ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడలు: పురుషుల మారథాన్‌లో రజతంతో చరిత్ర సృష్టించిన సావన్ బర్వాల్‌కు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
26 SEP 2026 11:45PM by PIB Hyderabad
ఆసియా క్రీడల పురుషుల మారథాన్‌లో రజత పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుడు సావన్ బర్వాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలిపారు.
అద్భుత ప్రతిభ చూపిన బర్వాల్ కొత్త జాతీయ రికార్డుతో పాటు ఈ విభాగంలో 4 దశాబ్దాల తర్వాత భారత్‌కు తొలి పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడని ఆయన కొనియాడారు. అంతేకాకుండా భారత్‌కు విదేశాల్లో దక్కిన ఆసియా క్రీడల మారథాన్ తొలి పతకం ఇదే కావడం మరింత ప్రత్యేక సందర్భమని అభివర్ణించారు. బర్వాన్ సంకల్పం, దీక్ష, పట్టుదల అనిర్వచనీయమని, భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఆయన పంపిన సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రజలతో పంచుకుంది:
“ఆసియా క్రీడల పురుషుల మారథాన్‌లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన సావన్ బర్వాల్‌కు అభినందనలు. ఇదొక కొత్త జాతీయ రికార్డు మాత్రమేగాక నాలుగు దశాబ్దాల తర్వాత ఈ క్రీడా విభాగంలో దేశానికి లభించిన తొలి పతకం కావడం విశేషం. అందునా, విదేశాల్లో కైవసం చేసుకున్న తొలి ఆసియా క్రీడల మారథాన్ పతకం కావడం మరింత ప్రత్యేకం. బర్వాన్ దృఢ సంకల్పం, పట్టుదల, అనిర్వచనీయం. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.”PM @narendramodi"
***
(రిలీజ్ ఐడి: 2315818)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9