ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో రజత పతకం సాధించిన ప్రదీప్‌ కుమార్‌కు ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 6:50PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడల్లో పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌53/54 విభాగంలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వరుసగా రెండోసారి రజత పతకం సాధించిన ప్రదీప్‌ కుమార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ప్రదీప్‌ కుమార్‌ చాలా ఏళ్లుగా సాధిస్తున్న పురోగతి, నిరంతరం తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలన్న నిబద్ధతకు, తన సామర్థ్యాల హద్దులను అధిగమించాలన్న తపనకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. నిలకడైన ప్రదర్శన, అత్యుత్తమ ప్రతిభ కలిసినప్పుడే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. ప్రశంసనీయమైన ప్రదర్శనతో పతకం సాధించిన ప్రదీప్‌కు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా అన్ని పోటీల్లో ప్రదీప్‌ కుమార్‌ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

“నిలకడైన ప్రదర్శన, అత్యుత్తమ ప్రతిభ కలిసినప్పుడే విజయాలు మరింత ప్రకాశిస్తాయి! ఆసియా పారా క్రీడల్లో పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌53/54 విభాగంలో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో ప్రదీప్‌ కుమార్‌ వరుసగా రెండోసారి రజత పతకం సాధించారు. ఏళ్లుగా ఆయన సాధిస్తున్న విజయాలు నిరంతరం తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటూ, సామర్థ్యాల హద్దులను అధిగమించాలన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ ప్రశంసనీయమైన ప్రదర్శనకు ఆయనకు అభినందనలు. భవిష్యత్తులో చేపట్టే అన్ని ప్రయత్నాల్లోనూ ఆయన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను”  అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. 

****


(రిలీజ్ ఐడి: 2325879) సందర్శకుల సూచీ సంఖ్య : : 15