ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో కాంస్యం గెలిచిన సోనాల్‌బెన్ పటేల్‌ను అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 6:48PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడల్లో మహిళల సింగిల్స్‌ క్లాస్‌-3 విభాగంలో కాంస్య పతకం సాధించిన సోనల్‌బెన్‌ పటేల్‌పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.

ఈ విజయంతో సోనల్‌బెన్‌ పటేల్‌ ఆసియా పారా క్రీడల్లో తన తొలి వ్యక్తిగత పతకాన్ని జోడించారని ప్రధాని పేర్కొన్నారు. ఆమె క్రీడా ప్రయాణంలో ఇదొక ప్రత్యేక సందర్భమని, ఎన్నో ఏళ్ల అంకితభావం, క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘ఆసియా పారా క్రీడల్లో సోనల్‌బెన్‌ పటేల్‌ విజయం సాధించడం ఆనందంగా ఉంది. మహిళల సింగిల్స్‌ క్లాస్‌-3 విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించి, ఆసియా పారా క్రీడల్లో తన విజయాల జాబితాలో తొలి వ్యక్తిగత పతకాన్ని చేర్చుకున్నారు. ఎన్నో ఏళ్ల అంకితభావం, క్రమశిక్షణ, కఠోర శ్రమతో సాధ్యమైన ఈ విజయం ఆమె క్రీడా ప్రయాణంలో ఒక ప్రత్యేక సందర్భం” అని ప్రధాని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2325881) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam