ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 7:29PM by PIB Hyderabad
ఆప్యాయపూర్వక శుభాకాంక్షలతో పాటు మంచి మాటలతో అభినందించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రధానమంత్రి కమలా పర్సాద్-బిస్సేసర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానికి ఆమె ఈ అభినందనలు తెలిపారు.
భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య స్నేహసంబంధాలు నిరంతరం కొత్త శిఖరాలను తాకుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో రెండు దేశాలు తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటాయన్న పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
"ప్రధాన మంత్రి కమలా పర్సాద్-బిస్సేసర్.. మీ ఆప్యాయపూర్వక శుభాకాంక్షలు, మంచి మాటలకు ధన్యవాదాలు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య స్నేహం నిరంతరం కొత్త శిఖరాలను తాకుతోంది. రాబోయే సంవత్సరాల్లో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం“.
(రిలీజ్ ఐడి: 2321017)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6