ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న కుశాల్ దలాల్, సాహిల్ రాజేశ్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరులకు ప్రధాని అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 4:58PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో పురుషుల కాంపౌండ్ టీం ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న కుశాల్ దలాల్, సాహిల్ రాజేశ్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఫైనల్‌లో ఉత్కంఠభరితంగా తలపడి ఈ ముగ్గురూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారన్నారు. వారి కచ్చితత్వం, సమష్టి కృషి అద్భుతమంటూ ప్రధానమంత్రి ప్రశంసించారు.
విజేతలుగా నిలిచిన ఈ ఆర్చర్లు భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
‘‘ఆసియా క్రీడల్లో పురుషుల కాంపౌండ్ టీం విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో గెలిచి కుశాల్ దలాల్, సాహిల్ రాజేశ్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరు స్వర్ణ పతకాన్ని సాధించారు. కచ్చితత్వం, సమష్టితత్వం కలగలిసిన అద్భుత ప్రదర్శన అది. విజేతలుగా నిలిచిన మన ఆర్చర్లకు అభినందనలు. భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ... శుభాకాంక్షలు: ప్రధానమంత్రి @నరేంద్రమోదీ”
***
(రిలీజ్ ఐడి: 2317398)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8