల్పాన్ని ప్రదర్శించారని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ఆసియా పారా క్రీడలు–2026లో పురుషుల లాంగ్ జంప్ టీ44/టీ62/టీ64 విభాగంలో సొలైరాజ్ ధర్మరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, అసాధారణ రీతిలో జంప్ చేసి స్వర్ణం గెలుచుకున్నారు. తన సొంత ఆసియా రికార్డును తానే అధిగమించి మరోసారి తన క్రీడా నైపుణ్యాలను, పట్టుదలను ప్రదర్శించారు. ఈ అద్భుతమైన విజయం సాధించిన సొలైరాజ్‌కు అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’ 

***


(రిలీజ్ ఐడి: 2327266) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam