రాష్ట్రపతి సచివాలయం
గణేష్ చతుర్థి సందర్భంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 4:27PM by PIB Hyderabad
గణేష్ చతుర్థి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తన సందేశంలో ఇలా పేర్కొన్నారు: -
“పవిత్రమైన గణేష్ చతుర్థి పండగ సందర్భంగా, దేశవిదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
భగవాన్ గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక. గణేష్ చతుర్థి పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుంది. జీవితంలో కొత్త సంకల్పంతో పురోగతి మార్గంలో ముందుకు సాగడానికి ఈ పవిత్రమైన పండగ మనకు స్ఫూర్తినిస్తుంది.
వినాయకుడు మనందరికీ సంతోషాన్ని, శాంతిని, మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. మనమంతా దేశ నిర్మాణానికి తోడ్పడతామని ఈ సందర్భంలో ప్రతిజ్ఞ చేద్దాం.”
***
(రిలీజ్ ఐడి: 2309896)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2