ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలను ప్రశంసిస్తూ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 2:25PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

భారత్‌లో ఖడ్గమృగాల సంరక్షణ కథ.. ఆ జాతి జీవుల పునరుజ్జీవనానికి అద్భుతమైన నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఖడ్గమృగాల జనాభా నిరంతరం పెరుగుతుండటంతో, ప్రపంచంలోనే ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. వీటి మనుగడకు ఆధారమైన గడ్డిభూములు, చిత్తడి నేలలను కాపాడుకోవడం ఈ జీవుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చర్యలు ఈ సంరక్షణ ప్రయాణాన్ని ఏ విధంగా బలోపేతం చేస్తున్నదీ కేంద్ర మంత్రి రాసిన ఈ వ్యాసం వివరిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

‘‘దేశంలో ఖడ్గమృగాల సంఖ్య గణనీయంగా పెరగడం ఆ జీవుల సంరక్షణలో సాధించిన విజయం.

ఖడ్గమృగాల సంఖ్య స్థిరంగా పెరుగుతున్న నేపథ్యంలోప్రపంచంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాల సంరక్షణలో అత్యంత ముఖ్య దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ జాతి మనుగడకు ఆధారమైన గడ్డి భూములు, చిత్తడి నేలలను రక్షించడం వాటి భవిష్యత్తుకు ఎంతో కీలకం.

కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన ఈ ముఖ్యమైన కథనం, ఖడ్గమృగాల సంరక్షణ ప్రయత్నాలను ప్రభుత్వ చర్యలు ఏ విధంగా బలోపేతం చేస్తున్నదీ వివరిస్తుంది’’

 

***


(రిలీజ్ ఐడి: 2314023) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Odia , Malayalam