నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 9:26PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఎస్‌బీ4 పోటీలో చాలా చక్కని టైమింగుతో కాంస్య పతకాన్ని గెలిచిన శ్రీ రోహిత్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
శ్రీ రోహిత్ మొదటిసారి ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొంటూ పతకాన్ని గెలవడం ఈ విజయంలో ఉన్న విశేషమని శ్రీ మోదీ కొనియాడారు. అద్భుత ప్రదర్శనను కనబరిచిన శ్రీ రోహిత్‌ను ప్రధానమంత్రి మెచ్చుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘శ్రీ రోహిత్ కుమార్‌కు ఇది మరపునకు రాని తొలి ప్రయత్నం!. ఆసియా పారా గేమ్స్-2026.. పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఎస్‌బీ4 పోటీలో ఆయన చక్కని టైమింగుతో కాంస్య పతకాన్ని సాధించారు. ఆసియా గేమ్స్‌లో మొదటిసారి పాల్గొంటూ పతకాన్ని చేజిక్కించుకోవడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. అద్భుత ప్రదర్శననిచ్చిన శ్రీ రోహిత్‌ను నేను అభినందిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
***