హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌తో పాటు ఢిల్లీ వెలుపల 2026 జూలై‌‌లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించిన అన్ని అంశాలపై విచారణ జరిపేందుకు ఒక ఉన్నతస్థాయి విచారణ కమిటీని (హెచ్‌పీఈసీ) ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు


బాధితులైన పోలీసు సిబ్బందితో సహా ప్రభావితమైన ప్రజలందరి సౌకర్యార్థం ఒక పోర్టల్‌ను (http://hpec.nic.in) ప్రారంభించిన హెచ్‌పీఈసీ

సుప్రీంకోర్టు 2026 ఆగస్టు 18 తేదీనాటి ఉత్తర్వులోని 12, 13 పేరాలతో పాటు 2026 సెప్టెంబర్ 10 తేదీనాటి ఉత్తర్వులోని 5(i) పేరాలో పేర్కొన్న అన్ని అంశాలను విస్తృతంగా పరిశీలించనున్న హెచ్‌పీఈసీ

పెల్లెట్ తుపాకుల వినియోగం.. మహిళా నిరసనకారులను లక్ష్యంగా చేసుకొని జరిపిన హింస, వేధింపులు.. ఇరుపక్షాల నుంచి జరిగిన తీవ్రస్థాయి హింస, ఆస్తి నష్టానికి సంబంధించిన అంశాలకు దక్కనున్న ప్రాధాన్యత

బాధిత వ్యక్తులు కోరుకుంటే వారి గుర్తింపును రహస్యంగా ఉంచటంతో పాటు ప్రమాదంలో ఉండే సాక్షులకు తగిన రక్షణ కల్పించేలా పోర్టల్ రూపకల్పన

బాధిత వ్యక్తులు, ఇతర భాగస్వాములు ఈ పోర్టల్‌ను సందర్శించి, వర్తించే ఫార్మాట్‌ల ప్రకారం తమ ఫిర్యాదులను అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచన

నాడు పోస్టు చేయడమైనది: 17 OCT 2026 5:22PM by PIB Hyderabad

ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు ఢిల్లీ వెలుపల ఉన్న ప్రాంతాల్లో 2026 జూలై నెలలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించిన అన్ని అంశాలపై విచారణ జరిపేందుకు భారత సుప్రీంకోర్టు ఒక ఉన్నతస్థాయి విచారణ కమిటీని (హెచ్‌పీఈసీ) ఏర్పాటు చేసింది. బాధిత పౌరులతో పాటు ప్రభావితమైన పోలీసు సిబ్బంది సౌకర్యార్థం హెచ్‌పీఈసీ ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను (http://hpec.nic.in) ప్రారంభించింది.

సుప్రీంకోర్టు 2026 ఆగస్టు 18 తేదీనాటి ఉత్తర్వులోని 12, 13 పేరాలు.. 2026 సెప్టెంబర్ 10 తేదీనాటి ఉత్తర్వులోని 5(i) పేరాలో పేర్కొన్న అన్ని అంశాలను హెచ్‌పీఈసీ విస్తృతంగా పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా పెల్లెట్ తుపాకుల వినియోగం.. మహిళా నిరసనకారులపై జరిగిన లక్ష్యిత హింస, వేధింపులు.. ఇరువర్గాల వైపు నుంచి జరిగిన తీవ్రస్థాయి హింస, ఆస్తి నష్టానికి సంబంధించిన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

ప్రమాదం ఉండే సాక్షులకు తగిన రక్షణ కల్పించేలా బాధిత వ్యక్తులు కోరుకుంటే వారి గుర్తింపును పూర్తి రహస్యంగా ఉంచేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు. బాధిత వ్యక్తులు, ఇతర భాగస్వాములు పోర్టల్‌ను సందర్శించి వర్తించే ఫార్మాట్‌లకు అనుగుణంగా తమ ఫిర్యాదులు అప్‌లోడ్ చేయాల్సిందిగా కోరడమైంది.

ఇది మాత్రమే కాకుండా 2026 ఆగస్టు 18, 2026 సెప్టెంబర్ 10 తేదీలలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హెచ్‌పీఈసీ పరిధిలోకి వచ్చే అంశాలపై సమాచారం లేదా సూచనలు అందించాలనుకునే ఏ వ్యక్తయినా సదరు వెబ్‌పోర్టల్ ద్వారా సమర్పించొచ్చు. ఫిర్యాదులు, లేఖలు, ఇతర సంబంధిత ఆధారాలను ప్రత్యక్షంగా సమర్పించాలనుకునే వారు అన్ని పనిదినాలలో మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య 'హెచ్‌పీఈసీ కార్యాలయం, శిక్షా సదన్, 17, రౌజ్ అవెన్యూ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ 110002' చిరునామాలో అందజేయొచ్చు. అలాగే పైన పేర్కొన్న చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా hpec2026.enquiry[at]nic[dot]in ఈ-మెయిల్ ద్వారా కూడా పంపొచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2324788) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Malayalam