రైల్వే మంత్రిత్వ శాఖ
ఆసియా క్రీడలు-2026లో స్వర్ణం సాధించిన భారత మహిళా కబడ్డీ బృందంతో రైల్ భవన్లో సమావేశమైన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
స్వర్ణం సాధించి, త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించిన భారతీయ రైల్వేలకు చెందిన మహిళా క్రీడాకారులకు కేంద్ర మంత్రి శుభాకాంక్షలు
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ద్వారా క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తోన్న భారతీయ రైల్వేలు
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 7:09PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని రైల్ భవన్లో భారతీయ మహిళా కబడ్డీ బృందానికి చెందిన సభ్యులతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ బృందం జపాన్లోని అయిచి-నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు-2026లో స్వర్ణం సాధించింది.
2026 సెప్టెంబర్ 26న జరిగిన ఫైనల్లో భారత మహిళా కబడ్డీ బృందం ఇరాన్పై 37-34 తేడాతో గెలిచి స్వర్ణం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల్లో తన టైటిల్ను నిలబెట్టుకుంది. స్వర్ణం సాధించిన భారతీయ రైల్వేకు చెందిన క్రీడాకారుణులను అభినందించారు. వారి అంకితభావం, పట్టుదల, క్రీడా నైపుణ్యంతో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి, దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. ఈ బృందానికి నీతా మోరేశ్వర్ దాద్వే కోచ్గా, పుష్పా రాణా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.
మంత్రిని కలుసుకున్న రైల్వే క్రీడాకారిణుల్లో ప్రధాన కోచ్ దక్షిణ మధ్య రైల్వేకి చెందిన నీతా మోరేశ్వర్ దాద్వే, దక్షిణ మధ్య రైల్వేకి చెందిన రీతూ నేగి, ఉత్తర రైల్వేకి చెందిన పూజ, దక్షిణ మధ్య రైల్వేకి చెందిన పింకీ రాయ్, పశ్చిమ రైల్వేకి చెందిన సోనాలి విష్ణు షింగటే, రాజ్ రాణి ఉన్నారు.
రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ద్వారా క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంలో భారతీయ రైల్వేలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనికి చెందిన క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్లు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలతో సహా ప్రధాన అంతర్జాతీయ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ఉద్యోగాలతో పాటుగా క్రీడలను కూడా కొనసాగించేందుకు సంస్థాగత సహకారం, అవకాశాలను కల్పించడం ద్వారా దేశంలో క్రీడా ప్రతిభ అభివృద్ధికి భారతీయ రైల్వేలు నిరంతరం తోడ్పడుతున్నాయి..
****
(రిలీజ్ ఐడి: 2324564)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9