ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సంగీత స్వరకర్త దేవా మృతి పట్ల ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 17 OCT 2026 3:39PM by PIB Hyderabad

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

 

తన సంతాప సందేశంలో.. దేవా తనదైన ప్రత్యేక సంగీత శైలితో, ప్రజల జీవితాలు, భావోద్వేగాలను ప్రతిబింబించే ప్రజాదరణ పొందిన ‘గానా’ పాటలతో తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాలకు సంగీతం అందించి, భారతీయ చలనచిత్ర రంగానికి చిరస్మరణీయమైన సేవలందించారని తెలిపారు.

 

దేవా అందించిన మధురమైన సంగీత స్వరాలు, ‘గానా’ సంగీతానికి ఆయన చేసిన విశిష్టమైన కృషి తరతరాల సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచిపోతాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆయన మరణం తమిళ చలనచిత్ర, సంగీత పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

 

దేవా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సినీ రంగానికి చెందినవారు, సంగీత ప్రియులకు ఉపరాష్ట్రపతి శ్రీ

సీపీ రాధాకృష్ణన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


(రిలీజ్ ఐడి: 2324791) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Malayalam