పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంయుక్త పరపతి యంత్రాంగం కోసం కార్యాచరణ మాన్యువల్‌ను ప్రారంభించిన భారత్, జపాన్

నాడు పోస్టు చేయడమైనది: 05 OCT 2026 8:26PM by PIB Hyderabad

2026 సెప్టెంబర్ 30న భారత్‌లో జపాన్ రాయబారి శ్రీ కెయిచి ఒనో, అప్పటి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ తన్మయ్ కుమార్ కలిసి న్యూఢిల్లీలో ‘భారత్ - జపాన్ సంయుక్త పరపతి యంత్రాంగం(జేసీఎం)’పై కార్యాచరణ మార్గదర్శిని  (ఆపరేషన్ మాన్యువల్)ని ఆవిష్కరించారు.

image.jpeg

 

కర్బనోద్గారాలు తక్కువగా వెలువడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణను ప్రోత్సహించడం, వాతావరణ పరిరక్షణ కోసం నిధుల సమీకరణ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం, దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉద్గారాల తగ్గింపు, నివారణ చర్యలకు తోడ్పడడం భారత్, జపాన్ సంయుక్త పరపతి యంత్రాంగం లక్ష్యం. ఇది భారత్‌లో సుస్థిరాభివృద్ధికి దోహదపడడంతోపాటు.. అంతర్జాతీయ కర్బన మార్కెట్లలో విశ్వాసాన్ని, పారదర్శకతను బలోపేతం చేస్తుంది.

2025 ఆగస్టు 7న సహకార ఒప్పంద పత్రంపై సంతకాలు, 2026 జూన్ 8న అమలు నియమావళి ఆమోదం అనంతరం.. పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 6.2 కింద భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని వ్యవస్థీకృతం చేయంలో ఈ మాన్యువల్ ఆవిష్కరణ అత్యంత కీలకమైన చర్యగా నిలవనుంది.

వ్యవస్థాగత సన్నాహకాల స్థాయి నుంచి కార్యాచరణ అమలు దశకు మారడాన్ని ఈ పరిణామం సూచిస్తుంది. అంతేకాకుండా భారత్ - జపాన్ సంయుక్త పరపతి వ్యవస్థ (జేసీఎం) కింద చేపట్టే కార్యకలాపాల కోసం స్పష్టమైన, పారదర్శకమైన, సమగ్రమైన కార్యాచరణ నియమావళిని ఇది నెలకొల్పుతుంది. ప్రాజెక్ట్ ఆలోచన పత్రం సమర్పణ నుంచి జేసీఎం క్రెడిట్ల జారీ, ఆమోదం వరకు... మొత్తం ప్రాజెక్ట్ చక్రానికి సంబంధించిన వివరణాత్మక విధానాలను మాన్యువల్ వివరిస్తుంది.  

***


(రిలీజ్ ఐడి: 2319434) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Malayalam