ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మంచి స్వభావం, సత్ప్రవర్తన ముఖ్యమంటున్న సంస్కృత సుభాషితం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 10:00AM by PIB Hyderabad

మంచి స్వభావం, సత్ప్రవర్తన ప్రధానమని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

‘‘జ్ఞానవాంశ్చ తథా వాగ్మీ కర్మస్వపి చ నిష్ఠితః

ఏవం యుక్తోపి న శ్రేయాన్ యది శీలవివర్జితః’’.

జ్ఞానవంతులు, చక్కనైన వాగ్ధాటిని కలిగివున్న వారు, అలాగే పనులను అత్యంత నిష్ఠతోనూ, నైపుణ్యంతోనూ పూర్తి చేసే వారే అయినప్పటికీ వారిలో శీలం (మంచి గుణాలు)తో పాటు సరి అయిన నడవడిక లోపిస్తే, అటువంటి వారిని నిజానికి మంచి వ్యక్తులని చెప్పలేమని దీని అర్థం.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘జ్ఞానవాంశ్చ తథా వాగ్మీ కర్మస్వపి చ నిష్ఠితః

ఏవం యుక్తోపి న శ్రేయాన్ యది శీలవివర్జితః’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2319468) సందర్శకుల సూచీ సంఖ్య : : 10