నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 8:14PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026.. మహిళల 100 మీటర్ల టీ12 పరుగు పందెంలో అసాధారణ ప్రతిభను కనబరిచి స్వర్ణ పతకాన్ని గెలవడంతో పాటు, కొత్త గేమ్స్ రికార్డును కూడా స్థాపించిన సిమ్‌రన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
సిమ్‌రన్ వేగం, దృఢ సంకల్పం, ఆటలో ప్రావీణ్య సాధనకు కనబరిచిన అంకితభావం నిజంగా ప్రశంసనీయమని శ్రీ మోదీ అన్నారు. రాబోయే కాలంలో కూడా ఆమె విజయపథాన సాగాలని ఆయన ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘ఆసియా పారా గేమ్స్-2026.. మహిళల 100 మీటర్ల టీ12 పరుగు పందేన్ని శ్రేష్ఠ సమయంతో పూర్తి చేసి, స్వర్ణాన్ని గెలవడమే కాకుండా గేమ్స్‌లో కొత్త ప్రమాణాన్ని నమోదు చేసినందుకు సిమ్‌రన్‌కు ఇవే అభినందనలు. ఆమె వేగం, దృఢ సంకల్పం, ఆటలో ప్రావీణ్య సాధన పట్ల చాటిన అంకితభావం నిజంగా ప్రశంసనీయం. రాబోయే కాలంలో కూడా ఆమె నిరంతరాయంగా విజయ మార్గంలో సాగాలని నేను అభిలషిస్తున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.
***