నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 6:36PM by PIB Hyderabad
ఆసియా పారా గేమ్స్-2026 పురుషుల షాట్‌పుట్ త్రో ఎఫ్53 విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న ఆయుష్ వర్మకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
షాట్‌పుట్‌లో స్వర్ణం సాధించిన ఆయుష్ ఇప్పటికే జావెలిన్ త్రోలో కాంస్యం సాధించి తన తొలి ఆసియా పారా గేమ్స్ ప్రస్థానాన్ని రెండు పతకాలతో ఘనంగా ముగించాడని కొనియాడారు. ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అంకితభావానికి ఇదొక అద్భుత నిదర్శనమని శ్రీ మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ అతని క్రీడా విజయాలు అప్రతిహతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల షాట్ పుట్ ఎఫ్53 విభాగంలో అద్భుత ప్రతిభతో స్వర్ణం సాధించిన ఆయుష్ వర్మకు అభినందనలు. ఈ స్వర్ణంతోపాటు జావెలిన్ త్రోలో కాంస్యం సాధించిన ఆయుష్- తన తొలి ఆసియా పారా గేమ్స్ ప్రస్థానాన్ని రెండు పతకాలతో విజయవంతం చేసుకున్నాడు. ఇది నిజంగా ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, పట్టుదలకు అద్భుత ఉదాహరణ. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు వివరించింది.
****