ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో కెనడా విదేశాంగ మంత్రి చర్చలు కీలకమైన సహకార రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఉన్న మార్గాలపై ఉభయ పక్షాల చర్చ

· ద్వైపాక్షిక సంబంధాల్లో సానుకూల పురోగతిని స్పష్టమైన ఫలితాలుగా మార్చడానికి ఉన్న ప్రాధాన్యం గురించి వివరించిన పీఎం


· ప్రధాని మార్క్ కార్నీకి శుభాకాంక్షలు తెలియజేసిన పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 6:56PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు సమావేశమయ్యారు. 

వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, ఇంధనం, విద్య, ప్రజా సంబంధాలు, బహుపాక్షిక సహకారం లాంటి పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, సహకారాన్ని విస్తరించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలపై ప్రధానమంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఆనంద్ చర్చించారు.

సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై జరుగుతున్న చర్చలను త్వరగా పూర్తి చేయడంతో సహా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని కొనసాగించడం, దానిని స్పష్టమైన ఫలితాలుగా అనువదించడానికున్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి తెలియజేశారు.

పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పురోగతులపై తమ ఆలోచనలను పంచుకున్నారు.

ప్రధాని కార్నీకి ఆత్మీయ శుభాకాంక్షలు పీఎం మోదీ తెలియజేశారు. భాగస్వామ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలియజేశారు. 


(రిలీజ్ ఐడి: 2323599) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil