ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల 80 కిలోల బాక్సింగ్ స్వర్ణ పతక విజేత అంకుష్‌కు ప్రధానమంత్రి అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 6:13PM by PIB Hyderabad
ఆసియా క్రీడలలో పురుషుల 80 కిలోల బాక్సింగ్ విభాగం స్వర్ణ పతక విజేతల అంకుష్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
తుదిపోరులో ప్రత్యర్థిని మట్టిగరిపించడంలో అంకుష్ ప్రతిభ, అంకితభావం, పట్టుదల ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. అంకుష్ సాధించిన ఈ విజయంతో ఆసియా క్రీడలలో భారత బాక్సింగ్ ప్రస్థానానికి అద్భుత ముగింపు లభించిందని కొనియాడారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“స్వర్ణ పతక విజేత అంకుష్! ఆసియా క్రీడల్లో పురుషుల 80 కిలోల బాక్సింగ్ విభాగం ఫైనల్‌లో ప్రత్యర్థిపై ఘన విజయం ద్వారా పసిడి పతకం కైవసం చేసుకున్న మన బాక్సర్‌కు నా హృదయపూర్వక అభినందనలు. అతని అంకితభావం, పట్టుదల, ప్రతిభ అనిర్వచనీయం. ఈ విజయంతో ఆసియా క్రీడలలో భారత బాక్సింగ్ ప్రస్థానం అద్భుతంగా ముగిసి, మనను ఆనందోత్సాహాలలో ఓలలాడించింది” అని ప్రధానమంత్రి ప్రశంసించినట్లు పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2318615)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam