ప్రధాన మంత్రి కార్యాలయం
పురుషుల 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్ బృంద విభాగంలో రజతం సాధించిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్‌కు ప్రధాని అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 11:59PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో పురుషుల 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్ బృంద విభాగంలో రజతం సాధించిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్‌ను ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
వారి ఏకాగ్రత, కచ్చితత్వం, సంయమనం దేశాన్ని గర్వపడేలా చేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఆసియా క్రీడల్లో పురుషుల 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్ బృంద విభాగంలో రజతం సాధించిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, నీరజ్ కుమార్, రుద్రాంక్ష్ పాటిల్‌కు అభినందనలు. వారి ఏకాగ్రత, కచ్చితత్వం, సంయమనం దేశాన్ని గర్వపడేలా చేశాయి. భవిష్యత్తు వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’.
(రిలీజ్ ఐడి: 2317033)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2