ఆర్థిక మంత్రిత్వ శాఖ
వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్ 27 ఆదివారం నాడు పనిచేయనున్న బ్యాంకులు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 12:54PM by PIB Hyderabad
2026 సెప్టెంబరు 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) పిలుపునివ్వడం, దానికి ముందు సెప్టెంబరు 26, 27 తేదీల్లో వారాంతపు సెలవులు కూడా ఉండడంతో.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ప్రజల అత్యవసర బ్యాంకింగ్ అవసరాలకు చాలా రోజుల పాటు విఘాతం వాటిల్లకుండా చూడడం కోసం.. 2026 సెప్టెంబరు 27 ఆదివారం రోజున అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీలు) యథావిధిగా పనిచేస్తాయి.
2026 సెప్టెంబరు 27న అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతి మంజూరు చేసింది.
బ్యాంకు వినియోగదారుల సంక్షేమం, సౌలభ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేయాల్సిందిగా బ్యాంకు యూనియన్లకు ప్రభుత్వమూ, బ్యాంకు యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. అత్యవసర బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2313877)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam