ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్యం గెలుచుకున్న అనంత్‌జీత్ సింగ్ నారుక, భవతేగ్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్‌కు ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 10:30PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్యం సాధించిన అనంత్‌జీత్ సింగ్ నారుక, భవ్‌తేగ్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు. ఇది గర్వించదగిన విజయమని పేర్కొన్నారు. 

వారి ఏకాగ్రత, సమష్టి కృషి ఆదర్శప్రాయమన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘ఆసియా క్రీడల్లో గర్వించదగిన విజయం!

పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్యం గెలుచుకున్న అనంత్ జీత్ నారుక, భవ్‌తేగ్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్‌కు అభినందనలు. వారి ఏకాగ్రత, సమష్టి కృషి ఆదర్శప్రాయమైనవి. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్రమోదీ’’

 

***


(రిలీజ్ ఐడి: 2314341) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Gujarati , Malayalam