రాష్ట్రపతి సచివాలయం
గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 7:01PM by PIB Hyderabad
గాంధీ జయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తన సందేశంలో ఇలా పేర్కొన్నారు: -
“జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా ప్రజలందరి తరఫున వినమ్రపూర్వక నివాళి.
గాంధీజీ జీవితం, ఆశయాలను అంతర్జాతీయ సమాజం విశేషంగా గౌరవిస్తోంది. నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొని ఉన్న యుద్ధం, ఘర్షణ వాతావరణం అన్ని దేశాలనూ ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మహాత్మాగాంధీ శాంతి, అహింసా సందేశం మరింత సందర్భోచితంగా మారింది.
2047 నాటికి వికసిత భారత్‌గా ఎదగాలన్న జాతీయ లక్ష్యం దిశగా మన దేశం పురోగమిస్తోంది. ఈ ప్రయాణంలో సహానుభూతి, సమ్మిళితత్వ విలువలకు ప్రాధాన్యమిస్తూ.. ఏ ఒక్కరూ అభివృద్ధి ఫలాలకు దూరం కాకుండా చూసుకోవాలి. మన ఈ సంకల్పం మహాత్మాగాంధీ ‘సర్వోదయ’ ఆదర్శాన్ని ప్రతిబింబిస్తోంది. సర్వజనుల సంక్షేమం, అభ్యున్నతి సూత్రమే దీనికి ప్రాతిపదిక.
మన నైతిక వర్తన, క్రియాశీల భాగస్వామ్యం ద్వారా.. సాధికార, అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఈ పవిత్ర గాంధీ జయంతి సందర్భంగా పునరంకితమవుదాం.”
(రిలీజ్ ఐడి: 2318330)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10