భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

‘సర్’ సహా నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా తీసుకున్న సమష్టి నిర్ణయాలే

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 3:29PM by PIB Hyderabad

1.    రాజ్యాంగంలోని అధికరణ 324, చట్టబద్ధమైన నిబంధనలు, వ్యవస్థితమై ఉన్న సంస్థాగత సంప్రదాయాల ప్రకారం పనిచేసే రాజ్యాంగబద్ధ సంస్థ ‘భారత ఎన్నికల సంఘం’. పలువురు సభ్యులతో కూడిన రాజ్యాంగబద్ధ సంస్థ ఇది. పూర్తి పారదర్శకత, చట్టబద్ధత, కార్యాచరణ సామర్థ్యం దిశగా.. లిఖితపూర్వక వ్యాఖ్యానాలు, పరిశీలనలు, సాంకేతిక సూచనలు, అంతర్గత నియంత్రణ - సమతౌల్యాల వంటి ప్రామాణిక ప్రక్రియలు ఎప్పటికప్పుడు కొనసాగుతాయి. ఎన్నికల సంఘం చేపట్టే చర్యలన్నీ చట్టాలకు, కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉంటాయి.

2.    కమిషన్ జారీ చేసే అన్ని అధికారిక ఉత్తర్వులు, కమిషన్ నిర్ణయాలు, పాలనపరమైన ఆదేశాలకు చట్టబద్ధమైన పూర్తి అనుమతులుంటాయి. ఇవన్నీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు - పదవీకాలం) చట్టం- 2023 కింద పేర్కొన్న నిబంధనలు, చట్టబద్ధమైన ప్రక్రియలకు అనుగుణంగానే ఉంటాయి.

3.    ముసాయిదా దశల్లో కమిషన్ సభ్యులు లేవనెత్తే కార్యాచరణపరమైన సందేహాలు లేదా సూచనలు.. ఓటర్ల హక్కులను పరిరక్షించే లక్ష్యంతో కూడిన ప్రామాణికమైన ప్రక్రియలో భాగమే. కమిషనర్ల సూచనలు ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడానికి ఉద్దేశించినవే.

4.    నిర్ణయాలపై చర్చా ప్రక్రియలో భిన్నమైన అభిప్రాయాలు, పరిశీలనలు ఏ సంస్థలోనైనా సహజమే. తుది నిర్ణయానికి ముందు జరిగే నిర్ణయాత్మక ప్రక్రియలో ఇవి భాగం. ముగ్గురు కమిషనర్లు మాత్రమే కాదు.. కమిషన్ అధికారిక యంత్రాంగంలోని ప్రతి అధికారికీ ఎన్నికల వ్యవస్థను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా సూచనలు చేసే అధికారముంది.

5.    గడిచిన 10 నెలల కాలంలోని అనేక ఆమోదాలు, నిర్ణయాలు, ఆదేశాలు, కార్యక్రమాలను విస్మరించి.. కేవలం కొన్ని నిర్దిష్టమైన అంతర్గత వ్యాఖ్యలు/పరిశీలనలను మాత్రమే ప్రధానంగా ఎత్తిచూపడం పూర్తి వాస్తవాలను ప్రతిబింబించదు. ఇటీవలి కొన్ని నెలల్లో అనేక కీలక నిర్ణయాలను కమిషన్ తీసుకుంది. అనేక మార్గదర్శకాలను జారీ చేసింది. దాదాపు 40 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అలాగే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్ సహా)తోపాటు అనేక ఎన్నికల సంస్కరణలను చేపట్టింది. ఈ నిర్ణయాలన్నీ ఏడాది కాలంగా కమిషన్ అంతా కలసి ఏకగ్రీవంగా తీసుకున్నవే.

6.    బీహార్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలనూ, ఆ సమయంలో ఎన్నికల సంబంధిత ప్రక్రియలనూ కమిషన్ ఇటీవల విజయవంతంగా నిర్వహించింది. విస్తృతమైన పరిపాలన, కార్యాచరణ యంత్రాంగాల భాగస్వామ్యంతోపాటు.. కమిషన్ జారీ చేసిన అనేక ఆమోదాలు, నిబంధనలు ఈ విస్తృత ప్రక్రియలో అంతర్భాగంగా ఉన్నాయి.

7.    అనధికారిక మార్పులు, అవకతవకలకు తావు లేకుండా.. కఠినమైన డేటా భద్రతా నిబంధనల మేరకు ఈసీఐనెట్ వంటి కమిషన్ డిజిటల్ వేదికలు పనిచేస్తాయి. ఐటీ భద్రతా తనిఖీలు, ఆడిట్ నియంత్రణలు జాతీయ డేటాబేస్‌లలో తప్పనిసరిగా అమలు చేసే ప్రామాణిక సైబర్ భద్రతా చర్యలుగా ఉంటాయి. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలను చట్ట ప్రకారం తమకు సంక్రమించిన అధికారాల మేరకే ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వోలు), జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), సంబంధిత ఇతర అధికారులు నిర్వహిస్తారు.

8.    మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో తన కీలక పాత్రను గుర్తించి... పూర్తి పారదర్శకతతో తన రాజ్యాంగబద్ధ బాధ్యతలను నెరవేర్చడానికి భారత ఎన్నికల సంఘం కట్టుబడి ఉంది.  

 

***


(రిలీజ్ ఐడి: 2314025) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Odia , Malayalam